News April 11, 2025

అనారోగ్యంతో అప్పులపాలు.. ఆదుకుంటామని లోకేశ్ హామీ

image

AP: ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే చిరుద్యోగి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో రూ.7లక్షలకు పైగా ఆస్పత్రి ఖర్చులు అయ్యాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి తెలిసి, ప్రసాద్‌ను ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రి లోకేశ్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తన టీమ్‌ను మంత్రి ఆదేశించారు.

News April 11, 2025

కియాలో 900 ఇంజిన్ల చోరీ.. ఇంటి దొంగల పనే!

image

AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా పరిశ్రమలో <<16027604>>900 ఇంజిన్ల చోరీపై<<>> విచారణ కొనసాగుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి తీసుకొచ్చే క్రమంలోనే దొంగతనం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ‘ఇందులో బయటివాళ్ల ప్రమేయం లేదు. కంపెనీ సిబ్బంది లేదా మాజీ ఉద్యోగుల హస్తం ఉంది. ఈ కేసులో ఎవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు.

News April 11, 2025

అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాలివే!

image

ఈ ఏడాది అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాల్లో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 123 మంది బిలియనీర్లు ఉండగా వీరి మొత్తం విలువ $759 బిలియన్లుగా ఉంది. ఆ తర్వాత 90 మంది బిలియనీర్లు & $409 బిలియన్లతో మాస్కో రెండో స్థానంలో ఉంది. ముంబై రెండు స్థానాలు దిగజారి 6వ స్థానానికి చేరుకుంది. కాగా, ఇక్కడి 67 మంది బిలియనీర్ల నికర విలువ $349 బిలియన్లు. 3,4,5 స్థానాల్లో హాంకాంగ్, లండన్‌, బీజింగ్‌లు ఉన్నాయి.

News April 11, 2025

పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం

image

TGలో ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అందజేస్తుండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం సెర్ప్ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. మే/జూన్ నుంచి దీనిని ప్రారంభించనుంది. వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రంలో 42.96L మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు ₹4,016, ఇతరులకు ₹2,016 అందుతోంది.

News April 11, 2025

మార్కెట్లో కనిపించని మామిడి సందడి

image

TG: ఏప్రిల్ రెండో వారం పూర్తవుతున్నా మర్కెట్‌లో అంతగా మామిడి పండ్లు కనిపించడం లేదు. సహజంగా మార్చి నుంచే మామిడిపండ్లతో నిండే మార్కెట్లలో ఇప్పుడు అంతగా సరఫరా లేదు. గత సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలకు పూత అంతగా రాలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరిలో పూత రాగా, ఆ ప్రభావం సరఫరాపై పడింది. మార్కెట్లో అక్కడక్కడా మామిడి కనిపిస్తున్నా ధరలు మాత్రం మండిపోతున్నాయి. కిలో రూ.150-250 మధ్య పలుకుతున్నాయి.

News April 11, 2025

వైజాగ్ నుంచి మరిన్ని విమాన సర్వీసులు రద్దు

image

AP: విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే నెల బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు సర్వీసులు రద్దు కానున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో ఎయిర్‌లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడకు రెండు సర్వీసులు, దుబాయ్ సర్వీస్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. వీటిని కొనసాగించేలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు, నాయకులు, ప్రజలు కోరుతున్నారు.

News April 11, 2025

కేఎల్ ఉంటే ఖేల్ ఖతమే

image

DC బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో ఛేజింగ్ జట్టు గెలిచిన సందర్భాల్లో అత్యధిక యావరేజ్(71.05) కలిగిన ఇండియన్ బ్యాటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్(103.70 యావరేజ్‌) టాప్‌లో ఉన్నారు. KL 25 ఇన్నింగ్సుల్లో 148.58 స్ట్రైక్ రేటుతో 1,208 రన్స్ చేశారు. ఇందులో 12 హాఫ్ సెంచరీలున్నాయి. ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ రన్‌ఛేజ్ మ్యాచ్‌లలో మొత్తంగా 56 మంది 500+ పరుగులు చేశారు.

News April 11, 2025

నేటి నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్

image

పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 10వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు లాహోర్ ఖలందర్స్‌తో రావల్పిండిలో తలపడనుంది. వచ్చే నెల 18 వరకు ఈ సీజన్ జరగనుంది. ఆరు జట్లు మొత్తం 34 మ్యాచులాడతాయి. కరాచీ కింగ్స్‌కు డేవిడ్ వార్నర్ ఆడనుండటం ఈసారి ప్రత్యేకతగా నిలవనుంది.

News April 11, 2025

బీజేపీలోకి విజయసాయి రెడ్డి?

image

AP: YSRCP, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నానని ప్రకటించిన మాజీ MP విజయసాయి రెడ్డి BJP తీర్థం పుచ్చుకోనున్నారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. తొలుత టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారన్న టాక్ వినిపించినా.. ఫైనల్‌గా బీజేపీయే బెటర్ అని నిర్ణయించుకున్నారని సమాచారం. MPగా పెద్దల సభకు పంపిచేందుకు కమలనాథులూ ఓకే అన్నారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

News April 11, 2025

2, 3 రోజుల్లో ఇంటర్ ఫలితాలు

image

AP: ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 3 నాటికే మూల్యాంకనం పూర్తవడంతో హాల్ టికెట్ల నంబర్ల ఆధారంగా మార్కుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. 2, 3 రోజుల్లోనే ఫలితాలను రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. bieap.gov.in, Way2Newsలో ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.