India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలీవుడ్‌లో చాలామంది డబ్బు, ఫేమ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నారని హీరోయిన్ నోరా ఫతేహి అన్నారు. ‘ప్రేమించినట్లు నటించి డబ్బు, పేరు కోసం వారు తాపత్రయపడుతున్నారు. ఏళ్ల తరబడి వారితోనే జీవిస్తూ జీవితం నాశనం చేసుకుంటున్నారు. వారి కెరీర్ ఎక్కడికెళ్తుందో తెలియదు. తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి డిప్రెషన్‌లో జీవిస్తున్నారు. వారు ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
AP: శిరోముండనం కేసులో తీర్పు వాయిదా పడింది. 27 ఏళ్ల క్రితం ఐదుగురు దళిత యువకులకు గుండు కొట్టించి, మీసం తీయించిన ఘటనలో ఇవాళ తుది తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి సెలవులో ఉండటంతో తీర్పును ఈనెల 16కు వాయిదా వేశారు.
TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో BRS MLC కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ED, CBI చెరోవైపు ఆమెను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు కోర్టు కూడా ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తోంది. మరోవైపు IT కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెపై ముప్పేట దాడి కొనసాగుతుండటంతో ఎన్నికలయ్యేవరకూ బెయిల్ రాదని అంటున్నారు.
హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు దాదాపు అయిపోయాయి. పేటీఎం ఇన్‌సైడర్ ద్వారా ఇవాళ ఉదయం 11 గంటలకు టికెట్ల అమ్మకం ప్రారంభించగా నిమిషాల్లోనే 35 వేల మందికిపైగా లాగిన్ అయ్యారు. ఎంత ట్రై చేసినా టికెట్లు దొరకడం లేదని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్‌కు తరలించారని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ తమ జట్టులో కూడా ఉండుంటే బాగుండేదని RCB కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ అన్నారు. ‘బుమ్రాలో అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. మలింగ నేతృత్వంలో అతడు మరింత మెరుగయ్యాడు. అలాంటి క్లాస్ బౌలర్ మాకూ ఉండాలి. మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించినా.. బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. మా బౌలింగ్ పటిష్ఠంగా లేదు. మేం 250కిపైగా స్కోర్ సాధించాల్సింది’ అని ఆయన చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కోర్టు తీర్పును మధ్యాహ్నం 2గంటలకు రిజర్వ్ చేసింది. ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో CBI హాజరుపర్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఇంటర్ బోర్డు అధికారులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేశారు. కాసేపట్లోనే ఈ ఫలితాలు సర్వర్లలో అప్‌డేట్ కానున్నాయి. మరికొద్ది క్షణాలలో అందరికంటే ముందుగా వే2న్యూస్ యాప్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా దీన్ని షేర్ చేయొచ్చు. Be Ready
TG: గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో టీచర్లకు నైట్ డ్యూటీలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రెండుగా ఉన్న నైట్ డ్యూటీ టీచర్ల సంఖ్యను 4కు పెంచాలని ఆదేశించారు. ప్రిన్సిపాళ్లు కచ్చితంగా గురుకులంలోనే ఉండాలని, నైట్ డ్యూటీ టీచర్లు హాస్టళ్లలో ఉండి విద్యార్థుల కదలికలను గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు.
లిక్కర్ స్కాంలో MLC కవిత కీలక సూత్రధారి అని CBI పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ వాదనలు వినిపిస్తోంది. ఇదే కేసులో అప్రూవర్‌గా మారిన NOC పొందడంలో మాగుంట రాఘవకు సహకరించేందుకు కవిత ప్రయత్నించినట్లు ఆమె CA వాట్సాప్ చాటింగ్‌లో తేలిందని పేర్కొంది. ఢిల్లీ, HYDలో ఈ స్కాంకి స్కెచ్ వేసినట్లు వెల్లడించింది. కవిత సౌత్ గ్రూప్ నుంచి రూ.100కోట్లు సమీకరించి.. ఆప్ నేతలకు ఇచ్చినట్లు ఆరోపించింది.
Sorry, no posts matched your criteria.