India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా అనంతపురం నగరానికి చెందిన కేఎల్ దేవి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ.. తనకు పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాన్ని కల్పించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ కోసం కృషి చేస్తానని, మహిళా హక్కుల కోసం పోరాడతానని ఆమె పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా పోలీసు జాగిలం ‘డాలీ’ అందించిన సేవలు మరువలేనివి ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో డాలి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. 11 ఏళ్లు జిల్లా పోలీస్ శాఖకు సేవలందించిందని కొనియాడారు. జిల్లాలో జరిగిన అనేక హత్యలు, దొంగతనాల కేసుల్లో నేరస్థులను పట్టించిందన్నారు. డాలీ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో మహిళ నిరుద్యోగులకు రూడ్ సెట్ శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 4 నుంచి మే 3వ తేదీ వరకు ఉచితంగా ఎస్కే యూనివర్సిటీ పక్కన ఆకుతోటపల్లి శిక్షణ కార్యాలయంలో జర్దోసి మగ్గం, కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు డైరక్టర్ విజయలక్షి తెలిపారు. నెల రోజుల పాటు ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
అనంతపురం నగరంలోని మున్సిపాలిటీ పరిధిలోని అరవింద్ నగర్‌లో AG&P కంపెనీ వారు చేయుచున్న ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటా గ్యాస్ పైప్ లైన్ పనులలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని కలెక్టర్ కాంట్రాక్టర్లకు సూచించారు. పైప్ లైన్ పనులు సజావుగా సాగాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.
మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన, ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసంతో అడుగులు వేయాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం తెచ్చిన దిశ చట్టాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వినోద్ నిర్వహించారు. నిషేధిత జాబితాలో ఉన్న డాటెడ్ ల్యాండ్స్‌ని తొలగించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలు, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతివారం షెడ్యూల్ వేసుకుని జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్స్ కమిటీ నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించిన కేసులపై 10 రోజుల్లోపు చార్జిషీట్ వేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సాధారణ ఎన్నికలు- 2024 అనంతరం జరిగిన హింసపై సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ పి. జగదీశ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింస చాలా సున్నితమైన అంశమన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగల వారికి ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మినీ కాన్ఫరెన్స్ హాల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కుల పరిరక్షణ/అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. గ్రామాలలో పలు అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఎంపీ అంబికా లక్ష్మినారాయణ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జగదీశ్ పాల్గొన్నారు.
ATP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్రీ జర్నీ జిల్లా వరకే పరిమితం.. మీ కామెంట్’ అంటూ వే2న్యూస్ అనంతపురం జిల్లాలో వార్త <<15677166>>పబ్లిష్<<>> చేయగా ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పారు. 41శాతం మంది దీనిని స్వాగతించారు. మరికొందరు ఈ పథకం వద్దని, బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, కాలేజ్ పిల్లల వరకు పరిమితం చేయాలని కొందరు కామెంట్ చేశారు.
Sorry, no posts matched your criteria.