India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కుందుర్ప మండలం నిజవల్లిలో శనివార విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేఖ అనే యువతి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. ఆత్మహత్యకు కారణాలు తెలియ రాలేదు. ఈ ఘటనపై ఎస్ఐ మహేశ్ దర్యాప్తు చేపట్టారు.

14 ఏళ్ల తర్వాత అనంతపురంలో సినీ బుల్లితెర నటులు క్రికెట్ ఆడేందుకు తరలి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని ఆర్డీటీ స్టేడియం వేదికగా శ్రేయాస్ గ్రాండ్ ఆధ్వర్యంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు జరిగాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోటీలను నిర్వహిస్తున్న శ్రేయాస్ గ్రాండ్ అధినేత శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. సినీ హీరోలు రాకతో ఒక పాజిటివ్ వాతావరణ ఏర్పడిందన్నారు.

విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డీఈవో ప్రసాద్ బాబు పేర్కొన్నారు. అనంతపురంలోని ఎస్ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 21, 22వ తేదీలలో “పిల్లల పండగ” నిర్వహిస్తున్నామన్నారు. బాలోత్సవం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కూడా విడుదల చేశామన్నారు. విద్యార్థులలో సృజనాత్మకతను బయటకు తీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఈవో తెలిపారు.

గుత్తిలోని బీసీ కాలనీలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి శనివారం ఉదయం పింఛన్ తీసుకున్న అరగంటకే ప్రాణాలు విడిచారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మీయ చేతుల మీదుగా ఆయన పింఛన్ నగదు అందుకున్నారు. ఒకరోజు ముందుగానే పింఛన్ అందిన ఆనందంలో ఉన్న ఆ కుటుంబంలో, ప్రతాప్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.

అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు సత్వరమే అనుమతులు ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులకు సూచించారు. అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఆయా శాఖల అధికారులతో పరిశ్రమల ఏర్పాటు, ప్రోత్సాహకాలపై సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తే వారు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు, జరిమానాల కోసం కాకుండా ప్రాణ రక్షణ కోసమే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 200 మంది డ్రైవర్లకు ECG, 2డీ ఎకో, కంటి, దంత పరీక్షలను GGH వైద్యుల చేత నిర్వహించామన్నారు. రోడ్డు భద్రత ఒక బాధ్యత కాదని, అది మనందరి కర్తవ్యమని అన్నారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు ప్రధాన కారణాలని సూచించారు.

అనంతపురం జిల్లాలో కొత్త బార్ పాలసీలో భాగంగా 7 బార్ల దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురంలో మూడు, గుంతకల్లులో రెండు, తాడిపత్రి, రాయదుర్గంలో ఒక్కో బార్ కోసం జిల్లా ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి గెజిట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 4న దరఖాస్తులు స్వీకరించి, 5న లాటరీ నిర్వహిస్తారు. అప్లికేషన్ కోసం రూ.5లక్షల డీడీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

భారత క్రికెటర్ నితిన్ కుమార్ అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులను అప్యాయంగా దగ్గరకు పిలుచుకుని వారితో సరదాగా ఫొటోలు దిగారు. అనంతరం బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ చేసి ఆలూరు విరాట్ అనే బాలుడికి బహుమతిగా అందజేశారు. స్టార్ క్రికెటర్ తమతో సమయం గడపడమే కాకుండా, సిగ్నేచర్ చేసిన బ్యాట్ ఇవ్వడంతో చిన్నారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన ఇల్లూరు ప్రవీణ్ కుమార్ గ్రూప్-2 ఉద్యోగం సాధించాడు. ప్రవీణ్ కుమార్ ఎక్కడా కోచింగ్‌కు వెళ్లకుండా సొంతగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. కాగా, మొన్న విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో పోస్టు సాధించి ప్రస్తుతం కడపలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్రూప్స్-2లో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించాడు.
Sorry, no posts matched your criteria.