India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరిని మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే అంతా బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవితాశయమని.. తప్పక సాధిస్తానని చెప్పారు.
TG: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన దోనూరు అనన్య రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.
కొత్త క్రిమినల్ చట్టాలపై సీజేఐ చంద్రచూడ్ ప్రశంసల వర్షం కురిపించారు. నేర న్యాయవ్యవస్థలో సవరణలకు సిద్ధంగా భారతదేశం ఉందని చెప్పారు. ‘నేర న్యాయవ్యవస్థ పరిపాలనలో భారత పురోగతి’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరులుగా మనమంతా ఈ చట్టాలను స్వీకరిస్తే విజయవంతమవుతాయని చెప్పారు. జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.
LSGvsCSK మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కు వస్తుంటే తమ బౌలర్లు భయపడ్డారని కెఎల్.రాహుల్ అన్నారు. అతడు బ్యాటింగ్‌కు రావడం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు భారీ శబ్దాలు చేయడంతో బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారని వెల్లడించారు. ఇదే మ్యాచ్‌లో ధోనీ వస్తున్నప్పుడు తనకు వచ్చిన సౌండ్ అలర్ట్ మెసేజ్‌ను LSG బ్యాటర్ డికాక్ భార్య సైతం ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోనీ 9బంతుల్లో 28 రన్స్ చేశారు.
AP: తనకు రూ.894.92 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి అఫిడవిట్‌లో వెల్లడించారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, నగలు, బ్యాంకుల్లో డిపాజిట్ల వంటి రూపంలో ఆస్తులున్నాయి. బ్యాంకులో రూ.4.42 కోట్లు, చేతిలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. చరాస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు, రూ.2.69 కోట్ల అప్పు ఉన్నట్లు మాధవి తెలిపారు.
హరియాణాలో ఇద్దరు ఖైదీలు దారుణానికి ఒడిగట్టారు. జైలు వ్యానులో మహిళా ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డారు. రోహ్‌తక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ, మరో ఇద్దరు పురుష ఖైదీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు జైలు వ్యాన్ ఎక్కించారు. పోలీసులు డాక్యుమెంట్ వర్క్ చేస్తుండగా ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పడంతో వారు విస్తుపోయారు.
TDP అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కారు బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా’ అని తెలిపారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత పోలింగ్‌లో రెండు ప్రాంతాలు వార్తల్లో నిలిచాయి. తూర్పు నాగాలాండ్‌లోని 6 జిల్లాలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో 0% ఓటింగ్ నమోదైంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లోని మాలోగామ్ పోలింగ్ కేంద్రంలో 100% ఓటింగ్ నమోదైంది. అక్కడ ఒకే ఒక్క ఓటర్ ఉండటం.. ఆమె కూడా ఓటు వేయడంతో సంపూర్ణ ఓటింగ్ సాధ్యమైంది. <<-se>>#Elections2024<<>>
లోక్‌సభ తొలి దశ పోలింగ్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి పోలింగ్‌లో ఎన్డీఏకు అనుకూలంగా ఏకపక్ష ఓటింగ్ జరిగినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. INDIA కూటమికి నాయకుడెవరో ఆ నేతలు తేల్చుకోలేకపోతున్నారని విమర్శించారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోయారని.. ఇప్పుడు వయనాడ్ నుంచి పారిపోతారని చెప్పారు.
పాకిస్థాన్‌లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో నలుగురు మగ, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.