News March 30, 2024

మయాంక్ దెబ్బ.. పంజాబ్ ఓటమి

image

లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ కుదేలైంది. 200 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్(70), బెయిర్‌స్ట్రో(42) రాణించారు. అయితే మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేశారు. ఆఖర్లో పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 178/5 రన్స్ మాత్రమే చేసింది. 21 రన్స్ తేడాతో ఓడింది.

News March 30, 2024

‘సచిన్, సీమా హైదర్ పెళ్లి చెల్లదు’

image

పబ్జీ లవర్స్ సచిన్, సీమా హైదర్ పెళ్లి చెల్లదని సీమా మొదటి భర్త గులామ్ హైదర్ లక్నో కోర్టులో కేసు వేశాడు. విచారణ సందర్భంగా గులామ్ తరఫు భారత న్యాయవాది మోమిన్ మాలిక్ వాదనలు వినిపించారు. సీమా మొదటి భర్త నుంచి విడాకులు పొందలేదని, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు తన భర్త పేరు గులామ్‌గా పేర్కొందని తెలిపారు. కాగా భారత్‌లో కేసు నమోదు చేయడానికి పాక్ పౌరులకు అనుమతి లేదని సీమా తరఫు లాయర్ వాదించారు.

News March 30, 2024

లోకేశ్‌కు Z కేటగిరీ భద్రత

image

టీడీపీ నేత నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రేరేపిత దాడులు, నక్సలైట్ల హెచ్చరికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా ఆయనకు ఈ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా లోకేశ్‌కు CRPF బలగాలతో భద్రత కల్పించనున్నారు.

News March 30, 2024

సీఎం, 10మంది MLAలు ఏకగ్రీవం

image

అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. సీఎం పెమా ఖండూ సహా 10మంది BJP ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ ఉండనున్నారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో ఖండూతో పాటు మరో 9మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి పవన్ కుమార్ సైన్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.

News March 30, 2024

బయట ఛార్జింగ్ పెట్టేవారికి వార్నింగ్

image

బహిరంగ ప్రదేశాల్లోని USB ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఫోన్లు ఛార్జింగ్ పెట్టేవారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, కేఫ్స్, హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో USB ఛార్జర్ స్కాం జరుగుతోందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జర్ల ద్వారా సైబర్ నేరస్థులు ప్రమాదకర మాల్వేర్‌ను ఫోన్లలోకి పంపుతున్నారని పేర్కొంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతున్నట్లు వెల్లడించింది.

News March 30, 2024

వారి పిల్లల స్కూల్ ఫీజు రూ.20.4లక్షలు

image

ఇటీవల ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. అందులో టాప్ సెలబ్రిటీల పిల్లలు సందడి చేశారు. దీంతో ఈ స్కూల్‌లో ఫీజులు ఎంత ఉంటాయో అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. LKG-7వ తరగతి వరకూ ఫీజు నెలకు రూ.1.70లక్షలు ఉంటుందట. అంటే ఇందులో చదివే రోహిత్‌శర్మ, షారుఖ్‌, అభిషేక్ బచ్చన్ వంటి వారి పిల్లల ఏడాది ఫీజు రూ.20లక్షలు అన్నమాట. అంటే చాలామంది ఉద్యోగుల ఏడాది జీతం కంటే ఎక్కువే.

News March 30, 2024

సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్

image

ప్రముఖ నటుడు, ఎంపీ సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాజాగా 8వ జాబితా విడుదల చేసిన ఆ పార్టీ.. సన్నీకి టికెట్‌‌ను నిరాకరించింది. ప్రస్తుతం ఆయన గుర్దాస్‌పుర్ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయనను కాదని దినేశ్ సింగ్ బబ్బూకు టికెట్ ఇచ్చింది. మరోవైపు మాజీ దౌత్యవేత్త తరంజిత్ సంధూను అమృత్‌సర్ నుంచి బీజేపీ బరిలో నిలిపింది.

News March 30, 2024

ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా? జాగ్రత్త!

image

తమ శాఖ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మొబైల్ యూజర్లకు టెలికాం శాఖ సూచించింది. సైబర్ నేరగాళ్లు విదేశీ నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ చేసి మొబైల్ నంబర్ నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, వ్యక్తిగత డేటా దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. ఇలాంటి కాల్స్‌ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్‌, 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.

News March 30, 2024

బిగ్‌బాస్ విన్నర్‌‌పై మరో కేసు

image

యూట్యూబర్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌పై మరో కేసు నమోదైంది. ఓ వీడియోలో నిషేధిత పాములను వాడినందుకు అతడిపై గురుగ్రామ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పాము విషం విక్రయం కేసులో అతడు 5రోజులు జైలు జీవితం గడిపారు. ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇప్పుడు యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ సౌరభ్ గుప్తా ఫిర్యాదుతో మరోసారి కేసు నమోదైంది.

News March 30, 2024

రేపు మరోసారి ఢిల్లీకి రేవంత్, భట్టి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వారు పాల్గొంటారు. రాష్ట్రంలో మిగిలిన 4 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై తుది చర్చలు జరుపుతారు. నాలుగు రోజుల క్రితమే వీరు ఢిల్లీ వెళ్లి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన విషయం తెలిసిందే.