News March 29, 2024

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

image

TG: మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇందుకు ఆర్బీఐ, బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఇప్పటివరకు 6,47,589 మంది రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేశాం. గత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది’ అని ఆయన తెలిపారు.

News March 29, 2024

‘ఓం’ ఆకారంలో ఆలయం

image

ప్రపంచంలోనే తొలి ఓం ఆకారం ఆలయాన్ని రాజస్థాన్‌లో నిర్మించారు. దీన్ని పాలి జిల్లాలోని జదాన్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు 1,008 శివుడి విగ్రహాలున్నాయి. 5వ శతాబ్దానికి చెందిన నాగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

News March 29, 2024

స్టేడియంలో కారు రూఫ్‌టాప్‌ను పగలగొట్టిన RCB ఫ్యాన్స్!

image

చిన్నస్వామి స్టేడియంలో RCBvsKKR మ్యాచ్‌కు ముందు కొందరు RCB అభిమానులు చేసిన విచిత్రమైన పనికి నెట్టింట విమర్శలొస్తున్నాయి. WPLలో RCB ప్లేయర్ పెర్రీ సిక్స్‌ కొట్టి కారు అద్దం పగలగొట్టడంతోనే వారు కప్ గెలిచారని, పురుషుల జట్టు కూడా అదే చేయాలని ఫ్యాన్స్ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో కొందరు ఆ కారు రూఫ్‌టాప్‌ను పగలగొట్టారు. మ్యాచ్ గెలిచేందుకు ఇలాంటి పిచ్చి పనులేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

News March 29, 2024

2024లో అత్యధిక సిక్సులు కొట్టిన IPL ప్లేయర్స్

image

IPL-2024 టోర్నీ ప్రారంభమై వారం రోజులు కావస్తుండగా ప్రతి మ్యాచ్‌లో ఆయా జట్ల ప్లేయర్లు సిక్సర్లతో అదరగొడుతున్నారు. అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ SRH ప్లేయర్లు క్లాసెన్ 2 మ్యాచుల్లో 15 సిక్సులు కొట్టగా, అభిషేక్ శర్మ 9 సిక్సులు బాదారు. వీరి తర్వాత RR ప్లేయర్ పరాగ్ 2 మ్యాచుల్లో 9 సిక్సులు, KKR రస్సెల్ ఒక్క మ్యాచులో 7 సిక్సులు, MI ప్లేయర్ తిలక్ వర్మ 2 మ్యాచుల్లో 7 సిక్సులు కొట్టారు.

News March 29, 2024

వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు

image

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేల్చిన ఇద్దరు కీలక నిందితుల కోసం వేట కొనసాగుతోంది. వారి ఆచూకీ చెబితే రూ.20 లక్షల రివార్డు ఇస్తామని NIA ప్రకటించింది. నిందితుల ఆచూకీ తెలిసిన వాళ్లు 89042 41100 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపింది. కాగా ఈ కేసులో ఇప్పటికే NIA ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో నలుగురు గాయపడ్డ విషయం తెలిసిందే.

News March 29, 2024

పృథ్వీ షాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటీ?: టామ్ మూడీ

image

ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఓపెనర్ పృథ్వీషాను డగౌట్‌లో కూర్చోబెట్టడం ఏంటని ఆసీస్ మాజీ క్రికెటర్ టామ్ మూడీ ప్రశ్నించారు. ‘పృథ్వీషా ఓ అద్భుత ఆటగాడు. అతడో డేంజరస్ క్రికెటర్. గత సీజన్‌లో అతడు రాణించకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన బెంచ్‌కే పరిమితం చేస్తారా? అతడు డగౌట్ నుంచే పరుగులు చేయలేడు కదా’ అని ఆయన పేర్కొన్నారు. కాగా పృథ్వీ షా స్థానంలో తెలుగు కుర్రాడు రికీ భుయ్ జట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News March 29, 2024

దర్శి టీడీపీ అభ్యర్థిగా మహిళా డాక్టర్

image

AP: ప్రకాశం(D) దర్శి నియోజకవర్గంలో అనూహ్యంగా గొట్టిపాటి లక్ష్మి పేరుని TDP ప్రకటించింది. వృత్తిపరంగా ఆమె గైనకాలజిస్ట్. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు. అద్దంకి MLA గొట్టిపాటి రవికుమార్ ఆమెకు బాబాయ్ అవుతారు. లక్ష్మీకి టికెట్ ఇప్పించడంలో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కాగా మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తిరిగి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారని భావించినా అలా జరగలేదు.

News March 29, 2024

ఆ టిప్పర్ డ్రైవర్ చంద్రబాబు కంటే ఎక్కువే చదివాడు: CM

image

AP: శింగనమల ఎమ్మెల్యే టికెట్ ఓ టిప్పర్ డ్రైవర్‌కు ఇచ్చామంటూ చంద్రబాబు తూలనాడాడని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘అవునయ్యా.. చంద్రబాబు. మేం పేదవాళ్లకు టికెట్లు ఇచ్చాం. ఆ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు MA ఎకనామిక్స్, ఆపై బీఈడీ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు రాక డ్రైవర్ అయ్యారు. మడకశిరలోనూ ఉపాధి హామీ కూలీ లక్కప్పకు టికెట్ ఇచ్చామని గర్వంగా చెప్తా’ అని అన్నారు.

News March 29, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధా కిషన్‌రావుకు రిమాండ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్‌రావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. ఇప్పటికే మాజీ అధికారులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అరెస్టు అయిన విషయం తెలిసిందే.

News March 29, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న KKR

image

RCBతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన KKR బౌలింగ్ ఎంచుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్(C), రింకూసింగ్, నరైన్, రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్(C), కోహ్లీ, పాటిదార్, మాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, అల్జారీ జోసెఫ్, దగర్, సిరాజ్, యశ్ దయాల్.