India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నీటి ఎద్దడితో బెంగళూరులో IPL మ్యాచ్‌ల నిర్వహణ ప్రశ్నార్థకమైన వేళ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వేస్ట్ వాటర్ ప్లాంట్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు నీటిని సరఫరా చేయనుంది. మ్యాచ్ జరిగే రోజు సగటున 75వేల లీటర్ల నీరు అవసరమట. దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
AP రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితులు పూర్తిగా హీటెక్కాయి. పవన్ ఎంపీగా పోటీ చేస్తే తాను పిఠాపురంలో బరిలోకి దిగుతానన్న టీడీపీ అభ్యర్థి వర్మ కామెంట్లపై YCP స్పందించింది. ‘జాగ్రత్త పవన్. ఏదన్నా అటూ ఇటూ అయితే పిఠాపురంలో నిన్ను ఓడించేవాళ్లలో మొదటి వరసలో ఉండేది టీడీపీనే అనుకుంటా. చూస్కో మరి’ అని Xలో పోస్ట్ చేసింది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లోని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురు చర్చిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ 2 విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. జనసేన ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితా, తమ పార్టీ కోరుతున్న స్థానాలపై ఇద్దరు సమీక్షిస్తున్నారు. అటు త్వరలోనే జనసేన మరో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
మెదడులో రక్తస్రావం కారణంగా జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఇది బ్రెయిన్ స్ట్రోక్ వలనే తలెత్తిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘మెదడు కణాలకు అందాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన రక్తం సరఫరా నిలిచిపోవడమే బ్రెయిన్ స్ట్రోక్. తీవ్రంగా తలనొప్పి, ముఖం ఓవైపునకు వంగడం, చేతులపై నియంత్రణ లేకపోవడం, తిమ్మిర్లు వంటి లక్షణాలుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి’ అని సూచిస్తున్నారు.
AP: 2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. విధులు నిర్వహిస్తున్న వారంతా ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా చేయలేదంటూ ఇటీవల మెయిన్స్‌ను హైకోర్టు రద్దు చేసింది. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామంటూ APPSC డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది.
రేపు జరిగే IPL తొలి మ్యాచ్ కోసం RCB ప్లేయర్లు చెన్నై స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీని గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2013IPLలో మ్యాక్స్‌వెల్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌ను అచ్చం ఇలానే ఇమిటేట్ చేశారని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు.
బీజేపీకి రూ.వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం ప్రజల నుంచి న్యాయబద్ధంగా సేకరించిన నిధులను ఐటీ ఫ్రీజ్ చేయడాన్ని ఖండిస్తున్నాం. అధికార పక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అని మండిపడ్డారు.
ఎన్నికల వేళ బీజేపీలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కర్ణాటక మాజీ CM, ఎంపీ సదానంద గౌడ ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. బెంగళూరు నార్త్ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరనని, మోదీనే మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా ఇటీవల RLJP చీఫ్ పశుపతి పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికల కమిషనర్ల నియామకంపై స్టే విధించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్టే విధిస్తే అది గందరగోళానికి దారి తీస్తుందని ధర్మాసనం తెలిపింది. ఈసీలుగా నియమితులైన జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుపై ఎలాంటి అభియోగాలు లేవని పేర్కొంది. ఈసీ నియామక ప్రక్రియపై కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు.. ఆరు వారాల్లోగా దీనిపై సమాధానం చెప్పాలని ఆదేశించింది.
AP: ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రచారాల్లో పాల్గొంటున్న వాలంటీర్లపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నారు. మచిలీపట్నంలో YCP అభ్యర్థి పేర్ని కిట్టు ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు, పొదిలిలో ముగ్గురు, మైలవరంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న 11 మంది వాలంటీర్లు, గుంటూరు జిల్లా చేబ్రోలులో వైసీపీ ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న 45 మంది వాలంటీర్లపై వేటు వేశారు. ఇటీవలే 19 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
Sorry, no posts matched your criteria.