India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా స్వీయ దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమా ‘రాయన్’. తాజాగా ఈ మూవీ నుంచి మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. మటన్ కొట్టు రాయన్‌గా ధనుశ్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో సందీప్ కిషన్‌తో పాటు కాళిదాస్ జయరాం కూడా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
TG: గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్‌లో లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ 100 హామీలను ఇచ్చి నెరవేర్చలేకపోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు BRSకు లేదని మండిపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలను అందజేసే పార్టీ కాంగ్రెస్ అని నొక్కి చెప్పారు.
17వ లోక్‌సభ పదవీకాలం మరో 2నెలల్లో ముగియనుంది. అయితే సభకు డిప్యూటీ స్పీకర్ లేకుండానే ఈసారి అయిదేళ్లు గడిచిపోయింది. ప్రతిపక్షాలకు ఈ పదవినిచ్చే సంప్రదాయాన్ని 1956లో ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అధికార, ప్రతిపక్షాల నేతలు ఈ పదవిని అలంకరిస్తూ వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఈ పదవి పొందేందుకు సరిపడా ఎంపీలు లేకపోవడంతో కేంద్రం ఈ స్థానాన్ని ఖాళీగా ఉంచేసింది.
<<-se>>#ELECTIONS2024<<>>
విశ్వంభర సినిమా సెట్‌లో మెగాస్టార్ చిరంజీవిని టాలీవుడ్ డైరెక్టర్లు కలిశారు. మే 4న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ డే సందర్భంగా HYD ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈవెంట్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు. ఇందుకు ఆయన సమ్మతించారు. చిరంజీవితో సమావేశమైన వారిలో అనుదీప్, మెహర్ రమేశ్, సాయి రాజేశ్, శ్రీరామ్ ఆదిత్య ఉన్నారు. కాగా వశిష్ఠ డైరెక్షన్‌లో విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
AP: CM జగన్‌పై నిన్న రాయితో దాడి ఘటన నేపథ్యంలో నిఘా విభాగం అప్రమత్తమైంది. ఇటీవల గుత్తిలో CM కాన్వాయ్‌పైకి చెప్పులు విసిరిన ఘటన దృష్ట్యా జగన్ బస్సు పరిసరాల్లోకి అనుమతిపై ఆంక్షలు విధించనున్నారు. జగన్, జనానికి మధ్య బారికేడ్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే క్రేన్లు, భారీ గజమాలలు వద్దని.. వీలైనంత వరకు బస్సులోనే ఉండి రోడ్‌షో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అటు సభల్లో ర్యాంప్ వాక్ వద్దని కోరారు.
తొలిదశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 19న జరగనుంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాల్లో 1,625 మంది పోటీలో నిలిచారు. అయితే వీరిలో 165 మంది మాత్రమే మహిళా అభ్యర్థులున్నట్లు EC డేటా చెబుతోంది. 2019 ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 726గా ఉండగా.. వీరిలో 78 మంది లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాగా ఈసారి అత్యధికంగా తమిళనాడులో 76 మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>
TG: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ గెలిచే వరకు చెప్పులు తొడుక్కోనని ఓ అభిమాని శపథం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి అతనికి హితబోధ చేశారు. ‘ఓడిపోయిన నేను, నా భార్య చెప్పులేసుకుని తిరుగుతున్నాం. నీకెందుకు అంత బాధ?. నీకు ఏదైనా జరిగితే నేను ఆస్పత్రి వరకే వస్తా.. డబ్బులు ఇస్తా. అంతేగానీ నీవెంట రాలేను కదా. అభిమానం మనసులో ఉంచుకోవాలిగానీ ఇలా చేయొద్దు’ అని చెప్పారు.
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఎల్‌ఎస్‌జీపై కేకేఆర్ ఒక్క మ్యాచూ గెలవకపోవడం గమనార్హం.
కేకేఆర్ జట్టు: సాల్ట్, నరైన్, రఘువంశీ, వెంకటేశ్, శ్రేయస్, రమణ్‌దీప్, రస్సెల్, హర్షిత్, స్టార్క్, వైభవ్, వరుణ్
లక్నో జట్టు: డికాక్, రాహుల్, స్టొయినిస్, పూరన్, హుడా, క్రునాల్, బదోని, బిష్ణోయ్, మొహ్సీన్, షమార్, యశ్ థాకూర్
AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యే కొత్త పోరు జరగనుంది. చిర్ల జగ్గిరెడ్డి(YCP) హ్యాట్రిక్‌పై ధీమాతో ఉండగా, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, టీడీపీ హామీలు కలిసొస్తాయని బండారు సత్యానందరావు భావిస్తున్నారు. 7సార్లు INC, 4సార్లు TDP, 2సార్లు YCP, జనతాపార్టీ, PRP చెరోసారి గెలిచాయి. ఇక్కడ 1999 తర్వాత టీడీపీ గెలవకపోవడం గమనార్హం.
<<-se>>#ELECTIONS2024<<>>
పుష్ప-2లో తన పాత్రపై హీరోయిన్ రష్మిక కీలక వ్యాఖ్యలు చేశారు. సవాళ్లతో కూడుకున్నప్పటికీ శ్రీవల్లి పాత్రను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపారు. సీక్వెల్‌లో తన పాత్ర మరింత బలంగా ఉంటుందని.. శ్రీవల్లి 2.0ని చూస్తారన్నారు. అయితే తన పాత్ర గురించి రివీల్ చేయలేనని అన్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రష్మిక లుక్ తెగ వైరల్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.
Sorry, no posts matched your criteria.