India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
BG-2 పత్తి విత్తనాల ధరను కేంద్ర ప్రభుత్వం ప్యాకెట్‌కు రూ.37 మేర పెంచింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో 475 గ్రాముల ప్యాకెట్ రేటు రూ.864 నుంచి రూ.901కి చేరింది. బీజీ-1 విత్తనాల ధర(రూ.635)ను యథాతథంగా ఉంచింది. ఎక్కడైనా ఇంతకుమించి రేటుకు అమ్మితే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
AP: చంద్రబాబు ఆరోసారి కూడా రాష్ట్రానికి సీఎం అవుతారని మాడుగుల నాగఫణి శర్మ జోస్యం చెప్పారు. AP ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. అమరావతిని ఎవరూ కదిలించలేరని శర్మ ఈ సందర్భంగా తెలిపారు. ‘అమరావతి విశ్వనగరం అవుతుంది. ఎవరికైనా పదవులు రాకపోయినా కంగారుపడొద్దు. ఆలస్యమైనా అర్హత ఉన్నవారందరికీ పదవులు దక్కుతాయి’ అని పేర్కొన్నారు.
MI స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్లో ఇప్పటి వరకూ ఆ జట్టుకు సరైన ఆరంభాల్ని అందివ్వలేకపోయారు. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ స్పందించారు. ‘రోహిత్ ముంబై బ్లూ జెర్సీకి బదులు టీమ్ ఇండియా బ్లూ జెర్సీలో ఆడుతున్నట్లు భావించాలి. అప్పుడైతే రన్స్ చేస్తారేమో. ఆయనలాంటి మంచి ప్లేయర్ వెనుకబడకూడదు. పరుగుల వరద పారించాలి. ఆయన సరిగ్గా ఆడకపోతే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరలేదు’ అని జోస్యం చెప్పారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు డెనిస్ ఆర్న్‌ట్(86) మృతిచెందారు. వృద్ధాప్య కారణాలతో ఆయన కన్నుమూశారని ఆయన కుటుంబీకులు ప్రకటనలో తెలిపారు. 1939, ఫిబ్రవరి 23న జన్మించిన డెనిస్ 50 ఏళ్ల పాటు నటుడిగా కొనసాగారు. బేసిక్ ఇన్‌స్టింక్ట్, అనకొండ సీక్వెల్, స్నైపర్ 3 వంటి పలు హిట్ సినిమాల్లో, అనేక సిరీస్‌లలో ఆయన నటించారు.
TG: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇవాళ మ.12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ జిష్ణుదేవ్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాబినెట్‌లో నలుగురికి చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
TG: సింగరేణి గనుల నుంచి ఈ నెల 28న 3.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసినట్లు సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. 136 ఏళ్ల చరిత్రలో ఇదొక రికార్డని పేర్కొన్నారు. అధికారులు, కార్మికుల కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రానున్న రోజుల్లోనూ ఇలాగే బొగ్గు ఉత్పత్తి చేస్తామన్నారు.
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
TG: ఇటీవల గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులను విడుదల చేసిన టీజీపీఎస్సీ ఇవాళ జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో లిస్టును అప్‌లోడ్ చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
TG: రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలోకి కొత్తగా 164 ప్రైవేటు ఆస్పత్రులను చేర్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 ఆస్పత్రులుండగా, ఇందులో 409 ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వం చికిత్స ఖర్చును రూ.10 లక్షలకు పెంచడంతోపాటు మొత్తంగా 1,835 వ్యాధులను చేర్చింది. దీంతో 2024-25లో 3.53 లక్షల మంది చికిత్స చేయించుకున్నారు.
IPLలో నిన్న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఆడటం ద్వారా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు. టీ20 క్రికెట్(IPL+దేశవాళీ+ఇంటర్నేషనల్)లో 450 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401), ధోనీ(393), సురేశ్ రైనా(336) ఉన్నారు. ఓవరాల్‌గా కీరన్ పొలార్డ్(695), బ్రావో(582), షోయబ్ మాలిక్(555), రస్సెల్(540), నరైన్(537) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.