News March 17, 2024

PHOTO: ఒకే ఫ్రేమ్‌లో మోదీ, చంద్రబాబు, పవన్

image

AP: చిలకలూరిపేట బొప్పూడిలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న సభా వేదికపైకి ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత వీరంతా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

News March 17, 2024

BIG ALERT.. పరీక్ష తేదీలు మార్పు?

image

ఏపీ ఈఏపీసెట్ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే 13న ఏపీ, తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్‌పై సందిగ్ధం నెలకొంది. త్వరలోనే కొత్త తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అటు ప్రస్తుతం EAPCET దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. ఏప్రిల్ 15 వరకు చేసుకోవచ్చు.

News March 17, 2024

ఒక సంస్థ నుంచే DMKకి ₹509 కోట్ల విలువైన బాండ్లు

image

ఎలక్టోరల్‌ బాండ్ల విషయంలో ‘ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌’ పేరు అందరినీ ఆకర్షించింది. ఆ సంస్థ అత్యధికంగా ₹1,368 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కంపెనీ కొనుగోలు చేసిన బాండ్ల మొత్తంలో ₹509 కోట్లు తమిళనాడు CM స్టాలిన్ నేతృత్వంలోని DMK పార్టీ ఖాతాలోకి చేరడం విశేషం. ఈ విషయాన్ని EC తాజాగా వెల్లడించింది. ఒక పార్టీకి ఇంతపెద్ద మొత్తంలో బాండ్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

News March 17, 2024

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. కొత్త డేటా

image

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను EC తాజాగా మరోసారి వెల్లడించింది. ఏయే పార్టీకి ఎన్ని కోట్ల విలువైన బాండ్లు వచ్చాయో వివరించింది. BJP-రూ.6,986cr, టీఎంసీ-రూ.1,397cr, కాంగ్రెస్-రూ.1,344cr, బీఆర్ఎస్-రూ.1,322cr, బీజేడీ-రూ.944.5cr, డీఎంకే-రూ.656.5cr, వైసీసీ-రూ.442.8cr, టీడీపీకి రూ.181.35 కోట్ల మొత్తంలో బాండ్ల ద్వారా సమకూరిందని పేర్కొంది. 2019-20లో బీజేపీ అత్యధికంగా రూ.2,555 కోట్ల విలువైన బాండ్లను పొందింది.

News March 17, 2024

కాంగ్రెస్‌లోకి మరో నలుగురు BRS MLAలు?

image

TG: కాంగ్రెస్‌లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశానన్న CM రేవంత్ వ్యాఖ్యలతో BRS శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఇవాళ చేవెళ్ల MP రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరారు. రెండు రోజుల్లో మరో నలుగురు BRS MLAలు కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. ఇటీవల CMను MLAలు ప్రకాశ్ గౌడ్, యాదయ్య, సునీతా లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్, తెల్లం వెంకట్రావు తదితరులు కలిసిన విషయం తెలిసిందే.

News March 17, 2024

మోదీ జీకి స్వాగతం: చంద్రబాబు

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన ఉమ్మడి సభ కోసం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి చంద్రబాబు Xలో స్వాగతం పలికారు. ‘మోదీ జీ.. మా రాష్ట్ర ప్రజలు మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు. మనం కలిసికట్టుగా సంక్షేమం, అభివృద్ధి, సమర్థవంతమైన పాలనలో కొత్త మైలురాళ్లను నెలకొల్పుదాం’ అని ట్వీట్ చేశారు.

News March 17, 2024

అభిమానులకు ఇషాన్ కిషన్ విజ్ఞప్తి

image

తమను చూసేందుకు మైదానానికి, నెట్స్ వద్దకు వచ్చే అభిమానులకు ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ ఓ విజ్ఞప్తి చేశారు. ‘ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ చేసేందుకు వస్తారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ విసిరేయొద్దు. దయచేసి గ్రౌండ్‌ను క్లీన్‌గా ఉంచండి. చిన్న చిన్న విషయాలే. కానీ అన్నీ కలిపితే మొత్తంగా మెరుగవుతాం. అన్నీ మనం చేయగలిగినవే’ అని తెలిపారు. ఈ నెల 24న గుజరాత్‌తో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.

News March 17, 2024

‘గూగుల్ తప్పు’ అని సైన్ బోర్డు

image

మీరు గూగుల్ మ్యాప్స్ చూస్తూ కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న క్లబ్ మహీంద్రాకు వెళ్లాలనుకుంటే.. మీకు ఒక సైన్ బోర్డు ఎదురవుతుంది. దానిపై ‘గూగుల్ తప్పు.. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకు వెళ్లదు’ అని రాసి ఉంటుంది. ట్రావెలర్స్ గూగుల్ మ్యాప్స్‌లో చూస్తూ క్లబ్ మహీంద్రాకు వెళ్లబోయి దారి తప్పుతున్న సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అందరికీ చెప్పడం కష్టం కావడంతో.. అక్కడి స్థానికులు ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు.

News March 17, 2024

నిఘా ఉపగ్రహాల నెట్‌వర్క్ నిర్మిస్తున్న అమెరికా!

image

ప్రపంచాన్ని తమ నిఘా నీడలోకి తెచ్చే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేసింది. అంతరిక్షంలో వందల కొద్దీ శాటిలైట్లతో నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. ఈ మేరకు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. 1.8 బిలియన్ డాలర్ల విలువతో ఈ ఉపగ్రహ వ్యవస్థ నిర్మితమవనుంది. ఇది పూర్తైతే ప్రపంచంలో ప్రతి మూలకు అమెరికా చూడగలుగుతుంది. ఇతర దేశాల రహస్యాలను ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతుంది.

News March 17, 2024

గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ

image

AP: ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చిలకలూరిపేటలో టీడీపీ-బీజేపీ-జనసేన నిర్వహిస్తోన్న ప్రజాగళం బహిరంగసభకు కాసేపట్లో హాజరుకానున్నారు. పదేళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనిపించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.