India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూపీ వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. వారణాసిలో ల్యాండ్ కాగానే ఈ ఘటనపై పోలీసులు, కలెక్టర్‌తో మాట్లాడారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా తనను కిడ్నాప్ చేసి ఆరు రోజుల పాటు హోటళ్లు, హుక్కా బార్లకు తీసుకెళ్లి 23 మంది అత్యాచారం చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంటర్ విద్యార్థులకు ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి తాను బాధపడినట్లు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా సంస్కృతం ఉంచాలని చూస్తుంటే మాత్రం, ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్కృతం తప్పు కాదని, అమ్మ భాష(తెలుగు)కు విద్యార్థులను దూరం చేయడం సరికాదన్నారు. జాతీయ విద్యావిధానం సైతం మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు.
ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణాపై ప్రస్తుత ప్రధాని మోదీ 2011, జూన్ 10న చేసిన ట్వీట్ తాజాగా వైరలవుతోంది. ‘ముంబై దాడిలో తహవూర్ రాణా నిర్దోషి అని అమెరికా ప్రకటించి భారత సార్వభౌమత్వాన్ని అవమానించింది. ఇది విదేశాంగ విధానానికి తిరోగమనం’ అని ట్వీట్‌లో ఆయన రాసుకొచ్చారు. ఇప్పుడు 14ఏళ్ల తర్వాత రాణాను అమెరికా నుంచి రప్పించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఏకంగా రూ.1850 పెరగడంతో రూ.87,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,020 పెరిగి రూ.95,400 పలుకుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,08,000కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.5670, కేజీ వెండిపై రూ.5000 పెరగడం గమనార్హం.
CSK కెప్టెన్‌గా తిరిగి ధోనీని నియమించడంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుస ఓటముల వల్ల ఉద్దేశపూర్వకంగానే యాజమాన్యం ఇలా చేస్తోందని అంటున్నారు. తాజాగా గాయం కారణంతో రుతురాజ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీకి అప్పగించిన CSK 2022లోనూ జడేజాను కెప్టెన్సీ నుంచి తప్పించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు గైక్వాడ్ కెప్టెన్సీలో 5 మ్యాచుల్లో 4 ఓడగా.. అప్పుడు జడేజా కెప్టెన్సీలో 8 మ్యాచుల్లో 6 ఓడింది.
HYD కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌ను లులు ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకుంది. మంజీరాపై 49 సంస్థలు ఆసక్తి చూపగా చివరికి 7 మాత్రమే పోటీలో నిలిచాయి. దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రూ.318 కోట్లకు లులు కొనుగోలు చేసింది. మంజీరా మాల్ నిర్మాణానికి చేసిన అప్పులు చెల్లించలేక పారిశ్రామికవేత్త యోగానంద్ 2023లో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మంజీరాలోనే లులు మాల్ అద్దెకు ఉంటోంది.
ఇవాళ 4 సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేశాయి. తమిళంలో మంచి విజయం సాధించిన ‘పెరుసు’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు IMDbలో 8.1/10 రేటింగ్ ఉంది. హిందీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఛావా’, తెలుగులో సూపర్ హిట్టయిన ‘కోర్ట్’ చిత్రాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యాయి. అలాగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ప్రావింకూడు షప్పు’ సోనీ లివ్‌లో విడుదలైంది.
AP: ఇంటర్ ఫలితాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మరికాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫలితాల విడుదల చేసే తేదీని అధికారులు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తికాగా, 2-3 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలను bieap.gov.in, Way2Newsలో సులభంగా తెలుసుకోవచ్చు.
TG: అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో 5 GOVT ఉద్యోగాలు సాధించిన ఖమ్మం(D)కు చెందిన జ్యోతి శిరీషను CM రేవంత్ అభినందించారు. ‘రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి, రక్తహీనతను లెక్కచేయకుండా జీవితంలో విజయం సాధించాలన్న శిరీష పట్టుదల ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమెను ప్రోత్సహించిన పేరెంట్స్‌కు అభినందనలు. శిరీష భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఇక నుంచి స్టంట్ డిజైన్ కేటగిరీని చేర్చుతున్నట్లు ‘ది అకాడమీ’ ట్వీట్ చేసింది. 2027లో రిలీజయ్యే చిత్రాల్లో ఎంపికైన వాటికి 2028లో అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికి ‘RRR’ సినిమా పోస్టర్‌ను జోడించింది. దీనిపై RRR మేకర్స్ స్పందిస్తూ ‘ఇది మనమందరం గర్వించదగ్గ క్షణం. RRR మూవీ, అందులోని యాక్షన్‌ను ప్రపంచం ఇంకా సెలబ్రేట్ చేసుకోవడం సంతోషంగా ఉంది’ అని Xలో రాసుకొచ్చారు.
Sorry, no posts matched your criteria.