News April 11, 2024

IPL.. మిగతా జట్లకు గిల్ వార్నింగ్

image

తాము బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని ఇతర జట్లు గుర్తు పెట్టుకోవాలని గుజరాత్ కెప్టెన్ గిల్ హెచ్చరించారు. ‘లక్ష్యమెంతైనా చివరి వరకు పోరాడుతాం. ప్రత్యర్థులు GTని తేలిగ్గా తీసుకోవద్దు. నిన్నటి మ్యాచ్‌లో 3 ఓవర్లలో 45 రన్స్ చేయడం కష్టమేమీ కాదు. ఇద్దరు బ్యాటర్లు 9 బంతుల్లో 22 రన్స్ చేయాలి. ఓవర్‌లో 2 లేదా 3 బంతులను ఎటాక్ చేస్తే చాలు. రషీద్ ఖాన్, తెవాటియా అదే చేశారు’ అని కొనియాడారు.

News April 11, 2024

‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర ప్రదర్శన నిలిపివేత!

image

మలయాళ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా.. PVRINOX ప్రదర్శనకు నిరాకరించింది. దీంతో సినీ ప్రేమికులు PVRINOXపై ఫైరవుతున్నారు. అయితే, దీనికొక కారణముంది. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌ ఇటీవల PDC అనే కంపెనీని ప్రారంభించింది. థియేటర్స్ దీని నుంచి డిజిటల్ ప్రింట్స్ కొనాలని తెలిపింది. దీనికి PVRINOX నిరాకరించింది. దీంతో మలయాళ డబ్బింగ్ సినిమాల ప్రదర్శనకు సైతం ఒప్పుకోవట్లేదు.

News April 11, 2024

ఫేక్ వీడియోలతో YCP గందరగోళం: చంద్రబాబు

image

AP: జగన్‌ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించారని TDP అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ‘అందుకే YCP నేతలు ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ దుస్థితికి దిగజారారు. YCP ఫేక్ ప్రచారాలను దీటుగా తిప్పికొట్టాలి. వాలంటీర్లను YCP నేతలు బానిసలుగా మార్చుకున్నారు. వారితో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని చూస్తున్నారు. YCP విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలి’ అని పార్టీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు.

News April 11, 2024

యువ నటి కలర్‌పై దారుణంగా ట్రోల్స్

image

హాలీవుడ్ మూవీ ‘మీన్ గర్ల్స్’ చిత్రంతో యువ నటి అవంతిక వందనపు పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. తాజాగా డిస్నీ ఫేమస్ క్యారెక్టర్ ‘రపుంజెల్’ పాత్రలో అవంతిక నటిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఆమె రంగును ఉద్దేశించి కొందరు వివక్షపూరితమైన కామెంట్లు చేస్తున్నారు. ఆ పాత్రను తెల్లవారే పోషించాలని, ఆమె నటించవద్దని కోరుతున్నారు. ఆమె నటిస్తారో లేదో ఇంకా క్లారిటీ లేకుండా ఇలా కామెంట్లు చేయొద్దని పలువురు సూచిస్తున్నారు.

News April 11, 2024

నకిలీ డాక్టర్ల భరతం పడుతున్న వైద్యశాఖ

image

TG: రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ నకిలీ డాక్టర్ల భరతం పడుతోంది. HYD మౌలాలీలో భోగ పాండు అనే ఫేక్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా MBBSగా చలామణీ అవుతున్నట్లు గుర్తించారు. మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయొద్దని ఇప్పటికే వైద్యశాఖ హెచ్చరించింది. అయినా కొందరు ఫేక్ డాక్టర్లు ఇష్టానుసారంగా క్లినిక్‌లు నడుపుతుండటంతో అధికారులు రైడ్స్ చేస్తున్నారు.

News April 11, 2024

సెప్టెంబర్ 5న విజయ్ ‘ది గోట్’ విడుదల

image

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో తెరకెక్కుతోన్న ‘ది గోట్’ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుందని వెల్లడించారు. లాంగ్ వీకెండ్ ఉండటంతో మేకర్స్ ఈ తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14,15,16వ తేదీలు సైతం సెలవులుండటం సినిమాకు ప్లస్ పాయింట్.

News April 11, 2024

జగన్ సంస్కరణలతో పేదరికం తగ్గింది: బొత్స

image

AP: సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలతో ఏపీలో పేదరికం తగ్గిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ చెప్పిందే చేశారన్నారు. ఆర్థిక కారణాలతో సీపీఎస్ అమలు చేయలేకపోయామని తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

News April 11, 2024

మీకు చేతకాకుంటే చెప్పండి.. మేము చూసుకుంటాం: రాజ్‌నాథ్

image

పాకిస్థాన్‌ను ఉద్దేశించి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడం పాక్‌కు చేతకాకపోతే ఆ బాధ్యతలు అందుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిరత నెలకొల్పాలని కుట్ర చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఉగ్రవాదులు పాక్‌లో తలదాచుకున్నా వెంటాడి చంపుతామన్న రాజ్‌నాథ్ ఇప్పుడు మరోసారి తన దూకుడును ప్రదర్శించారు.

News April 11, 2024

కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది: హరీశ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో కరవు లేదన్నారు. కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయి.. కొత్తగా బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్నారు.

News April 11, 2024

ఫ్యాన్స్‌కు ఎప్పుడూ మసాలా కావాలి: కోహ్లీ

image

గౌతమ్ గంభీర్, నవీన్ ఉల్ హక్‌ను హగ్ చేసుకోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారని RCB స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నారు. ఇక మసాలా అయిపోయిందని ఆయన పేర్కొన్నారు. ‘నేను అరంగేట్రం చేసినప్పుడు 4, 5 మ్యాచ్‌లు ఆడకపోతే ఉద్వాసన పలికేవారు. ఆ నాలుగైదు మ్యాచ్‌ల్లోనే మనమేంటో నిరూపించుకోవాలి. కానీ ఇప్పుడలా లేదు. ఎన్నో మ్యాచ్‌లు ఆడొచ్చు. ఫ్యాన్స్ మద్దతుగా ఉంటారు. మంచి, చెడు చెప్పేవారు ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.