News March 21, 2024

2 నెలల్లో ఇద్దరు సీఎంలు అరెస్ట్

image

సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అవినీతి కేసుల్లో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు సీఎంలు అరెస్టయ్యారు. భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

News March 21, 2024

ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి ఎక్కువ ఫండ్స్ ఈ పార్టీలకే!

image

అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రై.లి. ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చిందో వెల్లడైంది. 2020 నుంచి 2024 వరకు ఈ సంస్థ రూ.1,368 కోట్ల ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అందులో TMCకి రూ.542 కోట్లు, DMKకు రూ.503 కోట్లు, YSRCPకి రూ.154 కోట్లు, BJPకి రూ.100 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.50 కోట్లు అందాయి. భారత లాటరీ పరిశ్రమలో ఈ సంస్థ టర్నోవర్ రూ.1.65 లక్షల కోట్లు.

News March 21, 2024

కేజ్రీవాల్ అరెస్టు అందుకేనా?

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్ల సమగ్ర వివరాలను వెల్లడించడానికి, ఈ అరెస్టుకు సంబంధం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. బాండ్ల విషయాన్ని మీడియా హైలైట్ చేయకుండా ఉండేందుకే ఢిల్లీ సీఎంను అరెస్టు చేశారని అనుమానిస్తున్నారు. కాగా, బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు వచ్చాయని మార్చి 14న తెలియగా, మార్చి 15న MLC కవితను అరెస్టు చేశారు.

News March 21, 2024

కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?

image

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News March 21, 2024

ఢిల్లీ సీఎం ఆయనే.. మంత్రి ప్రకటన

image

ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ తెలిపారు. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని వ్యాఖ్యానించారు. సీఎంను ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఆమె చెప్పారు. దీనిపై ఈరోజు రాత్రే విచారణ జరపాలని కోరామన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌ను రెండు గంటల పాటు విచారించిన ఈడీ.. కాసేపటి క్రితం అరెస్టు చేసింది.

News March 21, 2024

ఐఆర్ఎస్ To ఉద్యమం To పాలిటిక్స్

image

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హరియాణాలో జన్మించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1999లో ఐఆర్ఎస్‌కి ఎంపికయ్యారు 1999-2000ల మధ్య పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 2011లో అన్నా హజారేతో కలిసి జన లోక్‌పాల్ బిల్లు కోసం పోరాడి జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. 2012లో AAPని స్థాపించి రెండు సార్లు సీఎం అయ్యారు.

News March 21, 2024

కాంగ్రెస్ MP అభ్యర్థుల ప్రకటన

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఇందులో 57 మంది పేర్లు ఉండగా తెలంగాణ నుంచి ఐదుగురి పేర్లు ఉన్నాయి. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయబోతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ నుంచి నలుగురు ఎంపీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

News March 21, 2024

విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చారు: లోకేశ్

image

AP: వైజాగ్‌లో 25 వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరపరిచిందని నారా లోకేశ్ తెలిపారు. ‘ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్. గతంలో కాకినాడ ఎమ్మెల్యే బినామీ కంపెనీ పేరుతో రూ.21వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయి. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్‌గా మార్చావు కదా జగన్?’ అని ట్వీట్ చేశారు.

News March 21, 2024

కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కేజ్రీవాల్ ఇంటి వద్ద 144 సెక్షన్ విధించి, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు.

News March 21, 2024

BIG BREAKING: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీస్‌కు తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.