India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో 44 లోక్‌సభ స్థానాలకు CPM అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలోని అరకుకు పాచిపెంట అప్పలనరస, TGలోని భువనగిరికి జహంగీర్ పేర్లను ఖరారు చేసింది. బెంగాల్‌లో 17, కేరళలో 15, తమిళనాడులో 2, మిగతా రాష్ట్రాల్లో ఒక్కో అభ్యర్థిని CPM ప్రకటించింది. బిహార్, రాజస్థాన్, బెంగాల్, త్రిపురలో INDIA కూటమిలో భాగంగా పోటీ చేస్తున్న CPM.. అండమాన్, అస్సాం, ఝార్ఖండ్, కర్ణాటక, పంజాబ్‌లోవామపక్ష కూటమితో బరిలోకి దిగుతోంది.
లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి మరోసారి పోటీపై వచ్చే నెల 3న తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సిట్టింగ్ ఎంపీ, సినీ నటి సుమలత పేర్కొన్నారు. 2019లో బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా నెగ్గిన ఈమె.. ఈసారి ఎన్డీఏ తరఫున టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించడంతో మాజీ సీఎం కుమారస్వామి పోటీ చేస్తున్నారు.
కంపెనీ సెక్రటరీస్ కోర్సులు చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టిసారించినట్లు ICSI అధ్యక్షుడు నరసింహన్ వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో 72,000 మంది కంపెనీ సెక్రటరీలు ఉన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగా 2047కు భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లుగా ఎదిగితే దేశానికి 2 లక్షల మంది కంపెనీ సెక్రటరీలు అవసరం ఉంటుంది’ అని పేర్కొన్నారు.
HYD- విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద ఫీజులు పెరిగాయి. ఒక్కో వాహనానికి ఒక వైపు, ఇరు వైపులా కలిపి రూ.5 నుంచి రూ.40, స్థానికుల నెలవారీ పాసులు రూ.330 నుంచి రూ.340కి పెరిగాయి. ఆందోల్ నుంచి చిల్లకల్లు వరకు రహదారిని కాంట్రాక్ట్ సంస్థ GMR రూ.2000 కోట్లతో 4లేన్లుగా విస్తరించింది. ఈ వ్యయాన్ని రాబట్టుకునేందుకు ఫీజులు పెంచింది. ఏడాది పాటు ఇవే ఛార్జీలుంటాయి.
AP: విశాఖ(D) కొమ్మాదిలోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై సాంకేతిక విద్యాశాఖ ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. అధ్యాపకుని లైంగిక వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తండ్రికి విద్యార్థిని మెసేజ్ పెట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. కాలేజీలో చాలా మంది వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆ సందేశంలో పేర్కొంది. దీంతో విద్యాశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
మహారాష్ట్రలోని బారామతిలో శరద్ పవార్ కుటుంబ సభ్యుల మధ్యే లోక్‌సభ పోరు జరగనుంది. ఈ స్థానానికి శరద్ కూతురు, MP సుప్రియా సూలేతో అజిత్ పవార్ భార్య సునేత్ర పోటీ పడనున్నారు. వీరిద్దరూ వరుసకు వదినా మరదళ్లు. NCP(SP) (ఇండియా కూటమి) అభ్యర్థిగా సుప్రియా, NDA (శివసేన, BJP, NCP) అభ్యర్థిగా సునేత్ర ఎన్నికల బరిలో దిగుతున్నారు. గతేడాది అజిత్ NCPని చీల్చి NDAలో చేరిన సంగతి తెలిసిందే. #<<-se>>#Elections2024<<>>
AP: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో నగదు జమ చేసింది. దీనిపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
AP: వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడంపై EC <<12956311>>ఆంక్షలు<<>> విధించడానికి చంద్రబాబే కారణమని వైసీపీ Xలో విమర్శించింది. ‘అవ్వాతాతలపై CBN కసి తీర్చుకున్నారు. వారికి ఒకటో తేదీన పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారు. పేదల నోటి దగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు. నాడు ఇంగ్లిష్ మీడియం విద్యను, ఇప్పుడు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల సేవలను అడ్డుకున్నారు. దీనికి త్వరలోనే TDP మూల్యం చెల్లించుకుంటుంది’ అని ఫైరయ్యింది.
IPLలో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మ.3:30కి అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30కి విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. GT, SRH ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్కో విజయం నమోదు చేయగా, చెన్నై ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఇప్పటికే 2 మ్యాచుల్లో ఓడిన DC నేటి మ్యాచులో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది.
TG: రాష్ట్రంలో 50శాతం చెరువులు ఎండిపోయాయి. గతేడాది నుంచి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పాటు ప్రాజెక్టుల్లో నీరు లేక కాలువలకు వదలడంలేదు. మరో 10 రోజులు ఎండల తీవ్రత ఇలాగే ఉంటే మరిన్ని చెరువులు అడుగంటనున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో నీరు రావడంలేదు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు గ్రాసం కొరత ఏర్పడుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.