News November 27, 2024
కాంగ్రెస్ విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ నిరసన కార్యక్రమాలు
TG: కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. అదే సమయంలో కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్‌లను ప్రదర్శించనుంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2వేల మందితో నిరసన సభలు ఏర్పాటు చేయనుంది.
Similar News
News November 27, 2024
అఖిల్‌కు కాబోయే భార్య వయసు ఎంతంటే?
అక్కినేని అఖిల్ (30) తన ప్రేయసి జైనబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కంటే వయసులో జైనబ్ 9 ఏళ్లు పెద్ద అని పలు కథనాలు పేర్కొన్నాయి. మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకునే క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. అయితే జైనబ్ వయసు 27 ఏళ్లేనని మరి కొన్ని కథనాలు తెలిపాయి. ఏది ఏమైనా ప్రేమకు వయసు అడ్డు కాదని ఇద్దరి మనసులు కలవడం ముఖ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
News November 27, 2024
కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
AP: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల్లో 35-55KMS వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
News November 27, 2024
బజరంగ్ పునియాకు NADA షాక్
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (NADA) రెజ్లర్ బజరంగ్ పునియాకు షాక్ ఇచ్చింది. డోప్ పరీక్షకు నమూనా ఇచ్చేందుకు నిరాకరించినందుకు 4 ఏళ్ల నిషేధం విధించింది. జాతీయ జట్టు ట్రయల్స్ వేళ గత మార్చి 10న డోపింగ్ టెస్టుల కోసం పునియా శాంపిల్ ఇవ్వలేదు. దీంతో ఏప్రిల్‌లో తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనిపై నాడా క్రమశిక్షణ ప్యానల్‌ను బజరంగ్ ఆశ్రయించగా, విచారణలో దోషిగా తేలడంతో నిషేధం అమల్లోకి వచ్చింది.