India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం <
AP: NTR(D) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో చిన తిరునాళ్లు రేపటి నుంచి నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభం కానుండగా.. 26న రథోత్సవం, తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామంలో ఊరేగిస్తారు. 27న దివ్యప్రభోత్సవం, 28న పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం, 29న బోనాల సమర్పణతో తిరునాళ్లు ముగుస్తాయి.
TG: 8,180 గ్రూప్-4 భర్తీలో రోస్టర్ విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను TSPSC వెబ్‌సైటులో పొందుపరిచారు. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని ఉపసంహరించారు. ఏ జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు దక్కుతాయి? వంటి వివరాలను విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ <
యూపీ మదర్సా చట్టం(2004) రాజ్యాంగ విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. మదర్సా బోర్డు అధికారాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాల అనంతరం కోర్టు తాజా తీర్పుచెప్పింది. ‘ఈ చట్టం లౌకికవాదానికి విరుద్ధం. మదర్సాల్లో చదివే పిల్లల్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. అందుకు తగిన చర్యల్ని ప్రభుత్వం తీసుకోవాలి. అవసరమైతే పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలి’ అని ఆదేశించింది.
వచ్చే విద్యా సంవత్సరంలో(2024-25) 3, 6 తరగతులకు సిలబస్ మారనుందని సీబీఎస్ఈ వెల్లడించింది. మిగిలిన తరగతుల సిలబస్‌లో మార్పులు ఉండవని స్పష్టం చేసింది. కొత్త సిలబస్‌తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని NCERT సమాచారమిచ్చినట్లు పేర్కొంది. ఆరో తరగతిలో అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుందని, స్కూళ్లన్నీ కొత్త సిలబస్‌ను అనుసరించాలని సూచించింది.
AP: విశాఖలో జరిగే IPL మ్యాచ్‌ల టికెట్లు ఇవాళ్టి నుంచి విక్రయించనున్నారు. ఈ నెల 31న CSK-DC, 3న KKR-DC మ్యాచ్‌లు జరగనుండగా.. ఏప్రిల్ 3 మ్యాచ్‌కు నేటి నుంచి, 31వ తేదీ మ్యాచ్‌కు ఈ నెల 27 నుంచి టికెట్లు లభ్యమవుతాయి. పేటీఎం, ఏటీఎం ఇన్‌సైడర్ వెబ్‌సైట్ల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇలా కొన్న వాటిని పీఎం పాలెంలోని వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్‌లో రీడిమ్ చేసి టికెట్లు పొందవచ్చు.
అక్కినేని నాగార్జున మరో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళ డైరెక్టర్ నవీన్‌తో ఆయన ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నారని, ఇందులో నాగ్‌తో పాటు మరో హీరో నటిస్తారని సినీవర్గాలు తెలిపాయి. జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న ఈ మూవీ షూటింగ్ జులై నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నారు.
తమ దేశంలోకి వెల్లువెత్తుతున్న వలసల్ని ఆపేందుకు ఆస్ట్రేలియా వీసా నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. గత ఏడాది ఆస్ట్రేలియాలోకి వచ్చినవారిలో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ పౌరులే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ వీసాల దరఖాస్తుదారులకు ‘జెన్యూన్ స్టూడెంట్ టెస్ట్’ను, చదువు పూర్తైన విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లేలా ‘నో ఫర్‌దర్ స్టే’ నిబంధనను తీసుకొచ్చింది. నిన్నటి నుంచే ఇవి అమలులోకి వచ్చాయి.
ఐపీఎల్-2024లో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటల నుంచి జైపూర్‌లో జరగనుంది. రెండో మ్యాచులో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్‌లో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. జియో సినిమా యాప్‌తో పాటు స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో ఈ మ్యాచులను వీక్షించవచ్చు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌పై HYD జూబ్లీహిల్స్ PSలో ఫోర్జరీ కేసు నమోదైంది. PCL అనే ఉమ్మడి భాగస్వామ్య సంస్థలో ఫోర్జరీ చేసి ఆయన రూ.450 కోట్లు కొట్టేశారని ఆరోపిస్తూ సినీనటుడు వేణు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.75 లక్షలకు పైబడిన అమౌంట్‌కు సంబంధించిన కేసు కావడంతో దాన్ని పోలీసులు సీసీఎస్‌కు బదిలీ చేశారు. రమేశ్ ఇప్పటికే రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని వేణు తరఫున హాజరైన కావూరి భాస్కర్‌రావు ఆరోపించారు.
Sorry, no posts matched your criteria.