India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువుల ఫలితం రేపు తేలనుంది. ఉ.11 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులకు అంచనాలు ఉండటం సహజం. కానీ ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లను తిట్టకండి. కనిపెంచిన మీరే వాళ్లపై నమ్మకం ఉంచి, ధైర్యం చెప్పకపోతే ఎలా? ప్రతికూల ఫలితాలు వచ్చినా భవిష్యత్తుపై నమ్మకం కలిగించండి. ఫెయిలైనంత మాత్రాన లైఫ్ ముగిసినట్టు కాదని పిల్లలూ గుర్తుంచుకోవాలి.
SHARE IT
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.
AP: ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు దంపతులు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ఈ కళ్యాణోత్సవానికి సంబంధించిన ఫొటో గ్యాలరీని పైన చూడొచ్చు.
చెపాక్ స్టేడియంలో చెన్నైని కేకేఆర్ చిత్తు చేసింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 103 పరుగులే చేసింది. ఛేదనలో కోల్‌కతా బ్యాటర్లు వీరవిహారం చేశారు. నరైన్(44), డికాక్(23), రహానే(20) మెరుపులతో ఆ జట్టు 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా ఇది సీఎస్కేకు వరుసగా ఐదో పరాజయం.
KKRపై చెన్నై ఘోరమైన బ్యాటింగ్‌తో నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. అసలు ఇది టీ20నా? టెస్టా? అని ప్రశ్నిస్తున్నారు. బౌలింగ్ పిచ్ అయినంత మాత్రాన మరీ ఇంత దారుణంగా బ్యాటింగ్ చేస్తారా అని ఫైరవుతున్నారు. ఈ సీజన్ ముగిసేసరికి చెన్నై చెపాక్ స్టేడియం పూర్తిగా చెట్లతో నిండిపోతుందని ఓ ఎడిటెడ్ ఫొటో వైరల్ చేస్తున్నారు. కాగా IPLలో డాట్ బాల్‌కు ఒకటి చొప్పున మొక్కలు నాటనున్నారు.
AP: రాష్ట్రంలో రామరాజ్య స్థాపనే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణోత్సవంలో సతీసమేతంగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఒంటిమిట్టలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసి, టూరిజం హబ్‌గా మార్చుతామని చెప్పారు. తిరుమలలో లాగ ఇక్కడ కూడా నిత్య అన్నదానం నిర్వహించాలని టీటీడీ బోర్డును కోరారు.
సీఎస్కే కెప్టెన్ ధోనీ ఔట్ చర్చనీయాంశంగా మారింది. నరైన్ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చారు. ధోనీ రివ్యూ కోరగా రీప్లే పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారు. అయితే రీప్లేలో బంతి బ్యాటు పక్క నుంచి వెళ్తున్న క్రమంలో అల్ట్రాఎడ్జ్‌లో కాస్త హెచ్చుతగ్గులు ఉన్నట్లు వీడియోలో కనిపించాయి. దీంతో క్లియర్ ఎడ్జ్ అయిందని, ఆయన నాటౌట్ అని పలువురు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు?
AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు ప్రత్యేక మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు ఈనెల 24 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో మాధవ్ సహా ఇతర నిందితులను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ట్రంప్-జిన్ పింగ్‌ల మధ్య వ్యక్తిగతంగా చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. సుంకాలపై జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రైవేటుగా హెచ్చరించారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ట్రంప్ హెచ్చరికలను జిన్ ఏ మాత్రం పట్టించుకోలేదని, బదులుగా టారిఫ్స్‌ను 125 శాతానికి పెంచారని పేర్కొంది. ఇరు అగ్రదేశాల మధ్య ఘర్షణ ప్రపంచ వాణిజ్యానికి ముప్పుగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
AP: తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి ఎన్నికలకు వెళ్లాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘BJP-AIADMK కూటమికి శుభాకాంక్షలు. అనుభవం ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తామని కూటమి తెలిపింది. NDA విధానాల ద్వారా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుంది. తమిళనాడుకు కచ్చితంగా మేలు జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.