India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అనంతపురం JNTUలో ఆగస్టులో జరిగిన Pharm.D 2, 5వ సంవత్సరాల సెమిస్టర్ల, B.Pharmacy 2-1, 2-2 సెమిస్టర్ల, M.Sc 1, 2వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రస్థాయి స్కూల్ రగ్బీ పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ పాఠశాలకు చెందిన హిమబిందు (అండర్-14), హేమసాయి, సుస్మిత (అండర్-17), రుషిందర్, నందిని (అండర్-19) సెలెక్టయ్యారు. స్టాండ్ బైగా చక్రి, వరుణ్ సందేశ్ వ్యవహరిస్తారు. విద్యార్థులను HM నీరజ, పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, సువర్ణ అభినందించారు.

పేద ప్రజలకు అందాల్సిన లబ్ధి అర్హులైన వారికి తప్పకుండా అందాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ నిర్దేశిత లక్ష్యాలు అమలు అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.

అనంతపురం: వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. పథకాలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసే విధంగా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు. యూరియా పంపిణీ అవసరం ఉన్న చోట తప్పకుండా సరఫరా చేయాలని సూచించారు.

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కానీ అనంతపురం జిల్లాలో తాడిపత్రి నుంచి పుట్లూరు మీదుగా గరుగుచింతలపల్లికి వెళ్లే రూట్‌లో మాత్రం ఉచిత ప్రయాణం అమలు కావటం లేదు. ‘మా గ్రామాలకు ఒక్క బస్సు మాత్రమే ఉంది. దిక్కు లేక టికెట్ కొనుక్కుని వెళ్తున్నాం’ అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.