India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ అన్ని అంశాలలో పూర్తిగా వెనుకబడినట్లు గుర్తించామని, విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా ప్రాజెక్టుల పనితీరు గురించి ఇన్‌ఛార్జ్ పీడీ వరలక్ష్మితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భూముల మార్కెట్ విలువల ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా మార్కెట్ విలువలు నిర్ణయించాలని ఆదేశించారు. ఈనెల 27 లోపు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలన్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. జిల్లాలోని నియోజకవర్గ బాధ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో చేయబోయే ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు, పలు అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97055 22122కు వాట్సాప్ చేయండి.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల నేతలతో మాజీ సీఎం జగన్ నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మీటింగ్ జరగనుంది. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే నేతలంతా అమరావతికి చేరుకున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి జగన్ జిల్లా నేతలతో సమావేశం అవుతుండటంతో ఆసక్తి నెలకొంది.
పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి <<14915888>>బెయిల్<<>> మాంజూరైన విషయం తెలిసిందే. కాగా అనంతపురంలో 2005 జనవరి 24న రవి హత్యకు గురయ్యారు. కార్యకర్తల సమావేశం కోసం జిల్లా టీడీపీ కార్యాలయానికి రాగా ఆయనపై మొద్దుశీను, నారాయణరెడ్డి కాల్పులు జరిపారు. కొందరు బయట బాంబులు వేశారు. కాల్పుల్లో ఆయన చనిపోయారు. ఈ కేసులో మొత్తం 16 మంది నిందితులుగా ఉన్నారు. ఏ-1మొద్దు శీను, ఏ-2 మద్దెలచెరువు సూరి కేసు విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు.
వైసీపీ అధినేత జగన్‌ను ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కలిశారు. కర్నూలులో YCP నేత సురేందర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ వేడుక వీరి కలయికకు వేదికైంది. జగన్, శైలజానాథ్ ఇరువురూ ఆప్యాయంగా పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే శైలజానాథ్‌ను జగన్ YCPలోకి ఆహ్వానించారంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం అనుబంధ రంగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 15 శాతం GSDP వృద్ధి రేటు సాధించాలని కోరారు. సుస్థిర లక్ష్యాలను చేరుకోవడానికి మండలాలు, డివిజన్ల వారీగా నివేదికలు తయారు చేసి, సమర్పించాలని సూచించారు.
సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో మూడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి ప్రాజెక్టు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక డిసెంబర్ 21న జరుగుతుందని తెలిపారు.
అనంతపురం జిల్లాలో కందులు పండించిన రైతుల వద్ద నుంచి ప్రతిరోజూ ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు కందులను కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్‌లో కందుల కొనుగోలు గురించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో, జిల్లా స్థాయి కొనుగోలు కమిటీతో సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.