News March 20, 2024

జయప్రకాశ్ నారాయణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: CBN

image

ఏపీలో ఎన్డీయే కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలపడంపై చంద్రబాబు స్పందించారు. ‘టీడీపీ-బీజేపీ-జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నట్లు జయప్రకాశ్ నారాయణ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. రాష్ట్రంలో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు, ప్రతి సంస్థ ముందుకు రావాలి’ అని Xలో పిలుపునిచ్చారు.

News March 20, 2024

నాగార్జున అంటే ఎంతో ఇష్టం: నటి

image

సీనియర్ నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చదువుకునే రోజుల నుంచి హీరో నాగార్జున అంటే తనకు ఇష్టమని చెప్పారు. ఆ రోజుల్లోనే అక్కినేని హీరోను కలిశానని, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చానని తెలిపారు. నాగార్జున టచ్ చేసిన చేయి అంటూ అంతా తాకేవారన్నారు. ఆయన అంటే ఇప్పటికీ అదే ఇష్టం ఉందని చెప్పుకొచ్చారు. కాగా ‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున సరసన కస్తూరి నటించారు. ప్రస్తుతం ఆమె సీరియళ్లలో నటిస్తున్నారు.

News March 20, 2024

ఐసిస్ ఇండియా హెడ్ అరెస్టు

image

ISIS ఉగ్రవాద సంస్థ టాప్ లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఐసిస్ ఇండియా హెడ్ హారిస్ ఫారుఖీతో పాటు అతడి అనుచరుడు అనురాగ్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసులు వెల్లడించారు. బంగ్లాదేశ్ సరిహద్దు దాటుతుండగా అస్సాంలోని దుబ్రీ వద్ద అరెస్టు చేశామని చెప్పారు. ISISలో కొత్త వారిని చేర్చడం, ఫండింగ్, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వీరు ప్లాన్ చేసినట్లు వివరించారు.

News March 20, 2024

‘ఇళయరాజా’ ఫస్ట్ లుక్ విడుదల

image

దిగ్గజ సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనిపై స్వయంగా ఆయనే స్పందిస్తూ.. ‘మొదట ఇది కేవలం నా వ్యక్తిగత ప్రయాణమే. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది సంగీత ప్రియుల హృదయాలను హత్తుకునే కథగా రూపాంతరం చెందింది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. ఇళయరాజాగా హీరో ధనుష్ కనిపించనున్నారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు.

News March 20, 2024

OMAD డైట్ గురించి తెలుసా?

image

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. వీరిలో కొందరు ‘వన్ డే ఏ మీల్(OMAD)’ను అనుసరిస్తున్నారు. రోజుకు సరిపడా క్యాలరీలను ఒక నిర్ణీత సమయంలో తీసుకోవడం ఈ డైట్ ఉద్దేశమని నిపుణులు తెలిపారు. అంటే గంటసేపు ఈటింగ్ విండో, 23 గంటలు ఫాస్టింగ్ విండో అన్నమాట. ఇలా పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, మెటబాలిజం మెరుగవుతాయి. ఈ డైట్‌ని పాటించే ముందు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

News March 20, 2024

మనల్ని ఎవడ్రా ఆపేది: మెగా హీరో

image

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఎంఎస్ ధోనీ, పవన్ కళ్యాణ్ ఫొటోలతో CDPని విడుదల చేశారు. ‘వీరు నా అభిమాన వ్యక్తులు. వారి విజయాలతో నన్ను ఎప్పుడూ ప్రేరేపించడంతో పాటు నాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. త్వరలో వీరిరువురూ తమ తమ రంగాలలో కొత్త అధ్యాయాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంలో ఈ CDPని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఫొటోకు ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే క్యాప్షన్ ఇచ్చారు.

News March 20, 2024

మార్చి 31న బ్యాంకులకు సెలవు రద్దు

image

బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31న (ఆదివారం) ప్రభుత్వ శాఖల ఖాతాలు నిర్వహించే బ్యాంకులకు సెలవు రద్దు చేసింది. దేశంలోని అన్ని ఏజెన్సీ బ్యాంకుల బ్రాంచులు తెరిచి ఉంచాలని స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

News March 20, 2024

విజయ్‌తో మృణాల్ సెల్ఫీ

image

‘గీతగోవిందం’ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మరోసారి పరుశురామ్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుండగా విజయ్, మృణాల్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తాజాగా వీరు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృణాల్.. విజయ్‌తో సెల్ఫీ దిగారు.

News March 20, 2024

పోలింగ్ రోజు ఆ రాష్ట్రంలో సెలవు

image

లోక్‌సభ ఎన్నికలు జరిగే రోజు సెలవు ఇస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. APR 19, 26న పోలింగ్ ఉండటంతో ఆ 2 రోజులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పెయిడ్ హాలిడేగా ప్రకటించింది. ఇది రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రైవేటు కంపెనీలు తప్పనిసరిగా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంది. మరి ఇక్కడా సెలవు ఇవ్వాలంటారా? కామెంట్ చేయండి.

News March 20, 2024

జెలెన్‌స్కీ‌కి ప్రధాని మోదీ ఫోన్ కాల్

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. ఫోన్ కాల్ ద్వారా వీరు ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది. రష్యాతో యుద్ధం విషయం ప్రస్తావనకు రాగా చర్చలతోనే సమస్యను పరిష్కరించుకోవాలని జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. ఇరు పక్షాల మధ్య జరిగే శాంతి నెలకొల్పేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందన్నారు. కాగా భారత్ అందిస్తున్న సాయానికి జెలెన్‌స్కీ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.