News March 29, 2025

ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్!

image

అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి వీసాలు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతున్నారు. అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన, లైక్ చేసిన విద్యార్థులకూ ఈ హెచ్చరికలు పంపింది. ఇందులో పలువురు భారతీయ విద్యార్థులూ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 29, 2025

నా సినిమా కోసం నేనెప్పుడూ ప్రార్థించలేదు: సల్మాన్

image

తన సినిమా హిట్ అవ్వాలని కోరుతూ ఎప్పుడూ దేవుడిని ప్రార్థించలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘నా సినిమా విజయం సాధించడమనేది ప్రేక్షకుల దయపై ఆధారపడి ఉంటుంది. ‘మైనే ప్యార్ కియా’కి తప్పితే ఎప్పుడూ సినిమా సక్సెస్ చేయమంటూ దేవుడిని ప్రార్థించలేదు. నన్ను ప్రేమించేవాళ్లే నాకోసం ప్రార్థనలు చేస్తుంటారు. నేను ఉత్తమ నటుడిని అని ఎప్పటికీ అనుకోను’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

మీరు గ్యారంటీలు ఇస్తే.. మేం నిధులివ్వాలా?: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా? అని కేంద్ర‌ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో అనేక రహదారులు ఏర్పడ్డాయని చెప్పారు. ‘మేం ఇచ్చిన హమీల అమలు బాధ్యత మాదే. ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు. BJPలో అలా కాదు. JP నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదు’ అని ఓ మీడియా కాంక్లేవ్‌లో తెలిపారు.

News March 29, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరలు వరుసగా నాలుగవ రోజూ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.83,600లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరగడంతో రూ.91,200 వద్ద కొనసాగుతోంది. అటు వెండి మాత్రం రూ.1000 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,13,000గా ఉంది.

News March 29, 2025

రూ.వందల కోట్లు పోగొట్టుకున్నాం.. రూ.35లక్షల ఆరోపణలా?: కడప మేయర్

image

AP: కడప MLA మాధవిపై మేయర్ సురేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు మారుతూ పబ్బం గడిపే వారు తనపై నిందలేయడం విడ్దూరంగా ఉందన్నారు. ప్రజా సేవలో తమ కుటుంబం రూ.వందల కోట్లు పోగొట్టుకుందని, అలాంటిది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు తనపై కేవలం రూ.35 లక్షల ఆరోపణలా? అని ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన వారే నిందలేస్తారా? అని మండిపడ్డారు. 3దశాబ్దాలుగా సేవ చేశామే తప్ప రాజకీయ లబ్ధి పొందలేదన్నారు.

News March 29, 2025

ఆ నీటిని వాడొద్దు.. చాలా ప్రమాదకరం!

image

ఎండాకాలం వచ్చేసింది. నీటి ఎద్దడి ప్రారంభమైంది. దీంతో చాలా చోట్ల, ముఖ్యంగా నగరాల్లో డ్రమ్ముల్లో నీటిని నిల్వ చేసి అవే వాడుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘క్రిములు పుట్టేది, కీటకాలు గుడ్లు పెట్టేది నిల్వ నీటిలోనే. రోజుల తరబడి స్టోర్ చేసిన నీటిని వాడితే మలేరియా, చర్మవ్యాధులపాలయ్యే ప్రమాదం ఉంటుంది. ఏరోజు నీరు ఆరోజు వాడుకోవడం మంచిది’ అని పేర్కొన్నారు.

News March 29, 2025

పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నటి

image

నటి అభినయ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్‌తో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. పుట్టుకతో చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

News March 29, 2025

బయటి జ్యూస్‌లు తాగుతున్నారా?

image

బయటికెళ్లినప్పుడు వేసవి వేడికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ జ్యూస్‌లు తాగేస్తుంటాం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. HYDలో ఫుడ్ హబ్‌గా పేరొందిన DLF ప్రాంతంలో పలు జ్యూస్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. అక్కడ కుళ్లిన పళ్లు, మురికి ఐస్ గడ్డలు, కాలం చెల్లిన పాలు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. దీంతో ఆ షాప్‌లకు అధికారులు నోటీసులిచ్చారు.

News March 29, 2025

కొత్త సినిమా రికార్డు.. రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు!

image

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘L2 ఎంపురాన్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈనెల 27న ఈ చిత్రం విడుదలవగా రెండ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, వీకెండ్ పూర్తయ్యేలోపు మరిన్ని కలెక్షన్లు వస్తాయని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు.

News March 29, 2025

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు

image

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రీల్స్ చూసేటప్పుడు వీడియోను ఫార్వర్డ్ చేయాలంటే కష్టంగా ఉండేది. కొత్త ఫీచర్ ద్వారా వీడియోకు కుడి/ ఎడమ వైపు లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో 2x స్పీడ్‌లో ఫార్వర్డ్ అవుతుంది. మధ్యలో ప్రెస్ చేస్తే వీడియో పాజ్ అవుతుంది. దీంతోపాటు వాట్సాప్‌లా ఇన్‌స్టాలోనూ మెసెంజర్‌లో మన లొకేషన్ పంపొచ్చు.