India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా కందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో నిన్న మిద్దె <<14784951>>కూలి<<>> గంగన్న, శ్రీదేవి దంపతులు, కూతురు సంధ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనతో ఆ ఇంట్లో అవ్వ ముత్యాలమ్మ, మనవడు ఈశ్వర్ మాత్రమే మిగిలారు. ఘటన సమయంలో అవ్వ లోపలి గదిలో నిద్రించడం, మనవడు పనిపై అనంతపురం వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈశ్వర్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సహజంగా జరుగుతున్న విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విపత్తు నిర్వహణపై పలు సూచనలు చేశారని కలెక్టర్ తెలిపారు. వాతావరణ శాఖ సూచనలపై ప్రత్యేక దృష్టిని సారించాలని, విపత్తు నిర్వహణలో భాగంగా సమావేశ సహకారాలతో ప్రజలను కాపాడాలన్నారు.
రాష్ట్రంలోని వివిధ బిసి వర్గాల అభ్యర్ధులకు 26 జిల్లాల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్ కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించామని మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవిత మాట్లాడారు. త్వరలో సవిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన(EWS) వర్గాల వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
చిలమత్తూరు మండలం శెట్టిపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇంటి పైకప్పు కూలి ఇద్దరు మృతిచెందారు. బుధవారం సాయంత్రం స్లాబ్ నిమిత్తం అమర్చిన కట్టెలను తొలగిస్తుండగా ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా, శివారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరొకరు చికిత్స పొందుతున్నారు. కాగా, అనంతపురం జిల్లా కందుర్పిలో మిద్దె కూలి <<14784951>>ముగ్గురు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే.
శ్రీ సత్యసాయి జిల్లాలో బ్యాంకర్ల భాగస్వామ్యంతో స్థిరమైన వృద్ధిరేటు సాధనకు కృషి చేద్దామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో లక్ష్యసాధన ప్రగతిపై బ్యాంకర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు భాగస్వాములతో సమన్వయం చేసుకొని అర్హత కలిగిన వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతపురం రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ విజయ లక్ష్మి తెలిపారు. ఈనెల 18 నుంచి జనవరి 17 శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. వయసు 19 నుంచి 45 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. శిక్షణలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని చెప్పారు. ఆసక్తిగల వారు అనంతపురంలోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూ ప్రకంపనల ప్రభావం అనంతపురం జిల్లాపై లేదు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, 2017లో బెళుగుప్ప మండలం జీడిపల్లి, 2019లో ఉరవకొండ మండలం అమిద్యాలలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిన విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన జరిగింది. రెండ్రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి కందుర్పిలో మిద్దె కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు. మృతులు గంగన్న, సంధ్య, శ్రీదేవిగా గుర్తించారు. పాత మిద్దె కావడంతో వర్షానికి నాని కూలినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాలో బుధవారం నుంచి ఆదివారం వరకు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాలిలో తేమ శాతం ఉదయం 83.9% నుంచి 95.1% వరకు ఉండొచ్చని చెప్పారు. అలాగే మధ్యాహ్నం 59.9% నుంచి 68.1% వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈనెల 5న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పర్యటిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. గురువారం ఆనంతపురం నుంచి రోడ్డు మార్గంలో పెనుకొండ కియా పరిశ్రమను పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం అనంతపురంలో జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.