Anantapur

News March 13, 2025

ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

image

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.

News March 13, 2025

స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

image

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.

News March 12, 2025

రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

image

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.

News March 12, 2025

రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

image

ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం అనంతపురంలోని ఆదిమూర్తి నగర్లో ఉన్న జిల్లా హార్టికల్చర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు.

News March 12, 2025

తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

image

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.

News March 12, 2025

ఫ్రీ హోల్డ్ సర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం వారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల PGRS అర్జీలను త్వరితగతిన పూర్తి చేయాలని, రెండో విడత రీ సర్వేకు సంబంధించి మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే పనులు ప్రారంభించాలన్నారు. ఫీడ్ బ్యాక్ తదితర అంశాలపై కలెక్టర్‌తో సీసీఎల్ఏ & స్పెషల్ సీఎస్ జయలక్ష్మి సమీక్ష నిర్వహించారు.

News March 11, 2025

ATP: అన్ని అంశాల్లో జిల్లా టాప్ – 6లో ఉండాలి- కలెక్టర్

image

పంచాయతీ సెక్టర్, GSWS తదితర అంశాలలో అనంతపురం జిల్లా టాప్ – 6లో ఉండేందుకు అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పలు శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. MSME సర్వేలో పురోగతి తీసుకొచ్చి 24 గంటల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 11, 2025

పోలీసులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ

image

గుంతకల్లు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశాన్ని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ నిర్వహించారు. జవాబుదారీగా పని చేసి ప్రజలతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచి, కేసులు తగ్గించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాల అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News March 11, 2025

సోమందేపల్లిలో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

సోమందేపల్లిలోని పాతఊరులో మంగళవారం విద్యార్థిని పూజిత (15) ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఈడిగ సురేశ్, సుధారాణిల కుమార్తె పాపిరెడ్డిపల్లిలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం విద్యార్థి ఇంటిలో ఉరేసుకుని మరణించింది. విద్యార్థి తన చావుకు ఎవరికి ఎటువంటి సంబంధం లేదు నాన్న అని రాసి ఉన్న లెటర్‌ను ఎస్ఐ రమేశ్ బాబు, ఏఎస్ఐ మురళి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2025

ATP: విద్యాశాఖ అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

image

నాణ్యమైన విద్య, మంచి సౌకర్యాలు కల్పించేలా విద్యాశాఖ, అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. GO నంబర్ 117 తో గతంలో 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో కలపడం జరిగిందని, బేసిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. 3 కి.మీ లోపల హైస్కూల్ లేని చోట తగు ఏర్పాట్లు చేసి, రవాణా సౌకర్యం కల్పించాలన్నారు.