News March 22, 2024

ఉదయ్ కిరణ్ బయోపిక్‌పై RGV కన్ను?

image

దివంగత హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తీసేందుకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ఉదయ్ కిరణ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తర్వాత వరుస ఫ్లాప్‌లు, ఆర్థిక సమస్యలతో సతమతమై ఆత్మహత్య చేసుకున్నారు.

News March 22, 2024

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి?

image

TG: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. నిన్న కాంగ్రస్ సీనియర్ నేత జానారెడ్డిని ఆయన కలిశారు. కాంగ్రెస్‌లో చేరికపై వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హస్తం గూటికి చేరడం పక్కా అని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంద్రకరణ్ రెడ్డి స్పందించాల్సి ఉంది.

News March 22, 2024

ఐకాన్ స్టార్‌కు అరుదైన గౌరవం

image

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణకు టైమ్ ఫిక్సయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఈనెల 28న రాత్రి 8 గంటలకు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. పుష్ప గెటప్‌లో ఈ విగ్రహం ఉండనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో హీరోలు ప్రభాస్‌, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు.

News March 22, 2024

లిల్లీ పాత్ర తీరే బోల్డ్‌గా ఉంటుంది: డైరెక్టర్

image

‘టిల్లు స్క్వేర్’ సినిమాలో లిల్లీ పాత్రకు అనుపమ పరమేశ్వరన్ వంద శాతం న్యాయం చేశారని డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పారు. ‘ఈ సినిమాలో ఆమెది ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం చాలా మంది పేర్లను పరిశీలించినా అనుపమే పర్ఫెక్ట్ అనిపించింది. సినిమాలో లిల్లీ పాత్ర తీరే బోల్డ్‌గా ఉంటుంది. ఇది పూర్తిగా కమర్షియల్ మూవీ. ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాం’ అని డైరెక్టర్ మల్లిక్ తెలిపారు.

News March 22, 2024

VIRAL: వీధి దీపం కింద చదువు

image

అప్పట్లో అంబేడ్కర్ వీధిదీపాల వెలుతురులో చదువుకున్నారని తెలుసు. అలాంటి అభినవ అంబేడ్కర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధి దీపం కింద ఓ బాలుడు శ్రద్ధగా చదువుకుంటున్న ఫొటోను పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు. ‘విద్య లేని పిల్లలు.. రెక్కల్లేని పక్షి లాంటి వాళ్లు’ అని ఓ సామెతను జత చేశారు. ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

News March 22, 2024

చరణ్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నాడు ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రిలీజ్ డేట్, అలాగే RC 26 నుంచి పోస్టర్‌ రానున్నాయి. వీటితోపాటు అదే రోజు సుకుమార్ మూవీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయనున్నట్లు టాక్. దీంతో చరణ్ పుట్టినరోజున అభిమానులకు ఫుల్ మీల్సేనని సినీవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్‌లో బిజీగా ఉన్నారు.

News March 22, 2024

పవన్‌కు విశ్వసనీయత తక్కువ: మావోయిస్టు నేత గణేశ్

image

AP: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తూ మావోయిస్టు కీలక నేత గణేశ్ ఓ లేఖ రాశారు. ఇందులో జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదు. అతడికి విశ్వసనీయత తక్కువ. పార్టీ స్థాపించినప్పుడు తమది కమ్యూనిస్ట్ భావజాలమని చెప్పారు. కానీ ప్రస్తుతం జనసేన రాజకీయ నిరుద్యోగులకు వేదికగా మారింది’ అని ఆయన విమర్శించారు.

News March 22, 2024

రాజకీయ ప్రతీకారంతోనే కేజ్రీవాల్ అరెస్ట్: కేటీఆర్

image

TG: రాజకీయ ప్రతీకారంతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆయన అరెస్టును ఖండిస్తున్నానని చెప్పారు. ‘ఈడీ, సీబీఐతో బీజేపీ ప్రతిపక్షాలను అణచివేస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను నిరాధార ఆరోపణలతో అరెస్ట్ చేయిస్తోంది. రాజకీయ ప్రతీకారమే బీజేపీ ఏకైక లక్ష్యం’ అని ఆయన మండిపడ్డారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

News March 22, 2024

ప్రచారంలో ప్రజల నుంచి అద్భుత స్పందన: VSR

image

AP: ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోందని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ‘గత ఐదేళ్లలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం కృషి చేశారు. రాజకీయాల్లోనూ వారికి సామాజిక న్యాయం కల్పించాం. అందుకే మరోసారి జగన్‌ను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News March 22, 2024

అట్లుంటది విద్యార్థులతోని..

image

విద్యార్థుల జీవితంలో పరీక్షలు కీలకమైనవి. ముఖ్యంగా పది, ఇంటర్ పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలని సన్నద్ధమవుతారు. రోజుకు నాలుగైదు గంటలే నిద్రకు కేటాయించి మిగిలిన సమయాన్నంతా సాధనకే కేటాయిస్తారు. ఎంసెట్, JEE పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు ఈరోజు మళ్లీ రాదని భావించి కఠిన షెడ్యూల్‌ వేసుకొని చదువుతుంటారు. అలా ఓ JEE విద్యార్థి వేసుకున్న షెడ్యూల్ వైరలవుతోంది. మరి మీరూ ఇలా చదివారా.. కామెంట్ చేయండి