India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ దేహదారుఢ్య పరీక్ష అభ్యర్థులకు వయోపరిమితిపై జీవో 155 ద్వారా నివృత్తి చేసుకోవచ్చని అనంతపురం ఎస్పీ జగదీశ్ కోరారు. వయో పరిమితి ఉన్నా అనుమతించడం లేదంటూ మీడియాలో ప్రచురితమైన వార్తలో నిజం లేదన్నారు. 2022 నవంబర్ 28న ఏపీ పోలీస్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ విడుదల చేసిన నోటిఫికేషన్ క్షుణ్ణంగా గమనించాలన్నారు.
వైసీపీ అనుబంధంగా యువజన విభాగం బలమైన శక్తిగా తయారు కావాలని వైసీపీ అనంతపురము జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే నాయకత్వం బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ఆదివారం కోర్టు రోడ్డులోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం అనంతపురము జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం నగర పరిధిలోని యువజన విభాగం నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!’ అంటూ కొత్త ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ‘VT 15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఇండో-కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్’గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
అనంతపురం JNTUలోని పరిపాలన భవనంలో ఆదివారం యోగి వేమన జయంతిని పురస్కరించుకొని JNTU ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇన్‌ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. ఎంతో అద్భుతమైన పద్యాలతో ప్రపంచానికి జ్ఞానజ్యోతిని వెలిగించిన లోకకవి వేమన అని కొనియాడారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పాటు పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై శనివారం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్యాలు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేసినట్లు రాప్తాడు సీఐ శ్రీహర్ష వెల్లడించారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతా హుస్సేన్ ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారన్నారు. అనంతరం రాందాస్ తండా, బోడే నాయక్ తండాను పరిశీలిస్తారని తెలిపారు. ముదిగుబ్బ మండలం మీదుగా ఉదయం 11 గంటలకు జొన్నల కొత్తపల్లి తండాను సందర్శిస్తారని వెల్లడించారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. MAA ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందచేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జేసీ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా? అని సీఎం మండిపడ్డారు. ఇలాంటి సమావేశాలకు ఎంపీలు రాకపోవడం ఏంటని టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలును ప్రశ్నించారు. ఇకపై మారకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.
నెలలో ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేత పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సూచించారు.
ఫిబ్రవరి 13, 14, 15వ తేదీల్లో సేవాఘడ్లో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం రెవెన్యూ భవనంలో ఫిబ్రవరిలో గుత్తి పరిధిలో నిర్వహించే సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలపై ఆయాశాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.