India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వివేకానందరెడ్డిని దారుణంగా చంపిన వారిని ఓడించాలని వైఎస్ సునీత పిలుపునిచ్చారు. పులివెందులలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తరఫున ఆమె ఇంటింటి ప్రచారం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న తమను గెలిపించాలని కోరారు. వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు ఓట్లతోనే సమాధానం చెప్పాలని కోరారు.
ED, CBIని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించుకుని దేశ స్వభావాన్ని మార్చేందుకు BJP ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేరళలోని కన్నూర్‌లో మాట్లాడుతూ.. ‘దేశంపై ఒకే చరిత్ర, ఒకే భాషను రుద్దాలని కమలం పార్టీ కోరుకుంటోంది. ఇలా ఆలోచించడం దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే. కేరళ, తమిళనాడు, బెంగాల్ వెళ్లి ఒకే భాషను అమలు చేస్తామని చెప్పగలరా? మేం భిన్న భాషలు, సంస్కృతులు, చరిత్రలను గౌరవిస్తాం’ అని తెలిపారు.
AP: సీఎం జగన్‌పై రాళ్ల దాడి వెనుక కచ్చితంగా టీడీపీ పాత్ర ఉందని YCP నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ‘సీఎంకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడతాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్ ఇప్పటికే విశాఖను రాజధానిగా ప్రకటించారు. కానీ చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. విశాఖపై విషప్రచారం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప-2 నుంచి త్వరలో మరో టీజర్ రానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. అందులో డైలాగ్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి చెందారు. దీంతో కొత్త టీజర్‌లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఉండేలా చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోందట. అనంతరం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనుందట. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన రానుందట.
షుగర్ లెవెల్స్ పెరిగేలా జైల్లో అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. ‘వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజ్రీవాల్ ప్లాన్’ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ సమర్పించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి వాదనలను రేపు వింటామని పేర్కొంది. మరోవైపు ఈడీ వాదనను కేజ్రీవాల్ లాయర్ వివేక్ జైన్ కొట్టిపారేశారు.
AP: CM జగన్‌పై రాయి దాడి కేసులో అమాయకులను బలి చేయాలనుకుంటున్నారా? అని TDP నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ‘నలుగురు మైనర్లు పోలీసుల కస్టడీలో ఉన్నారు. వారిని హింసించడం బాలల హక్కుల చట్టాన్ని ధిక్కరించడం కాదా? సతీశ్ అనే వ్యక్తి గురించి ఓ పేపర్‌లో ముందే ఎలా రాశారు? TDP సానుభూతి పరుడు దుర్గారావును ఎందుకు తీసుకెళ్లారు? అసలు దాడి చేసిన ఆయుధం దొరకకుండా హత్యాయత్నం ఎలా అవుతుంది?’ అని నిలదీశారు.
AP: ఎన్నికల వేళ విమర్శలు, ఆరోపణలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గురించి సంచలన విషయాన్ని బయట పెట్టబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘పప్పు పులకేశ్ అబద్ధాల గురించి చెప్పబోతున్నాం. ఇవాళ అతని మాస్క్ తొలగిపోతుంది. లోకేశ్ నిజస్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటారు’ అని రాసుకొచ్చింది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
AP: సీఎంగా జగన్ మనకు అవసరమా అని PCC చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘పెద్ద కోటల్లో నివసించే జగన్.. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు సిద్ధం పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రజాదర్బార్ ఉండేది. జగన్ పాలనలో ఎందుకు లేదు? సొంత ప్రయోజనాల కోసం జగన్ కేంద్రం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆశీర్వదించండి’ అని ఆమె కోరారు.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవాళ స్పెషల్ మ్యాచ్. నేడు తన 250వ ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నారు. 2008లో డెక్కన్ ఛార్జర్స్ నుంచి ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభించిన హిట్‌మ్యాన్ 6000కు పైగా రన్స్ చేశారు. ఆటగాడిగా 6, సారథిగా 5 ట్రోఫీలు సాధించారు. హ్యాట్రిక్ వికెట్లతో పాటు 2 సెంచరీలు, 100కు పైగా క్యాచులు తన ఖాతాలో వేసుకున్నారు.
TG: ఈసీ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. వివరణ ఇచ్చేందుకు తనకు వారం గడువు కావాలని కోరారు. ఇటీవల సిరిసిల్ల పర్యటనలో తమ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఇవాళ ఉ.11 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ మాజీ సీఎంకు ఎన్నికల సంఘం నోటీసులు పంపింది.
Sorry, no posts matched your criteria.