News April 3, 2024

ఐపీఎలే ముద్దు

image

విదేశీ ప్లేయర్లు తమ జాతీయ జట్లకు ఆడటం కంటే ఐపీఎల్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తారనడంలో సందేహం లేదు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. ఐపీఎల్ ఆడుతున్న 8 మంది న్యూజిలాండ్ క్రికెటర్లు పాక్‌తో T20 సిరీస్ ఆడేందుకు నో చెప్పారు. దీంతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో కివీస్ జట్టును ఎంపిక చేసింది. విలియమ్సన్, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, డారిల్ మిచెల్, రచిన్, సాంట్నర్, ఫిలిప్స్ వంటి ప్లేయర్లు IPL ఆడుతున్న విషయం తెలిసిందే.

News April 3, 2024

మథుర కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముకేశ్ ధన్‌గర్‌

image

UPలోని మథుర లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ముకేశ్ ధన్‌గర్‌ పోటీ చేయనున్నారు. ఈ సీటును తొలుత బాక్సర్ విజేందర్ సింగ్‌కు కేటాయించగా, ఆయన ఇవాళ బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటును ముకేశ్‌తో భర్తీ చేసింది. ఇక్కడ బీజేపీ నుంచి నటి హేమమాలిని బరిలో ఉన్న సంగతి తెలిసిందే. మథురతో పాటు సీతాపూర్ అభ్యర్థిని కూడా హస్తం పార్టీ మార్చింది. ఇక్కడ నకుల్ దూబే స్థానంలో రాకేశ్ రాథోడ్ పోటీకి దిగనున్నారు.

News April 3, 2024

IPL చరిత్రలో అత్యధిక స్కోర్లు

image

277/3- SRH vs MI (2024)
272/7- KKR vs DC (2024*)
263/5- RCB vs PWI (2013)
257/5- LSG vs PBKS (2023)
248/3- RCB vs GL (2016)
246/5- CSK vs RR (2010)
246/5- MI vs SRH (2024)

News April 3, 2024

అలా అయితే కోహ్లీ ఖాతాలో ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలు: రవిశాస్త్రి

image

ఐపీఎల్ వ్యక్తిగత ఆట అయ్యుంటే ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎక్కువ ట్రోఫీలు గెలిచేవాడని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అది గ్రూప్ గేమ్ కావడం వల్లే కోహ్లీ ఏం చేయలేకపోతున్నాడని చెప్పారు. అతడు ధారాళంగా పరుగులు చేస్తున్నా మిగతా బ్యాటర్ల నుంచి సహాయం అందడం లేదని పేర్కొన్నారు. కాగా 16 ఏళ్లుగా ఆర్సీబీలో స్టార్స్ ఉన్నా ట్రోఫీ మాత్రం నెగ్గడం లేదు.

News April 3, 2024

నరైన్.. ఏం కొట్టావయ్యా!!

image

సునీల్ నరైన్ మరోసారి బ్యాట్‌తో మ్యాజిక్ చేశారు. ఢిల్లీపై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అలరించారు. కేవలం 39 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. 7 సిక్సర్లు, 7 ఫోర్లతో రఫ్ఫాడించారు. అంతకుముందు మ్యాచులో ఆర్సీబీపై 22 బంతుల్లోనే 47 పరుగులు చేశారు. ఈ ఆల్‌రౌండర్‌ను ఓపెనర్‌గా పంపాలన్న గంభీర్ నిర్ణయం గ్రాండ్ సక్సెస్ అయిందని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.

News April 3, 2024

‘కనీసం రూ.కోటి సంపాదించే వాడు కావాలి’.. మహిళ ప్రపోజల్

image

సాధారణంగా తనను బాగా చూసుకునే భర్త కావాలని మహిళలు కోరుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ 37ఏళ్ల మహిళ రిక్వైర్మెంట్ చూసి నెటిజన్లు నివ్వెరపోతున్నారు. ఏడాదికి రూ.4లక్షలు సంపాదించే ఈమెకు కనీసం రూ.కోటి సంపాదించే వరుడు కావాలని పేర్కొంది. ముంబైలో సొంతిల్లు, స్థిరమైన ఉద్యోగంతో పాటు బాగా చదువుకున్న కుటుంబానికి చెందిన వాడై ఉండాలట. సర్జన్ లేదా CAకి ప్రాధాన్యం ఇస్తుందట. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News April 3, 2024

‘క్రోధి’నామ సంవత్సరం అంటే?

image

ఈనెల 9న ఉగాది పండగ సందర్భంగా తెలుగు ప్రజలు ‘క్రోధి’నామ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఇది కలియుగంలో 5,125వ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని అర్థం. అంటే ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని పండితులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, దేశాల మధ్య కోపావేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.

News April 3, 2024

రూ.34 కోట్ల సొత్తు సీజ్ చేశాం: సీఈవో

image

AP: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రూ.34 కోట్ల సొత్తు సీజ్ చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో రూ.11 కోట్ల నగదు, రూ.7కోట్ల విలువైన మద్యం, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు. మొత్తం 3,300 FIRలు నమోదయ్యాయని, సీ-విజిల్ యాప్ ద్వారా 5,500 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి 3,040 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు.

News April 3, 2024

IPL: తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్లు

image

* 148/2 – SRH vs MI, హైదరాబాద్, 2024
* 141/2 – MI vs SRH, హైదరాబాద్, 2024
* 135/1 – KKR vs DC, వైజాగ్, (ఇవాళ్టి మ్యాచ్)
* 131/3 – MI vs SRH, అబుదాబి, 2021
* 131/3 – PBKS vs SRH, హైదరాబాద్, 2014
* 130/0 – డెక్కన్ ఛార్జర్స్ vs MI, ముంబై, 2008

News April 3, 2024

ప్రైవేట్ ఇంటర్ కాలేజీలకు బోర్డు వార్నింగ్

image

TG: షెడ్యూల్ రాకముందే అడ్మిషన్‌లు తీసుకుంటే చర్యలు తప్పవని రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇంకా జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.