News October 29, 2024

గేమ్‌ఛేంజర్ హిందీ రైట్స్ ఎవరికంటే..

image

పాన్ ఇండియా మూవీగా రానున్న రామ్ చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ హిందీ హక్కుల్ని అనిల్ తడానీకి చెందిన AA Films దక్కించుకుంది. మూవీ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. ఇదే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ హక్కుల్ని కూడా కొనుగోలు చేయడం గమనార్హం. శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

News October 29, 2024

విజయమ్మ లేఖపై స్పందించిన షర్మిల

image

విజయమ్మ రాసిన లేఖపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ‘రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన’ అంటూ తల్లి లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జగన్‌కు, షర్మిలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ అభిప్రాయమని విజయమ్మ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆమె లేఖ వైఎస్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

News October 29, 2024

ఫ్యామిలీ విలన్ జగన్.. జస్టిస్ ఫర్ విజయమ్మ: TDP

image

AP: వైఎస్ జగన్ ఎంత సైకోనో ఆయన తల్లి విజయమ్మ రాసిన <<14483748>>లేఖలో<<>> స్పష్టమవుతోందని TDP వ్యాఖ్యానించింది. ‘కుటుంబ సభ్యులని జగన్ ఎలా వాడుకుని వదిలేస్తాడో, తండ్రి పరువు ఎలా తీస్తాడో, చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులు ఎలా లాక్కుంటాడో చెప్తూ విజయమ్మ లేఖ రాశారు. రాజకీయ ముసుగులో ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగడం ఎంత ప్రమాదమో ప్రజలు తెలుసుకోవాలి’ అని ఫ్యామిలీ విలన్ జగన్, జస్టిస్ విజయమ్మ హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్వీట్ చేసింది.

News October 29, 2024

వాషింగ్టన్ సుందర్‌ కోసం మూడు జట్ల పోటీ

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్‌కి IPLలో డిమాండ్ అమాంతం పెరిగింది. సన్‌రైజర్స్ అతడిని రిటెయిన్ చేసుకోవట్లేదన్న సమాచారం బయటికొచ్చిన నేపథ్యంలో సీఎస్కే, ముంబై, గుజరాత్ జట్లు అతడిని వేలంలో దక్కించుకోవాలని భావిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. మరి SRH సుందర్‌ని వేలంలో తిరిగి దక్కించుకుంటుందా లేక వదిలేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.

News October 29, 2024

విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు: మంత్రి గొట్టిపాటి

image

AP: ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచబోతోందని వస్తున్న వార్తలపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. కరెంట్ ఛార్జీలు పెంచడం లేదని మంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

News October 29, 2024

గాల్లో దీపంలా మహిళల భద్రత: వైసీపీ మహిళా విభాగం

image

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 మంది మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని NHRC యాక్టింగ్ ఛైర్‌పర్సన్ విజయభారతికి వైసీపీ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. ‘మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా యాప్‌ను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రంలో మహిళల భద్రత గాల్లో దీపంలా మారింది. మహిళల భద్రతపై కమిషన్ స్పందించాలి’ అని పేర్కొంది.

News October 29, 2024

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగం, తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్‌తో సీఎం చర్చిస్తున్నారు. కాగా వచ్చే నెల 6న క్యాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.

News October 29, 2024

జగన్ అధికారంలోకి రావడానికి షర్మిల ఎంతో కృషి చేసింది: విజయమ్మ

image

AP: రాజకీయాల్లో జగన్ చెప్పినట్లే షర్మిల చేసిందని వైఎస్ విజయమ్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ‘జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. ఆయన అధికారంలోకి రావడానికి పాప ఎంతో కృషి చేసింది’ అని ఆమె రాసుకొచ్చారు. అన్నీ YS కుటుంబ ఆస్తులేనని, వాటిని పంచుదాం అనుకునేలోపే YSR ప్రమాదంలో చనిపోయారని వెల్లడించారు. ఏదేమైనా జగన్, షర్మిల అన్నాచెల్లెళ్లని, ఏ సమస్య వచ్చినా ఇద్దరే పరిష్కరించుకుంటారని విజయమ్మ అన్నారు.

News October 29, 2024

హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్

image

ఇరాన్ మద్దతు గల లెబనాన్ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా చీఫ్‌గా నయీమ్ ఖాస్సేమ్ ఎంపికయ్యారు. హసన్ నస్రల్లా మృతి చెందడంతో ఆయన స్థానంలో నయీమ్‌ను నియమించారు. నయీమ్ ఇప్పటివరకు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్‌గా కొనసాగారు. నస్రల్లాతో కలిసి ఆయన యాక్టివ్‌గా పనిచేశారు. నయీమ్ 1953లో దక్షిణ లెబనాన్‌లోని క్ఫర్ ఫిలాలో జన్మించారు. తొలుత ఆయన కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేశారు. 1982లో హెజ్బొల్లాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

News October 29, 2024

ఓ బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోవడం కష్టం: విజయమ్మ

image

AP: ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా ధర్మం. నా విధి. ఇంతమంది పెద్దలు చెప్తున్న అబద్ధాల మధ్య నిజాలు తెలియాలనే మీ మందుకు వచ్చా. YSR బతికి ఉంటే ఆస్తుల సమస్య వచ్చేది కాదు. దీనిపై ఇక ఎవరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు’ అని లేఖలో కోరారు.