News March 25, 2024

బీజేపీ చీఫ్ నడ్డా భార్య కారు చోరీ!

image

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా భార్యకు చెందిన ఫార్చూనర్ కారు ఢిల్లీలో చోరీకి గురైంది. ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తాను సర్వీస్ సెంటర్ వద్ద కారు పార్క్ చేసి భోజనం చేసి వచ్చేసరికి కారును దొంగిలించారని దాని డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, గురుగ్రామ్‌వైపుగా ఆ కారు వెళ్లినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

News March 25, 2024

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: సీఎం రేవంత్

image

TS: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలి. రసాయనాలు కలిగి ఉన్న రంగుల వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పండుగను సహజసిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలి’ అని సూచించారు. కాగా.. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందుగానే హోలీ వేడుకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

News March 25, 2024

కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి: జగదీశ్ రెడ్డి

image

TS: లిక్కర్ కేసులో ఆధారాలున్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారని, ఆయన్ను ఈడీ విచారించాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అటు.. కాంగ్రెస్ మంత్రులు రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో కరవుతో లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం చేయట్లేదు. ఉత్తమ్‌కు నీటిపై పరిజ్ఞానం లేదు’ అని ఆయన మండిపడ్డారు.

News March 25, 2024

యాపిల్‌లో వరస మూసివేతలు!

image

యాపిల్ సంస్థ పలు అంతర్గత విభాగాలను మూసేస్తోంది. ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టును నిలిపేయగా, తాజాగా స్మార్ట్ వాచ్ డిస్‌ప్లే రూపకల్పన-అభివృద్ధి ప్రాజెక్టును కూడా ఆపేసినట్లు సమాచారం. ఖర్చు ఎక్కువ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పలు దేశాల్లోని తమ శాఖల్లో భారీగా ఉద్యోగులనూ తగ్గిస్తుండటంతో వారిలో ఆందోళన నెలకొందని బ్లూంబెర్గ్ వార్తాసంస్థ ఓ నివేదికలో తెలిపింది.

News March 25, 2024

పార్సిల్స్ పేరిట ఫోన్ వస్తే స్పందించొద్దు: సజ్జనార్

image

TS: పోలీసులమంటూ ఫోన్ చేసి మీ పేరిట డ్రగ్ పార్సిల్ వచ్చిందని బెదిరిస్తూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ‘మోసగాళ్ల ట్రాప్‌లో ఐఐటీలో చదివిన వ్యక్తి కూడా మోసపోయారు. అతని వద్ద రూ.30 లక్షలు దోచేశారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. పార్సిల్స్ పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దు. వ్యక్తిగత వివరాలను చెప్పొద్దు. మోసపోతే 1930కి వెంటనే ఫోన్ చేయండి’ అని తెలిపారు.

News March 25, 2024

HOLI: గాయాలున్నాయా? ఇలా చేయండి

image

రేపు హోలీ. సంబరాలకు అంతా సిద్ధమయ్యారు. అయితే రంగులు పూసుకునేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరవొద్దు. ముఖ్యంగా శరీరంపై గాయాలున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీకు శరీరంపై గాయాలు ఉంటే వాటిపై బ్యాండేజ్ వేసుకోండి. దీనివల్ల రంగులు గాయాన్ని చేరకుండా ఉంటాయి. సహజమైన రంగులతో హోలీ ఆడినా ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. ముఖంపై దద్దుర్లు, తామర వంటివి ఉంటే మొదట ఆయింట్మెంట్, ఆ తర్వాత నూనె రాసుకోండి.

News March 25, 2024

ఏ భాషలోనైనా ఉగ్రవాది ఉగ్రవాదే: జైశంకర్

image

ఉగ్రవాదుల్ని అంతర్జాతీయంగా స్తంభింపచేసేందుకు భారత్ యత్నిస్తుండగా, UNSCలో చైనా వీటో అధికారంతో అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ‘వేరే భాష వాడుతున్నారనో లేక వేరే కారణం ఉందనో ఉగ్రవాదుల్ని ఎన్నడూ క్షమించకూడదు. ఏదైనా కారణం చెప్పి వారిని కాపాడితే, కచ్చితంగా సమస్యలు తలెత్తుతాయి’ అని వ్యాఖ్యానించారు.

News March 25, 2024

సొంత గ్రౌండ్స్‌లో ఐపీఎల్ టీమ్స్ ఆధిపత్యం

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో 5 మ్యాచులు పూర్తయ్యాయి. అన్నింటిలోనూ విజయం హోం గ్రౌండ్‌ జట్లకే దక్కింది. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే, పంజాబ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, రాజస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్, అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గెలుపొందాయి. ఇక నేడు బెంగళూరులో ఆర్సీబీ, పంజాబ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో ఇది కొనసాగుతుందో లేదో చూడాలి.

News March 25, 2024

తమన్నాతో డేటింగ్ అప్పుడు స్టార్ట్ అయింది: విజయ్ వర్మ

image

నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉన్నట్లు తమన్నా గత ఏడాది వెల్లడించిన సంగతి తెలిసిందే. లస్ట్ స్టోరీస్-2 సినిమాలో వీరు కలిసి నటించారు. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. దానిపై వర్మ స్పష్టతనిచ్చారు. ‘మేం ప్రేమించుకుంది లస్ట్ స్టోరీస్‌-2లో కాదు. ఓ పార్టీలో కలిసినప్పుడు తనతో ఎక్కువ సమయం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాను. మరో 25 రోజుల తర్వాత మా రిలేషన్ ప్రారంభమైంది’ అని వెల్లడించారు.

News March 25, 2024

ఈ అవార్డు అతనికే: సంజూ

image

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నారు. ఇవాళ LSGతో మ్యాచులో అర్ధసెంచరీ చేసిన సంజూను POTM వరించింది. అయితే ఈ అవార్డుకు బౌలర్ సందీప్ అర్హుడని, అతనికే దీన్ని ఇవ్వాలనుకుంటున్నానని సంజూ చెప్పారు. సందీప్ సరిగ్గా బౌలింగ్ చేయకుంటే తనకు ఈ అవార్డు దక్కేది కాదని తెలిపారు. దీంతో సంజూ కెప్టెన్‌గా హృదయాలు గెలుచుకున్నాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.