Anantapur

News January 7, 2025

ఎస్సీ కులగణ‌నపై 12వ తేదీ వరకు అభ్యంతరాల‌ స్వీకరణ: కలెక్టర్

image

ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల (ఆడిట్ ప్ర‌క్రియ) స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు అనంతపురం కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. జనవరి 7వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రో 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు అందించిందన్నారు. ఎస్‌వోపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు.

News January 7, 2025

కదిరి మార్కెట్ యార్డులో దొంగ నోట్ల కలకలం

image

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మార్కెట్ యార్డులో మంగళవారం దొంగ నోట్లు కలకలం రేపాయి. గొర్రెల సంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి నాగేశ్ అనే రైతు వద్ద గొర్రెలు కొనుగోలు చేశాడు. అందుకు రూ.32,000 దొంగ నోట్లు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని మరో వ్యక్తి ద్వారా తెలుసుకున్న బాధితుడు లబోదిబోమన్నాడు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News January 7, 2025

కోర్టు కేసుల పరిష్కారంలో జవాబుదారీతనం ఉండాలి: కలెక్టర్

image

కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులకు జవాబుదారీతనం ఉండాలని అనంతపురం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కోర్టు కేసులపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్ అధికారులను నియమించామన్నారు.

News January 7, 2025

7వ రోజు కొనసాగిన దేహదారుఢ్య పరీక్షలు

image

అనంతపురంలోని నీలం సంజీవ రెడ్డి మైదానంలో జరుగుతున్న పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు 7వ రోజూ (మంగళవారం) కొనసాగాయి. ఉదయమే ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను ఎస్పీ పీ.జగదీశ్ దగ్గరుండి పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

News January 7, 2025

కదిరిలో బాలయ్య కటౌట్

image

అనంతపురం జిల్లాలో బాలయ్య ఫ్యాన్స్ సందడి మొదలైంది. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజ్ కానుండటంతో ఆయా మండల కేంద్రాల్లో ‘డాకు’ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. థియేటర్ల వద్ద నందమూరి ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కదిరిలోని సంగం థియేటర్ వద్ద బాలయ్య నిలువెత్తు కౌటౌట్ ఏర్పాటు చేయగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ మూవీ ప్రీ రిలీజ్ <<15084871>>ఈవెంట్<<>> అనంతపురంలో జరుగుతుండటంతో జిల్లాలో ‘డాకు’ ఫీవర్ కనిపిస్తోంది.

News January 7, 2025

ఆర్టీసీ బస్సులో రఘువీరారెడ్డి జర్నీ

image

కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి నీలకంఠాపురం చంద్రబావి గేట్ నుంచి బెంగళూరుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వెళ్లారు. సామాన్య ప్రయాణికుడిలా తన లగేజీని తానే లగేజీ క్యారియర్‌పై పెట్టి బెంగళూరుకు టికెట్ తీసుకోని ప్రయాణించారు. అయనను చూసి బస్సులోని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రఘువీరా సింప్లిసిటీకి ఫిదా అయ్యారు.

News January 7, 2025

అనంతకు ‘డాకు’ టీమ్

image

అనంతపురంలో ఈ నెల 9న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే. సినీ తారలు సీమకు తరలిరానున్నారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతలో సందడి చేయనున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నారా లోకేశ్‌ రానున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఈ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ జరగనుంది.

News January 7, 2025

JNTUA పరీక్షా ఫలితాలు విడుదల

image

అనంతపురం JNTU పరిధిలో గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో నిర్వహించిన MBA 3, 4 సెమిస్టర్లు, MCA 3, 4, 5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News January 7, 2025

‘అనంతపురం జిల్లాలో హెచ్ఎంపీవీ కేసులు లేవు’

image

చైనాలో గుర్తించిన హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఈ బి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. న్యూమో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.

News January 6, 2025

కూడేరు: రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపిన దున్నపోతు

image

కూడేరు మండలంలో ఓ దున్నపోతు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. అమ్మవారికి విడిచిన దున్నపోతు తమదంటే తమదని కడదరకుండ, ముద్దలాపురం గ్రామ ప్రజలు వాదనలకు దిగారు. అయితే ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారి సోమవారం అనంతపురం ఎస్పీ కార్యాలయానికి చేరింది. దీంతో ఇరు గ్రామాల వారు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. 

error: Content is protected !!