News August 12, 2024
B12 లోపంతో రక్తహీనత!
విటమిన్ B12 లోపం రక్తహీనత, నరాలు దెబ్బతినడం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ నిర్వహణ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్ B12 సహాయపడుతుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఉత్తర భారతంలోని 47% మందిలో బి12 లోపం ఉన్నట్టు తేలింది.
Similar News
News January 15, 2025
మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా
జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
News January 15, 2025
నన్ను దేవుడే రక్షిస్తాడు: కేజ్రీవాల్
ఖలిస్థానీ వేర్పాటువాదుల నుంచి ప్రాణహాని ఉందన్న వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడే తనను రక్షిస్తాడని, దేవుడు అనుమతించినంత కాలం జీవిస్తానని పేర్కొన్నారు. దేవుడే రక్షించే వారిని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ లక్ష్యంగా ఖలిస్థానీ మద్దతుదారుల హిట్ స్క్వాడ్ ఏర్పడిందని, ఢిల్లీ ఎన్నికల్లో వారు కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసుకున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి.
News January 15, 2025
ఇంటి వద్దకే టెక్నీషియన్లు.. తక్కువ ధరకే సర్వీస్: టీడీపీ
AP: వృత్తిదారులను ఆదుకునేందుకు CM CBN ఆదేశాలతో ‘హోమ్ ట్రయాంగిల్ యాప్’తో మెప్మా ఒప్పందం చేసుకుందని TDP వెల్లడించింది. ‘20వేల మంది టెక్నీషియన్లకు మెప్మా శిక్షణ ఇస్తోంది. TV, AC, ఫ్రిజ్, కంప్యూటర్ తదితర 30 రకాల డివైజ్‌లు పాడైతే టెక్నీషియన్లు ఇంటి వద్దకే వచ్చి తక్కువ ధరకే బాగుచేస్తారు. MAR నుంచి 123 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో టెక్నీషియన్‌కు ₹20-25వేల ఆదాయం వస్తుంది’ అని పేర్కొంది.