News April 12, 2024

IPL: లక్నోకు బ్యాడ్‌న్యూస్.. మయాంక్ దూరం

image

ఇవాళ ఢిల్లీతో మ్యాచుకు ముందు లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సంచలన పేసర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా నేటి మ్యాచుకు దూరం కానున్నారు. ఈనెల 7న గుజరాత్‌తో గేమ్ సందర్భంగా తుంటి గాయంతో అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. గాయం ఇంకా మానకపోవడంతో ఎల్లుండి కోల్‌కతాతో గేమ్‌కూ అందుబాటులో ఉండడని LSG ప్రకటించింది. అయితే 19న చెన్నైతో మ్యాచుకు అతడు కోలుకుంటాడని ఆ జట్టు కోచ్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News April 12, 2024

కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

image

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.

News April 12, 2024

మహిళా బిలియనీర్‌కు మరణశిక్ష

image

వియత్నాంలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. దోషిగా తేలిన బిలియనీర్‌ ట్రూంగ్ మై లాన్‌‌కు మరణశిక్ష పడింది. వ్యాపారవేత్త, ప్రాపర్టీ డెవలపర్‌ అయిన ట్రూంగ్ గత 11ఏళ్లుగా వియత్నాంలోని సైగాన్ కమర్షియల్ బ్యాంకును మోసం చేసి 44 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.3.68 లక్షల కోట్లు రుణం తీసుకొని ఎగ్గొట్టారు. తాజాగా హో చి మిన్ సిటీలోని కలోనియల్ ఎరా కోర్ట్‌హౌస్ ఆమెకు మరణశిక్ష విధించింది.

News April 12, 2024

RCBలో దూకుడు కరవు.. ప్లేఆఫ్స్ కలేనా?

image

ఇప్పుడు RCB అభిమానుల్లో ఉన్నది ఒక్కటే సందేహం.. ఈసారి తమ అభిమాన జట్టు ప్లేఆఫ్స్‌‌కు చేరుతుందా? లేదా? ఇప్పటికే 6మ్యాచులు ఆడిన RCB కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. ఆ జట్టు మిగిలిన 8 మ్యాచుల్లో 7 మ్యాచులు గెలవాల్సిందే. లేకపోతే ప్లేఆఫ్స్ చేరడం కష్టం. ఇదిలా ఉంటే ఆ జట్టులో మునుపటి దూకుడు కనిపించడం లేదు. బ్యాటర్లు ఎంత స్కోర్ చేసినా.. బౌలర్ల చెత్త ప్రదర్శనతో ఓటమి తప్పడంలేదు.

News April 12, 2024

కాసేపట్లో కోర్టుకు కవిత

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన BRS ఎమ్మెల్సీ కవితను సీబీఐ కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనుంది. వారంపాటు ఆమెను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును కోరనుంది. అందుకు జడ్జి అనుమతిస్తే ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకోనుంది. కాగా ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి విచారించింది. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది.

News April 12, 2024

లోన్లు తీసుకునేవారికి షాక్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05% నుంచి 8.10శాతానికి పెరిగింది. 3నెలల లోన్లపై 8.45శాతానికి చేరుకోగా, 6నెలల రుణాలపై 8.65%, ఏడాది రుణాలపై 8.85శాతానికి పెరిగింది. ఇవి నేటి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అటు HDFC వడ్డీ రేటును పెంచడంతో గృహ రుణాలపై వడ్డీరేటు 9.05% నుంచి 9.8% మధ్య ఉంది.

News April 12, 2024

MLAగా ఓడి MPగా బరిలోకి..

image

TG: కొంతమంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్, ఆరూరి రమేశ్, రఘునందన్ రావు, నీలం మధు, RS ప్రవీణ్ కుమార్ వంటి నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.

News April 12, 2024

పాపం.. అమ్మానాన్న కోసం యువతి ఆత్మహత్య

image

TG: పేరెంట్స్ విడిగా ఉండటం తట్టుకోలేకపోయిన ఓ యువతి ప్రాణాలర్పించారు. నల్గొండలోని తిప్పర్తి మండలం మాచినపల్లిలో భర్త పగిళ్ల సైదులు, భార్య సంధ్య గత రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి యోగిత(22), చాణక్య(20) సంతానం. యోగిత HYDలో PG చదువుతోంది. తల్లిదండ్రులను కలపాలని యోగిత ఎంతో ప్రయత్నించారు. అయినా వారు కలవలేదు. అమ్మానాన్న కలిసే పరిస్థితి లేదనే మనోవేదనతో ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

News April 12, 2024

ఆర్సీబీ బౌలర్లు.. ఇక మీరు మారరా?

image

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు తేలిపోయారు. 197 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. అందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు ఇచ్చుకున్నారు. సీనియర్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, టాప్లీ కూడా భారీగా రన్స్ సమర్పించుకున్నారు. ఇక ఆకాశ్ దీప్, వైశాఖ్ కూడా పోటీ పడి కొట్టించుకున్నారు. దీంతో RCB బౌలర్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గల్లీ బౌలర్ల కంటే దారుణంగా బౌలింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

News April 12, 2024

రైతులకు గుడ్ న్యూస్!

image

ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. ఫసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్‌గా మారనుండటం నైరుతి రుతుపవనాలకు అనుకూలమన్నారు. జులై నుంచి సెప్టెంబర్ మధ్య విస్తార వర్షాలు కురుస్తాయని పేర్కొంటున్నారు. గతేడాది కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు.