News March 22, 2024

రేపు బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల?

image

BJP లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా రేపు విడుదలయ్యే అవకాశముంది. రేపు జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఆరూరి రమేశ్‌కు WGL టికెట్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం అభ్యర్థిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు APలో పోటీ చేసే అభ్యర్థులను కూడా రేపు ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

News March 22, 2024

తెలుగోడి సత్తా ఏంటో చూపనున్నారు!

image

మరికొన్ని గంటల్లో IPL-2024 సమరం మొదలుకానుంది. అయితే, ఈ సీజన్‌లో తెలుగోడి సత్తా ఏంటో చూపించేందుకు ఏడుగురు ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన షేక్ రషీద్, నితీశ్ కుమార్ రెడ్డి, కోన శ్రీకర్ భరత్, మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, రిక్కీ, ఆరవెల్లి అవినాశ్ ఈ టోర్నీలో ఆడుతున్నారు. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

News March 22, 2024

IPL: ఇవాళ గెలిచేది ఎవరు?

image

IPL-2024లో భాగంగా ఇవాళ చెపాక్ మైదానంలో CSK, RCB మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 31 మ్యాచుల్లో తలపడ్డాయి. చెన్నై 20, బెంగళూరు 10 మ్యాచులు గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ సీజన్ మ్యాచులన్నీ జియో సినిమా యాప్(ఫ్రీ), స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో ప్రసారం కానున్నాయి. ఇవాళ్టి మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 22, 2024

ఈ ఔషధం ఖరీదు రూ.35 కోట్లు..

image

పిల్లల్లో జన్యుపరమైన లోపంతో వచ్చే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ(MLD) అనే అరుదైన వ్యాధికి ఆర్చర్డ్ థెరప్యూటిక్(US) సంస్థ ఔషధాన్ని తయారుచేసింది. ‘లెన్మెల్డీ’ అని పిలిచే ఈ డ్రగ్ ఖరీదు రూ.35 కోట్లు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఔషధంగా నిలిచింది. MLD వల్ల మెదడు, నాడీ వ్యవస్థలో ఎంజైమ్స్ లోపం తలెత్తుతుంది. ఎదుగుదల ఆలస్యమవడం, కండరాల బలహీనత సమస్యలు వస్తాయి. తొలి దశలోనే గుర్తిస్తే లెన్మెల్డీతో నయం చేయొచ్చు.

News March 22, 2024

దేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయంటే?

image

దేశంలో దాదాపు 2600కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో గుర్తింపు లేని పార్టీలే (2,597) ఎక్కువ. 57 స్టేట్ పార్టీలు, 6 జాతీయ పార్టీలు (BJP, కాంగ్రెస్, BSP, CPM, నేషనల్ పీపుల్స్ పార్టీ, AAP) ఉన్నాయి. 1951లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వాటిలో 14 జాతీయ పార్టీలుండగా, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 6 మాత్రమే పోటీలో ఉండనున్నాయి. అప్పటితో పోలిస్తే దేశంలో నేషనల్ పార్టీల సంఖ్య తగ్గింది.

News March 22, 2024

కర్మ వదిలిపెట్టదు.. కేజ్రీవాల్ అరెస్టుపై శర్మిష్ఠ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టును మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ స్వాగతించారు. ‘అప్పట్లో ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్, కాంగ్రెస్‌పై కేజ్రీవాల్, అన్నాహజారే గ్యాంగ్ నిరాధారమైన, క్రూరమైన ఆరోపణలు చేసింది. ఆమెకు వ్యతిరేకంగా ట్రంకు లోడు సాక్ష్యాలు ఉన్నాయని వారు చెప్పారు. ఇప్పటివరకు వాటిని ఎవరూ చూడలేదు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు’ అని ట్వీట్ చేశారు.

News March 22, 2024

సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ‘ఆపరేషన్ వాలెంటైన్’

image

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించిన భారీ యాక్షన్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈనెల 29న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు రాగా.. ఈరోజు అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యక్షమైంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

News March 22, 2024

CAA హెల్ప్‌లైన్ నంబర్ 1032

image

CAA దరఖాస్తుదారుల సందేశాలు తీర్చడం, సమాచారం అందించడానికి కేంద్ర హోంశాఖ ‘1032’ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 2014 డిసెంబర్‌కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు పౌరసత్వానికి అర్హులు.

News March 22, 2024

లాసెట్ నోటిఫికేషన్ విడుదల

image

APలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్‌ను ANU విడుదల చేసింది. 3, 5 ఏళ్ల LLB కోర్సులు, 2 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జరిమానాతో మే 29 వరకు అప్లై చేయవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. జూన్ 9న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

News March 22, 2024

రెండు నెలలు పండుగే.. బెట్టింగ్ జోలికి వెళ్లకండి!

image

బిజీ లైఫ్‌‌లో కాస్త ఉపశమనం ఇచ్చేందుకు బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ సిద్ధమైంది. రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 10 టీమ్స్ తలపడే టోర్నీలో రెండు నెలల పాటు 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి ఈసారి IPL ట్రోఫీ గెలిచేదెవరో చూడాలి. క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్ చేయండి. కానీ, బెట్టింగ్ పెట్టి అప్పులపాలై కుటుంబాన్ని రోడ్డున పడేయకండి.