India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అయ్యప్ప స్వాములు ధర్మవరం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర చేపడుతున్నారు. పట్టణంలోని చెరువు కట్ట వద్ద ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి భజన మందిరం గురుస్వామి విజయ్ కుమార్ శిష్యులు 18 మంది సైకిల్పై అయ్యప్ప సన్నిధికి వెళ్తుండగా శనివారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం 5 గంటల యాత్ర ప్రారంభమవుతుందని గురుస్వామి తెలిపారు. సుమారు 788 కి.మీ ప్రయాణించి వారు శబరిమల చేరుకుంటారు.
బొమ్మనహాల్ మండలంలోని గోనేహాళ్ గ్రామంలో శనివారం ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పర్యటించారు. కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, తుంగభద్ర ప్రాజెక్ట్ వైస్ ఛైర్మన్ కేశవరెడ్డితో కలిసి 75 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.
అనంతపురం జేఎన్టీయూ పరిధిలో అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన ప్రీ పీహెచ్డీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాబా దర్శనం కోసం వచ్చేవారు. 2010లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 29వ కాన్విగేషన్ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చారు. అనంతరం 2011లో సత్యసాయి బాబా మరణించిన రోజు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. 2016లో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయని, దీంతో రాకపోకలు స్తంభించి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని టీడీపీ మండల కార్యదర్శి గోవిందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు 16 మందిపై కేసు నమోదైంది.
కడప జిల్లా పర్యటన ముగించుకున్న జగన్ నిన్న శ్రీసత్యసాయి జిల్లా మీదుగా బెంగళూరు వెళ్లారు. ఈక్రమంలో బత్తలపల్లి టోల్గేట్ వద్ద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జగన్ను కలిశారు. ఆయనతో పాటు వైసీపీ అభిమానులు భారీగా వచ్చారు. వైసీపీ అధినేతతో ముచ్చటించడానికి పోటీ పడ్డారు. అందరితో జగన్ కరచాలనం చేశారు. చివరిలో ఇలా సెల్ఫీ తీశారు.
అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో 53వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు.
అనంతపురం జిల్లాలో ఈ నెల 31న ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు. లబ్ధిదారులు అందరూ ప్రతినెలలాగే ఇంటి వద్దే పింఛన్ సొమ్ము పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లాలో 2,53,489 మందికి మొదటి రోజే పంపిణీ చేస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యతో ఆగితే జనవరి 2న ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది నగదు పంపిణీ చేస్తారని వెల్లడించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బాబా దర్శనం కోసం వచ్చేవారు. 2010లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 29వ కాన్విగివేషన్ సర్టిఫికెట్ల ప్రదానం కార్యక్రమానికి ఆయన అతిథిగా వచ్చారు. అనంతరం 2011లో సత్యసాయి బాబా మరణించిన రోజు వచ్చి కన్నీటి పర్వతమయ్యారు. 2016లో సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతన్ జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా ఎస్పీ రత్న హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు హాని జరగకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలో చెట్లు నాటే కార్యక్రమానికి అవసరయ్యే మొక్కలకు నర్సరీలు ఏర్పాటు చేసి పెంచాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.