News April 1, 2024

అల్లుఅర్జున్-అట్లీ సినిమాలో సమంత?

image

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రారంభం కానుందట. ఈ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సామ్ గతంలో అట్లీతో ‘తేరి’, బన్నీతో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలు చేశారు. పుష్పలో ఐటమ్ సాంగ్‌లో కనిపించారు.

News April 1, 2024

KCR పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు: భట్టి

image

TG: అక్కసుతోనే KCR తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘BRS నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే KCR తట్టుకోలేకపోతున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని సమస్యలకు గత ప్రభుత్వమే కారణం. 3 నెలల నుంచి వ్యవస్థలను దారికి తీసుకొస్తున్నాం. కాళేశ్వరంలో జరిగిన పొరపాటును ఆయన ఒప్పుకోవడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు.

News April 1, 2024

అందుకోసం గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లు: బాలీవుడ్ నటి

image

బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1990లలో నటీనటుల మధ్య పోటీ ఎక్కువగా ఉండేదని అన్నారు. కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉన్నవారు ఇతరుల సక్సెస్‌ను ఓర్వలేకపోయేవారని చెప్పారు. వారిని కిందికి లాగేందుకు అవసరమైతే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లని తెలిపారు. ఇలాంటి పరిస్థితితో తాను ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. సినిమాల నుంచి ఎవరినీ తీసెయ్యాలని తాను ప్రయత్నించలేదన్నారు.

News April 1, 2024

మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ను ఈసీ వాయిదా వేసింది. రేపు కౌంటింగ్ జరగాల్సి ఉండగా, పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. మార్చి 28న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.

News April 1, 2024

BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 8 సార్లు టాస్క్‌ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్లు A4 రాధాకిషన్‌రావు రిమాండు రిపోర్టులో వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు ఈయనే వాహనాలను సమకూర్చినట్లు తేలింది. BRS కోసమే వీరు డబ్బులు తరలించారట. అటు ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించినట్లు సమాచారం.

News April 1, 2024

మార్చి నెలలో రూ.1.78లక్షల కోట్ల GST

image

మార్చిలో రూ.1.78లక్షల కోట్ల GST వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.5శాతం ఎక్కువ. గరిష్ఠంగా ఫిబ్రవరిలో 12.5శాతం వృద్ధి నమోదైంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్‌టీలో వృద్ధి (17.6%) నమోదు కావడం వల్ల కలెక్షన్లు పెరిగాయని కేంద్రం తెలిపింది. FY24లో జీఎస్‌టీ కలెక్షన్లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11.7% పెరిగి రూ.20.14లక్షల కోట్లు వచ్చినట్లు వెల్లడించింది.

News April 1, 2024

ఇది దేశ చరిత్రలోనే తొలిసారి: రాజ్‌నాథ్ సింగ్

image

భారతదేశ రక్షణ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే FY24లో 32.5% పెరిగాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ₹21000 కోట్ల మార్కును దాటాయన్నారు. దేశంలో తయారవుతున్న రక్షణ ఉత్పత్తులను 100+ సంస్థలు 85 దేశాలకు ఎగుమతి చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్టార్, DPSUలతో సహా రక్షణ పరిశ్రమలన్నీ గత కొన్నేళ్లలో ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయని కొనియాడారు.

News April 1, 2024

కిడ్నీ పేషెంట్స్‌లో ధైర్యం నింపిన గ్రీన్

image

RCB ప్లేయర్ కామెరాన్ గ్రీన్ దీర్ఘకాలిక మూత్ర పిండ వ్యాధితో పోరాడుతున్న రోగులను కలిశారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ధైర్యాన్నిచ్చేందుకు ఆయన ముందుకొచ్చారు. గ్రీన్ కూడా స్టేజ్-2 దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో జన్మించగా.. డాక్టర్లు 12 ఏళ్ల కంటే ఎక్కువ బతకరని చెప్పారట. అయితే, వారిని ఆశ్చర్యపరిచేలా కఠినమైన డైట్ పాటిస్తూ, మెడిసిన్స్ వాడుతూ ఆయన కోలుకొని క్రికెటర్‌గా మారారు.

News April 1, 2024

వాలంటీర్లను ట్రాన్స్‌ఫర్ చేయాలి: లక్ష్మీనారాయణ

image

AP: వాలంటీర్లను సస్పెండ్ చేయకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ECని కోరారు. ‘సస్పెండ్ అయిన వాలంటీర్లు ఇంకా ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాబట్టి వారిని ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఉత్తరాంధ్ర వారిని రాయలసీమకు, రాయలసీమ వారిని ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇలా బదిలీ చేస్తే వారి ప్రభావం ఓటర్లపై ఉండదు. ఎన్నికలు సజావుగా జరుగుతాయి’ అని అన్నారు.

News April 1, 2024

ALERT: బయటకు రాకండి!

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో వేడిగాలులు వీస్తున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఉప్పల్‌లో 43.3, శేరిలింగంపల్లిలో 43.1, కుత్బుల్లాపూర్‌లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.