News March 24, 2024

IPL: బౌల్ట్ బంతికి బ్యాటర్ హెల్మెట్ పగిలిపోయింది

image

లక్నోతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నారు. మూడో ఓవర్‌లో అతడు వేసిన తొలి బంతి లక్నో బ్యాటర్ పడిక్కల్ హెల్మెట్‌కు బలంగా తగిలింది. దీంతో హెల్మెట్ వెనకాల ఉండే నెక్ గార్డ్ విరిగి కిందపడింది. అదృష్టవశాత్తు పడిక్కల్‌కు ఎలాంటి గాయం కాలేదు. అయితే తర్వాతి బంతికే అతడిని బౌల్ట్ క్లీన్ బౌల్డ్ చేశారు. అనంతరం అతడు వేసిన ఓవర్‌లో మరో బంతి రాహుల్ హెల్మెట్‌ను బలంగా తాకింది.

News March 24, 2024

కేజ్రీవాల్ అరెస్టును కోరితెచ్చుకున్నారు: అస్సాం సీఎం

image

సీఎం కేజ్రీవాల్ అరెస్టును తానే కోరితెచ్చుకున్నారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. ‘కేజ్రీవాల్‌కు ఈడీ తొమ్మిదిసార్లు నోటీసులు పంపింది. వాటిని అతడు బేఖాతరు చేశారు. తొలి సమన్లకే స్పందించి ఉంటే బహుశా అరెస్ట్ అయ్యేవారు కాదేమో. కొన్ని నెలల క్రితం సమన్లు వచ్చిన వెంటనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు’ అని హిమంత తెలిపారు. సానుభూతి కోసమే కేజ్రీవాల్ ఇలా చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

News March 24, 2024

ప్రీతి జింటాతో సెల్ఫీ

image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కి తొలి విజయం దక్కడంతో ఆ జట్టు కో-ఓనర్, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా సందడి చేశారు. ఆ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆమె డగౌట్‌లో తన రియాక్షన్స్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఢిల్లీపై గెలిచిన తర్వాత పంజాబ్ ఆటగాళ్లు లివింగ్‌స్టోన్‌, సామ్‌ కరన్.. ప్రీతి జింటాతో సెల్ఫీ దిగారు. ‘మా జట్టు బిగ్గెస్ట్ సపోర్టర్‌తో మ్యాచ్ విజేతలు’ అని ఆ ఫొటోను పంజాబ్ టీమ్ ట్వీట్ చేసింది.

News March 24, 2024

ముందు నో చెప్పి.. తర్వాత ఓకే అన్నారు: శ్రుతి

image

‘లియో’ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ‘ఇనిమేల్’ మ్యూజిక్ ఆల్బమ్ కోసం హీరోయిన్ శ్రుతి హాసన్‌తో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఆల్బమ్ విషయమై శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిలో నటించేందుకు ముందుగా లోకేశ్ నో చెప్పారని.. కాన్సెప్ట్ విన్నాక ఒకే చెప్పారన్నారు. ఇందులో లోకేశ్ చాలా చక్కగా నటించారని తెలిపారు. కాగా ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఫుల్ వీడియో రేపు రానుంది. ఈ సాంగ్‌కి కమల్ హాసన్ లిరిక్స్ అందించారు.

News March 24, 2024

IPL చరిత్రలో ఒకే ఒక్కడు..

image

రాజస్థాన్ ప్లేయర్ సంజూ శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచులో 50+ స్కోర్ చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. లక్నోతో మ్యాచులో సంజూ(82*) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఘనత అందుకున్నారు. కాగా 2020లో CSKపై 72, 2021లో పంజాబ్ పై 119, 2022లో SRHపై 55, 2023లోనూ SRHపైనే 55 పరుగులు చేశారు.

News March 24, 2024

చంద్రబాబు నివాసం వద్ద ఆశావహుల సందడి

image

AP: ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి ఆశావహులు క్యూ కట్టారు. టీడీపీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థుల చివరి జాబితా త్వరలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజుకు సీటివ్వాలని మందకృష్ణ మాదిగ కోరారు. విజయనగరం పార్లమెంట్ సీటు కోసం కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.

News March 24, 2024

సంజూ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ భారీ స్కోర్

image

లక్నోతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 193 రన్స్ చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ 82* రన్స్‌తో రాణించారు. రియాన్ 43, జైస్వాల్ 24, జురెల్ 20* చేశారు. లక్నో బౌలర్లలో నవీన్ 2, మోసిన్ ఖాన్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు. లక్నో విజయానికి 20 ఓవర్లలో 194 రన్స్ అవసరం.

News March 24, 2024

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: మోదీ

image

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. స్నేహం, సద్భావం అనే రంగులు కలగలిసిన ఈ పండగ మీ అందరి జీవితాలలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

News March 24, 2024

నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకోను: సంతోష్

image

TG: ఫోర్జరీ కేసుపై మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ స్పందించారు. షేక్‌పేటలో స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఫోర్జరీ అనేది అవాస్తవమన్నారు. న్యాయపరమైన సమస్య ఉంటే లీగల్ నోటీసులు ఇవ్వాలి గానీ, పీఎస్‌లో ఫోర్జరీ కేసు పెట్టడం సరికాదన్నారు. రాజకీయ కక్షతోనే తనపై బురద జల్లాలని చూస్తున్నారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే ఊరుకోనని సంతోష్ హెచ్చరించారు.

News March 24, 2024

ఓటర్లకు సైబర్ నేరగాళ్ల వల.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ

image

ఎన్నికల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఓటర్ కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ప్రజల ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు.