India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గర్భస్థ లింగనిర్ధారణ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో అనాథ పిల్లలను గుర్తించాలన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు కొత్తగా 5 PHCలు, శ్రీ సత్యసాయి జిల్లాకు 4 PHCలు మంజూరు అయ్యాయి. కొత్త పీహెచ్‌సీల మంజూరుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లా నేమకల్లు గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు నేమకల్లు చేరుకుంటారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో లబ్ధిదారులకు పింఛన్ మొత్తం అందజేస్తారు. తర్వాత నేమకల్లు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ప్రజావేదికలో స్థానికులతో ముఖాముఖి అనంతరం తిరుగుపయనం అవుతారు.
బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. పుట్లూరులో 2020లో 6ఏళ్ల చిన్నారి ఆడుకుంటుండగా నిందితుడు అత్యాచారం చేశాడని అమ్మమ్మ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసి సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.3 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని జడ్జి ఆదేశించారు.
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ ఏఎస్ఐ షామీర్ బాషా పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎస్పీ రత్న పాల్గొని షామీర్ బాషా దంపతులను శాలువా పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. షామీర్ విధి నిర్వహణలో అందించిన సేవలు మరువలేనివని ఎస్పీ తెలిపారు. కుటుంబంతో సంతోషంగా జీవించాలని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నవంబర్ 30వ తేదీన చేపడుతున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో 30వ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు సొమ్ము అందిస్తామన్నారు. అందుబాటులో లేని వారికి 2న అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. 2,65,277 మందికి రూ.114.29 కోట్లు ప్రభుత్వం అందించనుందని తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో స్టేషన్లలో 37 మంది హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వీ.రత్న ఉత్తర్వులు జారీ చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు బదిలీ అయిన హెడ్ కానిస్టేబుళ్లు పోస్టింగ్ అయిన స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 1వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనంతపురంలోని ఎస్ఈ విద్యుత్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్ గౌడ్ మాట్లాడుతూ.. మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విధుల్లో వారిని ఒత్తిడికి గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మడకశిర మండలం ఆమిదాలగొంది గ్రామ ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చేతన్ కుమార్ నిన్న అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేడు మడకశిర సరిహద్దులోని కర్ణాటక అటవీ ప్రాంతంలో బాలుడు మృతిచెంది కనిపించాడు. దుండగులే ఎత్తుకెళ్లి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు సంబంధించి వాస్తవ వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.