India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: కాంగ్రెస్‌ను ఓడించేందుకు మోదీ, కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మెదక్ ప్రాంతంలో ఇందిరాగాంధీ తెచ్చిన పరిశ్రమలే ఇంకా ఉన్నాయని.. బీఆర్ఎస్, బీజేపీలు ఏమీ చేయలేదని దుయ్యబట్టారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తానని మరోసారి ఉద్ఘాటించారు. వచ్చే సీజన్‌లో రూ.500 బోనస్ ఇచ్చి వరి కొనుగోలు చేస్తానని తెలిపారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. హిందీయేతర సినిమాకు బాలీవుడ్‌లో ఇంత ధర వెచ్చించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. పుష్ప సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో పార్ట్-2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’పై క్రికెట్ విశ్లేషకులు, ప్రేమికులు నెట్టింట తీవ్రంగా చర్చించుకుంటున్నారు. క్రికెట్ జట్టులో 11మంది ఆడతారన్న సంగతి తెలిసిందే. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో జట్లు ఒక ఆటగాడి స్థానంలో మరో ఆటగాడిని ఆడించొచ్చు. ఉదాహరణకు.. ఫస్ట్ బ్యాటింగ్ చేసే జట్టు తమ బౌలింగ్ సమయంలో ఓ బ్యాటర్ స్థానంలో బౌలర్‌ను తీసుకురావచ్చు. దీని వల్ల జట్లు మొత్తం 12మంది ఆటగాళ్లతో ఆడుతున్నట్లు అవుతోంది.
ఈక్రమంలో రెండు నష్టాలున్నాయి. ఆల్‌రౌండర్లతో జట్లు బౌలింగ్ వేయించడం లేదు. దీంతో నితీశ్ రెడ్డి, దూబే వంటి భారత ఆల్‌రౌండర్ల స్కిల్ మరుగున పడుతోంది. ఇక మరోవైపు బ్యాటింగ్ డెప్త్ పెరగడంతో జట్లు నిర్భయంగా ఆడుతున్నాయి. ఈ సీజన్లోనే జట్ల స్కోర్లు 4సార్లు 250ను దాటడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ కోచ్‌లు, రోహిత్ వంటి ఆటగాళ్లు సైతం ఈ రూల్‌ను తొలగించాలని అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడు. ఆయన ఎప్పుడూ ఏపీ అభివృద్ధి కోసమే తపిస్తారు. ప్రజా సేవలో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో 10 మంది సభ్యులను బీసీసీఐ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
టీమ్: రోహిత్ శర్మ (C), కోహ్లీ, పంత్, సూర్య, హార్దిక్, బుమ్రా, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్.
**జట్టు ఎంపికపై ఏప్రిల్ 27 లేదా 28న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
చైనాలోని భూభాగం ఏడాదికి 10mm చొప్పున కుంగిపోతోందని UKకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. శాటిలైట్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ‘చైనాలో 3వ వంతు ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ప్రస్తుతం సముద్ర మట్టానికి దిగువన ఉన్న చైనాలోని పట్టణ ప్రాంతం 2120 నాటికి 3 రెట్లు పెరిగి.. మరింత కుంగిపోతుంది. దీని వల్ల 55 నుంచి 128 మిలియన్ల మంది ప్రభావితమవుతారు’ అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహా హిరేమఠ్(23) <<13080714>>హత్య<<>> రాజకీయ రంగు పులుముకుంది. ఇది ‘లవ్ జిహాది’ పనేనని కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్రమంత్రి, కాంగ్రెస్ నేత పరమేశ్వర కొట్టిపారేశారు. ఫయాజ్‌ను నేహా దూరం పెట్టడంతోనే అతడు చంపేశాడని చెప్పారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించి, నేహాకు న్యాయం చేయాలని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.
జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతిని పురస్కరించుకొని GHMC కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు గ్రేటర్ HYD వ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించింది. చికెన్, మటన్ అమ్మకాలను నిషేధించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు నగరంలో తక్కువ సంఖ్యలో ఉన్న జైనుల కోసం ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా షాపులు బంద్ చేయడం ఏంటని మాంసం ప్రియులు ప్రశ్నిస్తున్నారు.
AP: సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరిని మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే అంతా బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవితాశయమని.. తప్పక సాధిస్తానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.