India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురంలో నేడు ‘డాకు మహారాజ్’ టీమ్ సందడి చేయనుంది. శ్రీనగర్‌కాలనీ అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలోని ఖాళీ ప్రాంతంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా సినీ తారలు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతపురానికి వస్తున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్ రానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈవెంట్ ప్రారంభంకానుంది.
మడకశిర మండలం కల్లుమర్రికి చెందిన శివప్ప, పరిగి మండలం నరసాపురానికి చెందిన ప్రవీణ్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మడకశిర కోర్టు తీర్పునిచ్చింది. కల్లుమర్రిలో 2022లో జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. వీరిని కోర్టులో హాజరు పరచగా.. రూ.10 వేల జరిమానా, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది.
అనంతపురంలో నేడు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు యాంకర్ సుమ సిద్ధమయ్యారు. హలో అనంతపురం అంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘మీ ప్రశ్నలు, ఉల్లాసకరమైన మీమ్‌లను పంపండి. వాటిని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మా మాస్ ఆఫ్ గాడ్ నందమూరి బాలకృష్ణ, డాకు టీమ్‌ను అడిగి సమాధానాలు రాబట్టేందుకు నా వంతు కృషి చేస్తా’ అని రాసుకొచ్చారు. కాగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభంకానుంది.
కదిరిలో స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వైకుంఠ ఏకాదశి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. ఈనెల 10న తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం ద్వారాలు తెరచి శుద్ధి వచనం, విశేష పూజ, మహా మంగళహారతి ఉంటుందని అర్చకులు తెలిపారు. అనంతరం 3.30 గంటల నుంచి ఉత్తర ద్వార ప్రవేశం భక్తులకు కల్పిస్తామని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకే చోట కనిపించారు. తాడిపత్రిలో జరుగుతున్న క్రికెట్ పోటీలను వారు తిలకించారు. ప్లేయర్లును ఉత్సాహపరిచారు. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకచోట కనిపించడంపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
విశాఖ వేదికగా జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. వివరాలు ఇలా..
☛ రూ.160 కోట్లతో తాడిపత్రి బైపాస్ 4 వరుసల విస్తరణకు శంకుస్థాపన
☛ రూ.352 కోట్లతో గుత్తి-పెండేకల్లు రైల్వే డబ్లింగ్ పనులకు శంకుస్థాపన
☛ మడకశిర-సిర, ముదిగుబ్బ బైపాస్, బత్తలపల్లి-ముదిగుబ్బ నాలుగు వరుసల రహదారి ప్రారంభోత్సవం
☛ రూ.998 కోట్ల నిర్మించిన గుత్తి-ధర్మవరం రైల్వే లైన్ ప్రారంభోత్సవం
అనంతపురంలో రేపు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. తొలుత ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ ప్లాన్ చేయగా తాజాగా పోలీస్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీంతో నిర్మాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతకు తరలిరానున్నారు. మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.
అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని వేణుగోపాల్ నగర్‌లో ఉండే పుష్పావతి అనే వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కుల గణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అన్ని తనిఖీలు పూర్తిచేసి ఈనెల 20న వివరాలను విడుదల చేస్తారన్నారు.
రెవెన్యూ సదస్సులలో సమస్యలను పారదర్శకంగా పరిష్కరించుకుని, అభివృద్ధి బాటలో నడవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం గుత్తి మండలం ధర్మాపురంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుల ద్వారా రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించారు. రైతులందరూ పరస్పర సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.