News April 10, 2024

‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో వచ్చే నెల 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. డైరెక్టర్ చిదంబరం తెరకెక్కించిన ఈ మూవీకి సుశీన్ శ్యామ్ మ్యూజిక్ అందించారు. ఓ గుహలో చిక్కుకున్న స్నేహితుడిని కాపాడేందుకు మిత్రులు చేసే పోరాటమే ప్రధాన కథ.

News April 10, 2024

75 వేల ఎగువన ముగిసిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు సెన్సెక్స్ 75 వేల మార్క్ దాటింది. 354.45 పాయింట్లు లాభపడి 75,038 వద్ద ముగిసింది. ఇటు నిఫ్టీ సైతం 111 పాయింట్ల లాభంతో 22,753 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం, రిలయన్స్, ఐటీసీ, ఎయిర్‌టెల్ వంటి షేర్లలో కొనుగోళ్లు కలిసొచ్చాయి.

News April 10, 2024

కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత

image

TG: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు. స్థానిక నేతలతో చర్చించిన అనంతరం దివంగత సాయన్న కుమార్తెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ స్థానంలో మే 13న ఉపఎన్నిక జరగనుంది.

News April 10, 2024

‘లైంగిక వేధింపులు మిగిల్చిన మరకలు’

image

లైంగిక వేధింపులపై జర్మనీలోని ఓ మహిళా హక్కుల సంస్థ వినూత్న నిరసనకు దిగింది. ‘హింసను అరికట్టాలి’ అనే ప్రచారంలో భాగంగా ‘లైంగిక వేధింపులు మిగిల్చిన మరకలు’ అనే నినాదాన్ని ఇచ్చింది. దీనికి అద్దం పట్టేలా నగ్నంగా ఉన్న మహిళల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఈ విగ్రహాల ప్రైవేటు భాగాలు రంగు మారడాన్ని చూపిస్తూ.. ఏళ్లుగా మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను ఇవి ప్రతిబింబిస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

News April 10, 2024

వాలంటీర్లపై చంద్రబాబు మొసలి కన్నీరు: పోసాని

image

AP: వాలంటీర్లు ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేవాళ్లంటూ దుష్ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వాళ్లపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ‘వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని డ్రామాలు ఆడుతున్నాడు. గతంలో ఇచ్చిన ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చాడా? చంద్రబాబు మహిళల్ని చులకనగా చూస్తాడు. పురందీశ్వరి బీజేపీలో ఉండి టీడీపీ కోసం పని చేస్తున్నారు’ అని విమర్శించారు.

News April 10, 2024

YELLOW ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయంది. రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు కురవనున్నాయి.

News April 10, 2024

వచ్చే 20 ఏళ్లలో IPL ట్రోఫీలు గెలిచే టీమ్స్ ఇవే?

image

చిలక జోస్యంతో పాటు స్వామీజీలు IPL మ్యాచ్‌ల గెలుపోటములను అంచనా వేస్తుండటం చూశాం. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 20 IPL టోర్నమెంట్స్‌లో గెలిచే జట్టులను అంచనా వేసింది. AI ప్రెడిక్షన్ ప్రకారం ఈ ఏడాది IPL ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంటుంది. అలాగే 2025-CSK, 2026-MI, 2027-SRH, 2028-PBKS, 2029-RCB, 2030- DC, 2031-KKR, 2032-RR, 2033- LSG, 2034 ట్రోఫీ GT సొంతం అవుతుంది.

News April 10, 2024

సుప్రీంకోర్టుకు చేతులు జోడించి వేడుకున్న అధికారి

image

పతంజలి <<12127426>>కేసు<<>> విచారణ సందర్భంగా క్షమించమని కోరిన ఓ అధికారిపై సుప్రీంకోర్టు మండిపడింది. ‘నేను 2023 జూన్‌లో వచ్చాను. ఈ వ్యవహారం నేను రాక ముందు జరిగింది. నన్ను వదిలేయండి’ అని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారి డా.మిథిలేశ్ చేతులు జోడించి వేడుకున్నారు. ఇందుకు బదులుగా.. ‘ఎందుకు క్షమించాలి? మీరేం చర్యలు తీసుకున్నారు?’ అని ప్రశ్నించింది. అంతకుముందు పతంజలి యాజమాన్యంపై కూడా కోర్టు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

News April 10, 2024

‘సలార్-2’: 2025 సమ్మర్‌లో రిలీజ్!

image

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ‘సలార్-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభమవుతుందని సినీవర్గాలు తెలిపాయి. వచ్చే వేసవికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ ఇప్పటికే నటీనటుల డేట్స్ కన్ఫర్మ్ చేశారని సమాచారం.

News April 10, 2024

LSGలోకి రోహిత్ శర్మ?

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెగా వేలంలో హిట్‌మ్యాన్‌ను దక్కించుకోవాలని LSG ఫ్రాంచైజీ ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం. ఆయన కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్. మరోవైపు వచ్చే సీజన్‌కు ముంబైని వదిలేయాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.