India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా.. ఇంత తక్కువ కేసులు నమోదు కావడం బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.
విశాఖలో భారీ డ్రగ్ కంటైనర్ దొరకడం రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకి గురి చేసింది. రాజకీయ పార్టీలు ఆరోపణలు గుప్పించుకోవడంలో బిజీగా ఉన్నాయి. అసలు ఈ దందా ఎప్పటి నుంచో కొనసాగుతోందా? అలా అయితే డ్రగ్స్ ఎక్కడికి చేరుతున్నాయి? అనేది ఇక్కడ ప్రధాన అంశం. కొన్ని ముఠాలు స్కూళ్లు, కాలేజీలే టార్గెట్‌గా విద్యార్థుల్ని మత్తుకి బానిసలు చేస్తున్నాయి. ఈ తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి.
బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశీ ముస్లిం(మియా)లకు పౌరసత్వం ఇవ్వడానికి అస్సాం CM హిమంత బిశ్వ శర్మ పలు కండీషన్లు పెట్టారు. ‘బహుభార్యత్వం, బాల్య వివాహాలకు నో చెప్పాలి. ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలి. మహిళల విద్యను ప్రోత్సహించాలి. మదర్సాలకు దూరంగా ఉండి, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి విద్యపై దృష్టిసారించాలి. ఇక్కడి సమాజ సంస్కృతులను అనుసరిస్తే వారిని గుర్తించడానికి మాకెలాంటి ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు.
మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో ముంబై, కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. గ్రూప్ బీలో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పంజాబ్, గుజరాత్ ఉన్నాయి. ఒకే గ్రూపులో ఉన్న జట్లు అదే గ్రూపులో ఉన్న మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. మిగతా గ్రూపులోని జట్లతో రెండేసి మ్యాచుల్లో తలపడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అవుతాయి.
కేంద్రం గ్రాంట్ల విడుదలలో కర్ణాటకకు అన్యాయం చేసిందని ఆ రాష్ట్ర CM సిద్ద రామయ్య చేసిన ఆరోపణలను ఆర్థికమంత్రి నిర్మల కొట్టిపారేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులో కర్ణాటకకు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలనే అంశాలు లేవని అన్నారు. తమకు రావాల్సిన రూ.5,495కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేయలేదనే వాదన పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. ఈ గ్రాంట్ల విషయంలో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని CM నిన్న అన్నారు.
TG: తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ అందెశ్రీ దంపతులను సత్కరించారు. మరోవైపు పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ అవార్డు గ్రహీతలు అందె భాస్కర్(డప్పు వాయిద్యం), పెరణి రాజ్ కుమార్(పేరిణి నృత్యం) సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీరిని సత్కరించి అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో EVMల వినియోగంపై MNM అధినేత, నటుడు కమల్‌హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘EVMను నిందించలేం. ప్రమాదం జరిగితే డ్రైవర్‌దే తప్పు కానీ.. కారుది కాదు. రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈ EVMలను టెస్ట్ చేయాలి. నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు’ అని అన్నారు. కాగా ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య జరుగుతున్న మ్యాచును స్పైడర్ క్యామ్ నిలిపివేసింది. గ్రౌండ్ మధ్యలో పైనుంచి విజువల్స్ తీసే కెమెరా వైర్ తెగిపోయింది. ఆ వైర్ గ్రౌండ్‌లో పడిపోవడంతో తొలి ఓవర్ 2వ బంతి వద్ద మ్యాచ్ ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత గ్రౌండ్ సిబ్బంది మ్యాచ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు.
TG: హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని సూచించారు.
AP: 6,100 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలపై ఇంకా క్లారిటీ రాలేదు. మార్చి 30 నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? వాయిదా వేస్తారా? అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పరీక్షల నిర్వహణపై ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్న విద్యాశాఖ.. పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్, టెట్ ఫలితాల వెల్లడిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Sorry, no posts matched your criteria.