India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’లో దీపికా పదుకొణె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె సుహానా ఖాన్ తల్లిగా, షారుఖ్ మాజీ ప్రేయసిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథలో ప్రధాన సంఘర్షణలకు ఈ పాత్ర కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘పఠాన్’ రూ.1050 కోట్లు వసూలు చేసింది.
భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బంగ్లాకు తిరిగివస్తానని, అవామీ లీగ్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. SMలో వారితో మాట్లాడుతూ బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజలంటే ప్రేమ లేదన్నారు. అధిక వడ్డీలకు రుణాలిచ్చి విదేశాల్లో విలాసవంతంగా బతికారన్నారు. ఆయన అధికార వాంఛ బంగ్లాను తగలబెడుతోందని దుయ్యబట్టారు.
సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి మరణించారు. ఇదే ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. కాగా ఇవాళ సాయంత్రం పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.
TG: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండో తెలుగు పార్టీ BRS అని కేటీఆర్ అన్నారు. అందుకే వరంగల్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ సారి డిజిటల్ మెంబర్‌షిప్ ప్రవేశపెడుతున్నామని, అందుకోసం జిల్లా కార్యాలయాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జిల్లాల్లో నెలకో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
APలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీకి బలం లేదని 7 చోట్ల చంద్రబాబు ఎన్నికలను వాయిదా వేయించారని ఆరోపించారు. రామగిరిలో 9 MPTC స్థానాలను వైసీపీ గెలిచిందని, టీడీపీ ఎమ్మెల్యే, తనయుడు, రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలు చేసి తమ ఎంపీపీ స్థానం గెలిచేందుకు ప్రయత్నించారని విమర్శించారు. దీన్ని అడ్డుకుంటే తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
LSGతో మ్యాచులో తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరగగా దీనికి కారణం MI కెప్టెన్ హార్దిక్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. నిన్న RCBతో మ్యాచులో వీరిద్దరూ పోరాడినా, కీలక సమయంలో ఔటవ్వడంతో ఓటమి తప్పలేదు. అయితే తిలక్‌తో తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని అర్థం వచ్చేలా పాండ్య IGలో పోస్ట్ చేశారు. వీరుడిలా పోరాడావంటూ తిలక్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇలా ప్లేయర్లను ప్రోత్సహించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి(APR 10) సందర్భంగా ఎల్లుండి మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. మటన్, బీఫ్ ఇతర మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.
TG: త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక రూ.వేల కోట్ల వ్యవహారం ఉందన్నారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ ఉన్నారన్నారు. ఒకరు ఢిల్లీ నేత చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని విమర్శించారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలోనే ఉందని ఆరోపించారు.
AP: కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కురిడి గ్రామ పర్యటనలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రజలు కోరగా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి తన వంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విలేజ్‌ను మోడల్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
TG: భూముల కబ్జాకు ప్రయత్నించారనే BRS నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఆరోపణలపై MLA కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ‘నాపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి విడిచి మీకు గులాంగిరి చేస్తాను. లేకపోతే మీరు నాకు గులాంగిరి చేయాలి’ అని వారికి సవాల్ విసిరారు. చీము నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమని కడియం స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.