India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: HYDలో తాగునీటి కొరత పెరగడంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ రెట్టింపయ్యింది. ఈ నేపథ్యంలో సమ్మర్ మొత్తం 24గంటలపాటు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని వాటర్ బోర్డు నిర్ణయించింది. నల్లాల ద్వారా వచ్చే నీరు సరిపోకపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రోజుకు 9వేల ట్యాంకర్లు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గృహ అవసరాలకు ₹500, కమర్షియల్ అవసరాలకు ₹850గా ధరలను నిర్ణయించారు.

AP: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని కాల్వలకు ఇవాళ నీరు విడుదల చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలు, గుంటూరు ఛానల్ ద్వారా ఈ నెల 10వ తేదీ వరకు నీరు విడుదల చేయనున్నారు. తాగునీటి కోసమే విడుదల చేస్తున్న ఈ నీటిని చేపలు, రొయ్యల చెరువులు, ఇతర అవసరాల కోసం వాడుకోకూడదని అధికారులు స్పష్టం చేశారు.

దేశంలో జులై1 నుంచి నూతన న్యాయ చట్టం అమల్లోకి రానుంది. నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమయ్యే వైద్యులకు 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే ఛాన్సుంది. భారతీయ న్యాయ సంహిత-2023లోని 106 సెక్షన్ ప్రకారం డాక్టర్లకు 5ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా.. RMP(రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు 2ఏళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా వేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. వీటిపై వైద్యులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది.

AP: చారిత్రక వారసత్వ సంపదకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా బొబ్బిలి. ఈ సెగ్మెంట్‌లో TDP చివరగా 1994లో గెలిచింది. దీంతో ఈ ఎన్నికల్లో నెగ్గి బొబ్బిలి గడ్డపై జెండా ఎగరేయాలని టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బొబ్బిలి రాజవంశానికి చెందిన రంగారావు(బేబీనాయన)ని రంగంలోకి దింపింది. ఇటు 2014, 19లో వరుసగా గెలిచిన వైసీపీ అభ్యర్థి శంబంగి చినఅప్పలనాయుడు హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

AP అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని HYD జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) జోస్యం చెప్పారు. ‘చంద్రబాబు పని అయిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన చాలా తప్పు చేశారు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవీ తర్వాతి కాలంలో మనుగడ సాధించిన దాఖలాలు లేవు. పొత్తు తర్వాత జతగూడిన పార్టీలను మింగేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.

AP: CM జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగనుంది. గురవరాజుపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. చిన్నసింగమలలో ఉ.11గంటలకు లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ సమావేశమవుతారు. మధ్యాహ్నానికి యాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నాయుడుపేటలో బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం గూడూరు బైపాస్, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డిపాలెం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.

AP: ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 12వ తేదీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేటితో జవాబు పత్రాల మూల్యాంకనం ముగియనుంది. ఆపై వెంటనే పున:పరిశీలన, మార్కుల నమోదు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇటు పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 8తో పూర్తి కానుంది. ఆ తర్వాత వారం, పది రోజుల్లో పది ఫలితాలను సైతం విడుదల చేసే అవకాశముంది.

జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరగనుండగా, దేశవ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది రాయనున్నారు. ఉ.9 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.3 నుంచి సా.6 వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డు, ఫొటో ఐడీ ప్రూఫ్ ఉంటేనే అభ్యర్థులను పరీక్షకు అనుమతించనున్నారు.
* ALL THE BEST

నిన్న DCపై KKR ఆల్‌రౌండర్ నరైన్ 39బంతుల్లోనే 85రన్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగారు. అయితే.. నరైన్‌ను ఓపెనర్‌గా మార్చిన ఘనత KKR మెంటార్ గంభీర్‌దే. 2017లో KKR కెప్టెన్ గంభీర్.. నరైన్‌లోని హిట్టింగ్ సామర్థ్యాన్ని గమనించి ఓపెనర్‌ని చేశారు. నరైన్ కూడా అద్భుతమైన ఆరంభాలు ఇచ్చారు. గౌతీ KKRను వీడాక నరైన్ మళ్లీ లోయర్ ఆర్డర్‌కి వెళ్లారు. ఇప్పుడు గంభీర్ రీఎంట్రీతో నరైన్ మళ్లీ ఓపెనర్ అవతారం ఎత్తారు.

నంద్యాల పార్లమెంట్ TDP ఇన్‌ఛార్జ్ శివానందరెడ్డి కేసులో తెలంగాణ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ‘బుద్వేల్‌లో అసైన్డ్ భూమి కాజేసేందుకు శివానందరెడ్డి యత్నించారు. భార్య, కుమారుడి పేర్లతో చట్ట విరుద్ధంగా భూములు బదిలీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ఇటీవల ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు నంద్యాల(D) అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన తప్పించుకున్నారు.
Sorry, no posts matched your criteria.