News April 12, 2025

అందుకే వైసీపీ పతనమైంది: మంత్రి ఆనం

image

AP: వ్యవస్థలను నాశనం చేసింది కాబట్టే వైసీపీ పతనమైందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుయ్యబట్టారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. తమ ఎంపీలను పోలీసులతో వైసీపీ ప్రభుత్వం కొట్టించిందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం చట్టాలకు వ్యతిరేకంగా పనిచేయదని చెప్పారు. మరోవైపు టీటీడీ గోశాలలో గోవులు మరణించాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

News April 12, 2025

బెంగాల్‌లో అల్లర్లు.. 110 మంది అరెస్ట్

image

వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన నిరసనలు <<16039360>>హింసాత్మకంగా <<>>మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్దా, ముర్షీదాబాద్, సౌత్ 24 పరగనాస్, హుగ్లీ జిల్లాల్లో ఆందోళనకారులు రోడ్లపైకి చేరి రాళ్ల దాడికి దిగారని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ముర్షీదాబాద్‌లోనే 110 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందన్నారు.

News April 12, 2025

మంత్రి పదవి కోసం 32 మంది పోటీ: ఎర్రబెల్లి

image

TG: మంత్రి పదవి కోసం 32 మంది పోటీపడుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కానీ నలుగురికే ఆ పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఎంత మంది ఉంటారనే విషయమై స్పష్టత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో తెలియదన్నారు.

News April 12, 2025

OTTలోకి సూపర్ హిట్ మూవీ

image

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సుజీత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 31న విడుదలైంది. దాదాపు రూ.53 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమా ఇప్పటికే మరో ఓటీటీలోనూ రిలీజైన విషయం తెలిసిందే.

News April 12, 2025

విద్రోహ కూటమిని తమిళ ప్రజలు సహించరు: స్టాలిన్

image

తమిళనాడులో AIADMK-BJP కూటమిపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది ఓడిపోయే కూటమి. ఇలాంటి విద్రోహ శక్తులను తమిళ ప్రజలు సహించరు. గతంలో ఎన్నోసార్లు ఓడించారు. మళ్లీ ఓడేందుకే అమిత్ షా పొత్తు పెట్టుకున్నారు. దీనిపై వారి స్టాండ్ ఏంటో చెప్పలేదు’ అని ధ్వజమెత్తారు. నీట్, హిందీ ఇంపోజిషన్, వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్నామన్న AIADMK నిన్న అమిత్‌షా ముందు మౌనం వహించిందని దుయ్యబట్టారు.

News April 12, 2025

డిస్కంలకు రూ.4,470 కోట్ల సబ్సిడీ నిధులు

image

AP: 2025-26 తొలి త్రైమాసికానికిగాను మూడు డిస్కంలకు సబ్సిడీ సొమ్ము విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ.4,470 కోట్లను డిస్కంల ఖాతాల్లో జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీని ఆదేశిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులిచ్చారు. ప్రజలపై టారిఫ్ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

News April 12, 2025

సత్తా చాటిన అమ్మాయిలు

image

AP: ఇంటర్ ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు సత్తా చాటారు. రెగ్యులర్ ఫస్టియర్‌లో 66 శాతం మంది బాలురు ఉత్తీర్ణులైతే బాలికలు 75 శాతంతో పైచేయి సాధించారు. సెకండియర్‌లో అబ్బాయిలు 80 శాతం, అమ్మాయిలు 86 శాతం మంది పాసయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం, సెకండియర్‌లో అబ్బాయిలు 67 శాతం, అమ్మాయిలు 84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

News April 12, 2025

IPL: గుజరాత్‌ ఆటగాడికి గాయం

image

గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా వైదొలగినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. తిరిగి న్యూజిలాండ్‌కు పయనమయ్యారని వెల్లడించాయి. SRHతో మ్యాచ్ సమయంలో ఫిలిప్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు. కాగా ఇవాళ లక్నోతో GT తలపడనుంది.

News April 12, 2025

పాస్ కానివారు నిరాశ చెందొద్దు: మంత్రి లోకేశ్

image

AP: ఇంటర్ ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని మంత్రి లోకేశ్ అన్నారు. ఉత్తీర్ణత కానివారు నిరాశ చెందవద్దని, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ రాయాలని సూచించారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకోవాలని, జీవితంలో ఉన్నతస్థితికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.

News April 12, 2025

మార్క్ శంకర్‌‌కు బ్రోన్కో స్కోపీ.. ఖర్చు ఎంతంటే?

image

సింగపూర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌‌కు <<16039701>>బ్రోన్కో స్కోపీ<<>> చికిత్సను అందించిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో పరిస్థితిని బట్టి చికిత్స అందిస్తారు. దీనికి రూ.5 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. మరోవైపు చికిత్స తీసుకున్న ఆసుపత్రిలో బిల్లు లక్షల్లో ఉంటుందని చర్చ జరిగినా తక్కువ ఖర్చులోనే ట్రీట్మెంట్ పూర్తైందని తెలుస్తోంది.