India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో మంగళవారం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు చిరు సత్కారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా.. ఉత్తమ ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అవార్డు అందుకున్న విషయం విధితమే. ఏపీ జేఏసీ అమరావతి కమిటీ సభ్యులు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపును విరమించుకోవాలని రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడారు. సంపదను సృష్టిస్తా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆస్తులకు కన్నం వేస్తారా? అని ప్రశ్నించారు. వెంటనే రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
SUV సెగ్మెంట్‌లో Kia Syros కారును ఎంజీ బ్రదర్స్ కియా అనంతపురం ప్రతినిధులు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ కారు అద్భుతమైన ఫీచర్స్, పెట్రోల్ & డీజిల్, మాన్యువల్ & ఆటోమేటిక్ వేరియంట్లతో అందుబాటులో ఉందని సీఈఓ ఆదిత్య మాచాని తెలిపారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్, ప్రముఖ యూట్యూబర్ వైభవ్, జీఎం ఎల్లన్న, జీఎం సేల్స్ గిరిప్రసాద్, సేల్స్ మేనేజర్ సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం-గుంటూరు మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. ఎన్‌హెచ్-544డి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.5,417 కోట్లతో 219.8 కిలోమీటర్లను 21 బైపాస్‌లతో 4 లేన్లుగా అప్ గ్రేడ్ చేయనున్నారు. బుగ్గ నుంచి గిద్దలూరుకు 135 కి.మీ, వినుకొండ నుంచి గుంటూరుకు 84.8 కి.మీ మేర నాలుగు వరుసల రహదారి నిర్మించనున్నారు.
అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి సమీపంలో ఉన్న రామప్ప కొండకు ప్రత్యేక చరిత్ర ఉంది. అనాది కాలం నుంచి ఈ కొండపై ఒక్క కాకి కూడా వాలదని వినికిడి. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ కొండపై కాలు మోపారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి నుంచి కాకి వాలని కొండగా దీనిని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ కొండపై కాకి వాలకపోవడం గమనార్హం. శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాడని చరిత్ర.
అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజల తమ సమస్యలను అర్జీల రూపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరగా పరిష్కరిస్తామని బాధితులకు తెలిపారు.
ఉద్యోగ సాధనలో పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని అనంతపురం ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన ఎస్కేయూ విద్యార్థులు 150 మందికి, జిల్లా హోమ్ గార్డులు 20 మందికి ఎస్పీ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పట్టుదల, అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంత జిల్లా పరిపాలన విభాగం జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించిన వ్యక్తులను సత్కరించింది. జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ జి.మమత, జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం అందించిన సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ డిపార్ట్మెంట్ సర్వీస్ విభాగంలో సత్కారాన్ని అందుకున్నారు.
బత్తలపల్లి మండల కేంద్రంలో తమ చిన్నారిని త్రివర్ణ పతాకం డ్రస్సుతో అలంకరించి భారతదేశంపై ఉన్న అభిమానాన్ని ఓ ముస్లిం కుటుంబం చాటుకుంది. సయ్యద్ దాదాపీర్, సయ్యద్ ఫర్హాన దంపతులు తమ చిన్నారి అర్ఫాకు త్రివర్ణ పతాకం రంగులతో కూటిన డ్రెస్‌ను అలంకరించారు. జాతీయ జెండాను పట్టుకొని బత్తలపల్లి 4 రోడ్ల కూడలిలో జై భారత్.. జై భారత్.. అంటూ భారతదేశం గొప్పతనం గురించి కొనియాడారు.
అనంతపురం జిల్లా కలెక్టరేట్లో రేపు (సోమవారం) ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశము సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.