News April 2, 2025

గెలిచినా, ఓడినా ఒకేలా ఉండండి.. LSG ఓనర్‌కు నెటిజన్ల క్లాస్!

image

నిన్నటి మ్యాచ్‌లో PBKSపై LSG ఓడిపోవడంతో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ పంత్‌పై సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్న మ్యాచ్ గెలిచినప్పుడు ఈయనే పంత్‌కు సెల్యూట్ చేస్తూ, హత్తుకుంటూ అభినందించారు. గెలిచినప్పుడు ఒకలా.. ఓడినప్పుడు మరోలా ప్రవర్తించడంపై విమర్శలొస్తున్నాయి. ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఓటమిలో ప్లేయర్లకు అండగా ఉండి వారిని ఎంకరేజ్ చేయాలని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

News April 2, 2025

SAD: విధుల్లో చివరి రోజే జీవితంలోనూ ఆఖరి రోజైంది!

image

ఆ లోకో పైలట్‌కి విధుల్లో అదే ఆఖరి రోజు. ‘త్వరగా వచ్చేస్తాను.. అందరం డిన్నర్‌కి వెళ్దాం’ అని కుటుంబానికి మాట ఇచ్చారు. కానీ విధుల్లో చివరి రోజే జీవితంలోనూ ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయారు. నిన్న ఝార్ఖండ్‌లో గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన గంగేశ్వర్ మాల్ కన్నుమూశారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదు నాన్నా అంటూ ఆయన కుమార్తె గుండెలవిసేలా రోదిస్తున్నారు.

News April 2, 2025

భారత రిచెస్ట్ ఉమెన్ ఎవరంటే?

image

ఫోర్బ్స్-2025 ప్రకారం OP జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్($35.5 బిలియన్లు) భారత రిచెస్ట్ ఉమెన్‌గా నిలిచారు. ఓవరాల్‌గా IND టాప్-10 బిలియనీర్లలో సావిత్రి ఒక్కరే మహిళ కావడం విశేషం. తొలి స్థానంలో అంబానీ($92.5 బి.), రెండో స్థానంలో అదానీ($56.3 బి.), మూడో ప్లేస్‌లో సావిత్రి ఉన్నారు. ఆమె భర్త ఓంప్రకాశ్ స్థాపించిన జిందాల్ గ్రూప్ స్టీల్, విద్యుత్, సిమెంట్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు విస్తరించింది.

News April 2, 2025

దైవం మనుష్య రూపేణ.. మహేశ్‌పై ప్రశంసలు!

image

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఉచితంగా వైద్యం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఫౌండేషన్ 4500కు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించింది. తాజాగా పుట్టుకతోనే గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ చేయించినట్లు పేర్కొంది. ఇందులో ఒకరికి రెండేళ్లు, మరొకరికి నాలుగు నెలలు మాత్రమే. దీంతో మహేశ్‌ది గొప్ప మనసంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

News April 2, 2025

‘సుజుకీ’ అమ్మకాల జోరు

image

కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12,56,161 యూనిట్లను 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో సేల్ చేసినట్లు సుజుకీ మోటార్‌సైకిల్ ప్రకటించింది. FY 2023-24లో 11,33,902 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. న్యూయాక్సెస్ స్కూటర్, గిక్షర్ SF250 వేరియంట్లతో అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు చెప్పింది. అటు IND మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో సంస్థ ప్రదర్శించిన ఈ-యాక్సెస్ స్కూటర్ వేరియంట్‌తోనూ విక్రయాలు జోరందుకున్నాయి.

News April 2, 2025

ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు MLCలు

image

AP: ఇటీవల శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు MLCలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మండలిలోని ఛైర్మన్ ఛాంబర్‌లో కొయ్యే మోషేన్‌రాజు MLCలు సోము వీర్రాజు, బీటీ నాయుడు, కొణిదెల నాగబాబు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర MLAలు పాల్గొన్నారు.

News April 2, 2025

ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

image

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.

News April 2, 2025

కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక కోరిన కేంద్రం

image

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటవీ చట్టానికి లోబడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని పేర్కొంది.

News April 2, 2025

ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయొచ్చుగా..!

image

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమై మండుటెండలో బయటకు వస్తే సిగ్నల్స్ వద్ద ఉడికిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ క్లాత్‌తో తాత్కాలిక టెంట్‌ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

News April 2, 2025

2.O భిన్నంగా ఉంటుంది: జగన్

image

AP: వచ్చే ఎన్నికల్లో YCP భారీ మెజారిటీతో గెలుస్తుందని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. కరోనా వల్ల కార్యకర్తలకు నేను చేయాల్సినంత చేసుండకపోవచ్చు. ఈసారి జగన్ 2.O భిన్నంగా ఉంటుంది. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతా. రాబోయే రోజులు మనవే’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అప్పులపై CBN అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.