News January 17, 2025
BJP మ్యానిఫెస్టో: అబ్బాయిలకూ ఫ్రీ బస్సు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Similar News
News January 17, 2025
రేపు ఉ.10 గంటలకు..
AP: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి APR నెల కోటాను TTD రేపు ఉ.10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్ల కోసం 20వ తేదీ ఉ.10 గంటల వరకు <
News January 17, 2025
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 12 మంది భారతీయుల మృతి
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న 12 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. మరో 16 మంది అదృశ్యమైనట్లు వెల్లడించింది. మొత్తం 126 మంది ఇండియన్స్ యుద్ధంలో పాల్గొనగా 96 మంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రష్యా తరఫున పోరాడుతూ చనిపోయిన విషయం తెలిసిందే. యుద్ధంలో భారతీయుల మరణాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
News January 17, 2025
ఉద్యోగులపై పెండింగ్ కేసులు.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
AP: ఉద్యోగులపై విజిలెన్స్, శాఖాపరమైన కేసుల దర్యాప్తు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం సరికాదని Dy.CM పవన్ అన్నారు. దీనివల్ల వారి పని తీరుపై ప్రభావం పడుతుందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న కేసులపై ఆరా తీశారు. 3 వారాల్లో తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసులను పరిష్కరించడంపై దృష్టిసారించాలన్నారు.