News March 28, 2024

కేకే తీరుపై కేసీఆర్ అసహనం

image

TG: ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో BRS అధినేత కేసీఆర్‌తో సీనియర్ నేత కె.కేశవరావు భేటీ ముగిసింది. పార్టీ మార్పు అంశాన్ని కేసీఆర్‌కు కేకే తెలిపారు. దీంతో కేకే తీరుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ‘పదేళ్లు అధికారం అనుభవించి, ఇప్పుడు పార్టీ మారడం సరికాదు. పార్టీలో మీకు ఏం తక్కువ చేశాం? మీ ఆలోచన చాలా తప్పు. మీరే ఆలోచించుకోండి’ అని సూచించారు. కానీ తాను కాంగ్రెస్‌లో చేరి, అక్కడే చనిపోతానని కేకే చెప్పారు.

News March 28, 2024

LS ఎన్నికల ముంగిట ED ఫైర్

image

లోక్‌సభ ఎన్నికల ముంగిట విపక్ష నేతలకు ED నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(AAP) కస్టడీలో, ఎమ్మెల్సీ కవిత(BRS) జైలులో ఉన్నారు. తాజాగా కేరళ సీఎం విజయన్ కుమార్తె వీణా విజయన్(CPM)కు సైతం నోటీసులు అందాయి. వీరే కాదు.. మహువా మొయిత్రా(TMC), ఫరూక్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రాజా(DMK), సోలంకి(SP), కీర్తికార్(శివసేన-ఉద్ధవ్), సుభాష్(RJD)లు నోటీసులు అందుకున్నారు.

News March 28, 2024

సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే

image

స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో 44వ మూవీ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ‘Love Laughter War (ప్రేమ-నవ్వు-యుద్ధం)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ నిర్మించనుంది. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

News March 28, 2024

తిహార్ జైల్లో కవిత దినచర్య!

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈ నెల 26 నుంచి తిహార్ జైల్లో ఉంటున్నారు. 6వ నంబర్ సెల్‌లో మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. జైలులో మంగళవారం రాత్రి ఆమె అన్నం, పప్పుతో భోజనం చేశారట. తనతో పాటు ఉంటున్న మహిళా ఖైదీలకూ తన ఆహారం వడ్డించినట్లు సమాచారం. బుధ‌వారం ఉద‌యం టీ, స్నాక్స్ తీసుకున్నారు. జైలులో పుస్తక పఠనంతో పాటు టీవీ చూస్తున్నారని జైలు వర్గాలు పేర్కొన్నాయి.

News March 28, 2024

కరీనా కపూర్ పొలిటికల్ ఎంట్రీ?

image

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) పార్టీలో ఆమె చేరుతున్నట్లు సమాచారం. ఆమెతోపాటు ఆమె సోదరి కరిష్మా కపూర్ కూడా ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వీరు పోటీ చేయనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) పార్టీలో చేరారు.

News March 28, 2024

నల్లమిల్లికి చంద్రబాబు ఫోన్

image

AP: అనపర్తి నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు <<12940627>>ఫోన్<<>> చేశారు. ఈ సందర్భంగా టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. ‘పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేశారు. మీ కోసం తెగించి పోరాడిన కొద్ది మందిలో నేనూ ఒకడిని. నాడు YSR పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. 40 ఏళ్ల మా కుటుంబ పోరాటాన్ని మరిచారా’ అని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

News March 28, 2024

FLASH: పరీక్షల తేదీలు మారాయ్

image

JEE మెయిన్ సెషన్-2 పరీక్ష తేదీల్లో మరోసారి మార్పులు జరిగాయి. APR 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షలను APR 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. అంతకుముందు APR 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన NTA.. రెండుసార్లు తేదీల్లో మార్పులు చేసింది. విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి.

News March 28, 2024

మైనపు విగ్రహంతో ఐకానిక్ స్టార్

image

హీరో అల్లు అర్జున్​కు ఇవాళ అరుదైన గౌరవం దక్కనుంది. దుబాయ్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని రాత్రి 8 గంటలకు ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఐకానిక్ స్టార్ ‘చాలా ఉత్సాహంగా ఉంది. ప్రతి నటుడికి ఇదో మైలురాయి క్షణం’ అని ట్వీట్ చేశారు. దానికి మైనపు విగ్రహంతో దిగిన ఫొటోను జతచేశారు.

News March 28, 2024

MLC ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలో 100 శాతం పోలింగ్ నమోదైనట్లు ఏఆర్వో వెంకట మాధవరావు తెలిపారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపడతామని పేర్కొన్నారు. మొత్తం 1439 మంది ఓటర్లుండగా అందరూ ఓటేశారు. కాగా కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.

News March 28, 2024

వార్నర్, స్టొయినిస్‌కు ఆసీస్ బిగ్ షాక్

image

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్స్ మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, అస్టన్ అగర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. 2024-25 సీజన్‌కు గానూ వీరి సెంట్రల్ కాంట్రాక్టును సీఏ రద్దు చేసింది. జేవియర్ బార్ట్‌లెట్, అరోన్ హార్డీ, మాథ్యూ షార్ట్, నాథన్ ఎల్లిస్‌కు తొలిసారి కాంట్రాక్ట్ కట్టబెట్టింది. వీరందరూ గతేడాది జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు.