News April 7, 2025

ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం

image

ఏపీ ప్రభుత్వం చేపట్టనున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి గోదావరి నదీ యాజమాన్య బోర్డు వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. ఏపీ ప్రభుత్వం సమాచారం, DPR వివరాలు దాచిపెడుతోందని ఆరోపించింది. కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు బోర్డు కనీస సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ అధికారులు మాత్రం DPR తయారు చేయలేదని చెప్పుకొచ్చారు.

News April 7, 2025

కొందరు అధికారులే నిజమైన అంధులు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

image

TG: దివ్యాంగుల శాఖ అధికారుల తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంధులను కోర్టు చుట్టూ తిప్పడంపై మండిపడ్డారు. కొందరు అధికారులే నిజమైన అంధులని ఫైరయ్యారు. తమను అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించారంటూ 2017లో పలువురు అంధులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. కాగా వీరి సమస్యను త్వరగా పరిష్కరించాలని జడ్జి అధికారులను ఆదేశించారు.

News April 7, 2025

97 ఏళ్ల వయసులో తాబేలుకు పిల్లలు

image

US ఫిలడెల్ఫియాలో అబ్రాజో, మోమీ అనే తాబేళ్ల జంట 97 ఏళ్ల వయసులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయని, సరిపడా ఆహారం తీసుకుంటున్నాయని జూ నిర్వాహకులు తెలిపారు. వెస్ట్రన్ శాంటాక్రూజ్ గలాపగోస్ జాతికి చెందిన ఈ తాబేళ్లు అంతరించే పోయే దశలో ఉన్నాయి. దీంతో సంరక్షిస్తున్నారు. మోమీ జూలో ప్రవేశించి ఈ నెల 23కు 93 ఏళ్లవుతుంది. ఆ రోజున దాని పిల్లలను బహిరంగంగా ప్రదర్శించనున్నారు.

News April 7, 2025

ధరల్లో మార్పులు చేయవద్దు: ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచన

image

పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్‌కు రూ.2 చొప్పున విధించిన ఎక్సైజ్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పెంపు భారం ప్రజలపై ఉండదని వెల్లడించింది. ఎక్సైజ్ సుంకం ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ప్రకటించింది. ఈ మేరకు రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు.

News April 7, 2025

నేను బతికున్నంతకాలం మీ ఉద్యోగాలు పోవు: మమతా బెనర్జీ

image

ఇతర రాష్ట్రాల పరీక్షల్లో, నీట్‌లో అవినీతి జరిగినప్పుడు ఆ నోటిఫికేషన్లను సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశ్నించారు. పరీక్షల్లో అవినీతి చేసిన వారి ఉద్యోగాలను తొలగించాలి తప్ప పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను బతికున్నంత కాలం అర్హులెవరూ ఉద్యోగాలు కోల్పోరని హామీ ఇచ్చారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు.

News April 7, 2025

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. 2,226 పాయింట్ల నష్టంతో sensex 73,137 పాయింట్ల వద్ద, 742 పాయింట్ల నష్టంతో nifty 22,161 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఇవాళ ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.16 లక్షల కోట్లు నష్టపోయారు. ట్రెంట్, టాటా స్టీల్, JSW స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎయిర్‌టెల్, AXIS, HDFC, ICICI, ITC షేర్లు భారీగా నష్టపోయాయి.

News April 7, 2025

హైదరాబాద్‌లో మొదలైన వర్షం

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. మరికాసేపట్లో MBNR, మేడ్చల్, NGKL, RR, సిద్దిపేట, ములుగు, VKB జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, భద్రాద్రి, MHBD జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, గంటకు 41-61కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ప్రాంతంలో వర్షం పడుతోందా?

News April 7, 2025

మీకోసం నాలుగు సూత్రాలు!

image

హెల్తీ లైఫ్ కోసం వ్యాయామం ఎంత ముఖ్యమో డైట్, సరైన దినచర్య కూడా అంతే ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ‘రోజులో 12 గంటల వ్యవధిలో ఏమీ తినకుండా ఉండాలి. వారానికి 2 సార్లు 5 ని.ల చొప్పున స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. నిద్ర మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 20ని.లు ఎండలో నిలబడాలి. రోజులో 15 ని.లు మీకోసం కేటాయించుకొని ఫోన్ పక్కన పెట్టి ఇష్టమైన పనులు చేయాలి’ అని వైద్యులు చెబుతున్నారు.

News April 7, 2025

ప్రయాణికురాలి మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

ముంబై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం ఛత్రపతి శంభాజీనగర్‌‌లోని ఎయిర్‌పోర్టులో నిన్న రాత్రి 10 గం.కు అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న మీర్జాపూర్‌కు చెందిన మహిళ సుశీల(89)కి అసౌకర్యంగా అనిపించడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. మెడికల్ టీం పరిశీలించి, అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం విమానం వారణాసికి పయనమైంది.

News April 7, 2025

స్టాక్ మార్కెట్లకు దూరంగా ఉండండి: రాహుల్ గాంధీ

image

స్టాక్ మార్కెట్లపై కాంగ్రెస్ అగ్రనేత, LOP రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించడం ఓ భ్రమ అని, యువత దాని నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకశాతం జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతోందని బిహార్‌లోని బెగుసరాయ్‌లో <<16019988>>‘తెల్ల టీషర్ట్’<<>> ఉద్యమంలో పాల్గొన్న అనంతరం వ్యాఖ్యానించారు.